వైద్యనాధుడిగా పిలవబడే శివుని మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది?

ఆయుర్వేద స్వరూపుడైన ధన్వంతరి శివుడి కోసం ఇక్కడ తపస్సు చేయగా శివుడు వైద్యనాధునిగా దర్శనమిచ్చి, వైద్య విద్యని ప్రచారం చేసి ఔషధ రహస్యాలను లోకానికి వెల్లడించమని ఆదేశించాడు. అందుకే ఇచట వెలసిన శివుడిని వైద్యనాధుడిగా పిలుస్తారు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయంలోని విశేషాలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Temple Of Lord Shiva

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, వై.ఎస్.ఆర్. కడపజిల్లా, పుష్పగిరి గ్రామంలో, పినాకిని నది తీరాన శ్రీ వైద్యనాదేశ్వరాలయం కలదు. ఇది చాలా ప్రాచీన దేవాలయం. శివ స్వరూపుడైన వైద్యనాథేశ్వరునికి, విష్ణు స్వరూపుడైన చెన్నకేశవునికి నిలయమైన పుష్పగిరి క్షేత్రం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. పంచనదీ సంగమక్షేత్రంగా వాసికెక్కింది. ప్రతి సంవత్సరం చైత్ర బహుళ త్రయోదశి నుంచి వైశాఖ శుద్ధ సప్తమి వరకు పుష్పగిరిలోని శ్రీ కామాక్షీ వైద్యనాథేశ్వర, శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వార్ల బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.

Temple Of Lord Shiva

స్కంద పురాణంలోని శ్రీశైల ఖండం పుష్పగిరిని విశేషంగా పేర్కొంది. ఇందులో పుష్పగిరి క్షేత్రంగానే కాక తీర్థంగా కూడా కొనియాడబడింది. పుష్పగిరిలో ఒక్కరోజు ఉపవాసం వుండి ఆయా దేవతలను దర్శిస్తే ఈలోకంలోనే కాక పరలోకంలో కూడా సౌఖ్యం లభిస్తుందని స్థల పురాణం చెపుతోంది. సూర్యగ్రహణ సమయంలో కానీ, అక్షయతృతీయ రోజున గానీ సంకల్ప పూర్వకంగా పినాకినీలో స్నానం చేసి శివ కేశవులను దర్శిస్తే వంద అశ్వమేధ యాగాలు చేసిన ఫలం లభిస్తుందని విశ్వాసం. ఇక్కడ శ్రాద్ధ కర్మలు చేయడం ఎంతో ఫలదాయకమని, గయ క్షేత్రంలో చేసే పిండ ప్రదానంతో సమానమైన ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రం ఇక్కడ ప్రవహిస్తున్నపినాకినీ నది పాపాగ్ని, కుముద్వతి, వల్కల, మాండవి నదుల సంగమమై ప్రవహిస్తూ పంచ నదీ సంగమంగా వాసికెక్కింది. ఇక్కడ స్నానాలాచరిస్తే సకల పాపాలూ హరిస్తాయని భక్తులు విశ్వసిస్తారు.

Temple Of Lord Shiva

ఇక పూర్వం ఒక ఇతిహాసం ప్రకారం శ్రీ రామచంద్రుడు రావణుని సంహరించేందుకు లంకకు వెళుతూ ఈ ప్రాంతంలో కొంతకాలం న్నాడు. ఆయన ప్రతిరోజూ ఇక్కడి వైద్యనాథేశ్వరుని పుష్పాలతో పూజించి, ముందురోజు పూజకుపయోగించిన పూలను తీసి నదిలో వేసేవాడు. కొన్నాళ్లకు ఆ పూల రాసి క్రమంగా కొండంత పెరిగి, నీటిలో తేలియాడింది. దీంతో పుష్పగిరి అనే పేరు వచ్చిందనే కథ ప్రచారంలో వుంది.

Temple Of Lord Shiva

శ్రీ జగద్గురువు ఆది శంకరాచార్యుల చేతుల మీదుగా దక్షిణాదిలో స్థాపించబడిన ఏకైక అద్వైత పీఠంగా పుష్పగిరిలోని పీఠం ప్రఖ్యాతి గాంచింది. స్వయంగా ఆది శంకరాచార్యుల శిష్యులైన శ్రీ విద్యారణ్య భారతి స్వామి అధిష్టించి ధర్మపాలన చేసిన పీఠం. ఈ పీఠంలోని మహిమాన్విత చంద్రమౌళీశ్వరుని రూప స్ఫటిక లింగం కైలాసం నుండి నేరుగా ఇక్కడి పీఠంలో వెలసిందని ప్రతీతి. ఈ స్ఫటిక లింగానికి అనునిత్యం పూజలు జరుగుతాయి.

Temple Of Lord Shiva

పుష్పగిరిలోని వైద్యనాథేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో వున్న శ్రీ కామాక్షీదేవి ఆలయంలో అమ్మవారికి ఎదుట ఎంతో విశిష్టత కల శ్రీచక్రం వుంది. చతుర్దశ భువనాలకు అధికారిణి అయిన కామాక్షీ దేవి శ్రీచక్ర సంచారిణి అని ప్రతీతి. ఇక్కడి అమ్మవారి ఎదుట బిందు, త్రికోణ, వసు కోణాలతో దాదాపు 27 అంగుళాల ఎత్తు వున్న మహామేరువు శ్రీచక్రం విజయనగర రాజ్య స్థాపనకు హరి హర బుక్క రాయలను ప్రేరేపించిన శ్రీ విద్యారణ్య స్వామి ప్రతిష్టితమని స్థలపురాణం చెబుతోంది.

Temple Of Lord Shiva

ఇలా ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి ఎప్పుడు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించి పుణ్యుతులవుతుంటారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR