మగవారికి ప్రవేశం లేని ఆ ఆలయాలు ఎక్కడ ఉన్నాయి?

మన దేశంలో ఆడవారికి ప్రవేశం లేని ఆలయాలు కొన్ని ఉన్నవి, అలానే మగవారికి కూడా కొన్ని ఆలయాలలోకి ఇప్పటికి ప్రవేశం అనేది లేదు. మరి మగవారికి ప్రవేశం లేని ఆ ఆలయాలు ఎక్కడ ఉన్నాయి? ఎందుకు ఆ ఆలయాలలోకి మగవారికి ప్రవేశం లేదనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

భగవతి ఆలయం:

Men Are Strictly Prohibited

కేరళ రాష్ట్రం, త్రివేండ్రం లో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయంలో భద్రకాళి అమ్మవారు పూజలందుకుంటున్నారు. ఇక్కడ వెలసిన భద్రకాళి మాతను చెట్టి కులంగార భగవతి అనే పేరుతో భక్తులు పిలుస్తుంటారు. ఈ ఆలయంలో 4 మిలియన్ ల మంది ఆడవారు పొంగల్ పండుగ జరిపి గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించారు. ఈ పండుగలో కేవలం ఆడవారు మాత్రమే పాల్గొనాలి.

బ్రహ్మ దేవుడి ఆలయం:

Men Are Strictly Prohibited

రాజస్థాన్ లోని పుష్కర్ లో బ్రహ్మ దేవుడు ఆలయం ఉంది. ఈ ఆలయంలో మగవాళ్లకు ప్రవేశం లేదు. కారణం ఏంటంటే, పూర్వం బ్రహ్మ యజ్ఞం చేయాలనుకుని నిశ్చయించుకున్నప్పుడు సరస్వతి దేవి అతని పక్కన ఉండదు. బ్రహ్మ, గాయత్రి అనే మహిళను పెళ్లి చేసుకొని యజ్ఞాన్ని పూర్తిచేస్తాడు. అందువలన సరస్వతి దేవికి ఆగ్రహం వచ్చి, ఈ ఆలయంలోకి వివాహం అయిన పురుషులు ప్రవేశించకూడదని, ఒకవేళ వస్తే వారికి దాంపత్య సమస్యలు వస్తాయని శపిస్తుంది. అందుకే ఆ ఆలయానికి పెళ్ళైన మగవాళ్ళు వెళ్ళరు.

దుర్గామాత ఆలయం:

Men Are Strictly Prohibited

కేరళ రాష్ట్రంలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయం పంపా నది ఒడ్డున ఉంది. ఈ ఆలయంలో భగవతి మాత పూజలందుకుంటుంది. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం చేసే నారి పూజ చాలా పేరుగాంచింది. ఈ రోజుల్లో కేవలం ఆడవారికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఈ పూజ సందర్బంగా ఆడవారు ఆలయానికి లక్షల్లో వస్తుంటారు.

కామాఖ్యా దేవి:

Men Are Strictly Prohibited

అస్సాంలోని గౌహతి లో ఒక కొండ ప్రాంతంలో కామాఖ్యాదేవి ఆలయం ఉంది. ఈ దేవి అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా ప్రసిద్ధి గాంచినది. ఈ ఆలయం ఒక చిన్న కొండ మీద ఉంది. ఈ కొండ సాక్షాత్తు శంకరుని శరీరమే అని సతీదేవి శరీరంలో నుంచి ఆమె యోని భాగం ఈ కొండ మీద పడగానే ఈ కొండ మొత్తం నీలం రంగు మారిందని అందువలన ఈ కొండని నీలాచలం అంటరాని పురాణం. ప్రతి సంవత్సరం రుతుపవన సమయంలో అమ్మవారి రుతుస్రావం సమయంలో మూడు రోజులు ఆలయాన్ని మూసివేస్తారు. ఆ మూడు రోజులు భక్తులు అంబు బాచి మేళ అని జరుపుకుంటారు.

కన్యాకుమారి ఆలయం:

Men Are Strictly Prohibited

దేశంలోని 51 శక్తీ పీఠాలలో ఒకటైన కన్యాకుమారి లో దేవీ ఆలయంలో ప్రధాన దేవత దుర్గా మాత అమ్మవారిని భాగతీ మాత గా పిలుస్తారు. ఈ ఆలయంలో కూడా పురుషులు వెళ్లరు

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR