Amavasya Erpadataniki Kaaranam Enti?

మనలో చాలా మంది అందంగా ఉన్నవారిని చందమామతో పోలుస్తుంటారు. ఎందుకంటే అందానికి ప్రతి రూపం చందమామగా చెబుతుంటారు. అయితే అలాంటి చందమామ మనకు నెలలో 15 రోజులు పెరుగుతూ పౌర్ణమి రోజు పూర్తిగా దర్శనమిస్తే, 15 రోజులు క్రమంగా తగ్గిపోతూ అమావాస్య రోజున కనపడకుండా పోతాడు. చంద్రుడు ఇలా దర్శనం ఇవ్వడానికి కారణం శాపానికి గురి కావడమే. మరి చంద్రుడు ఎందుకు శాపానికి గురైయ్యాడు? ఆయనను శపించింది ఎవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఇక పురాణానికి వస్తే, దక్షప్రజాపతి కి అందమైన ఇరవై ఏడుగురు నక్షత్ర కన్యలు కుమార్తెలు. ఈ ఇరవై ఏడుగురు నక్షత్ర కన్యలని దక్షప్రజాపతి చంద్రునికి లేచి వివిహం చేస్తాడు. అయితే చంద్రుడు వారందరితోను అనురాగంగా ఉండేవాడు కానీ కొంచెం ఎక్కువ ఇష్టాన్ని రోహిణిపైన చూపించేవాడు. ఇది చూసిన మిగతావారు చాలా అసూయా చెందేవారు. ఇలా కొన్ని రోజులు చూసిన వారు పుట్టినిల్లుకు వెళ్లి కంట తడి బెడుతూ ఈ విషయాన్ని దక్షప్రజాపతి కి వివరిస్తారు. Amavasyaఆ సమయంలో వారి పైన జాలిపడిన దక్షప్రజాపతి చంద్రుణ్ణి పిలిపించి అందరిని సమంగా చూసుకోవాలి అంటూ హెచ్చరిస్తాడు. కానీ చంద్రుడు తిరిగి మరల అదే విధంగా చేస్తుండడంతో ఆగ్రహానికి గురైన దక్షప్రజాపతి ల్లుడని కూడా ఆలోచించక, చంద్రుడికి క్ష్యయవ్యాధి కలగాలని శపిస్తాడు. ఆ కారణంగా చంద్రుడు నానాటికీ క్షీణించిపోసాగాడు. అతని నుండి వెన్నెల వర్షించటం ఆగిపోయింది. లతలు, వృక్షాలు వాడిపోయాయి. రాత్రులు గాఢాంధకారంతో నిండి, భయంకరంగా మారాయి. ఆ చీకటిలో రాత్రించరులైన రాక్షసులు విచ్చలవిడిగా సంచరించటం ప్రారంభించారు. Amavasyaలోకాలకు ఉల్లాసం కలిగించే చంద్రుడు అలా నానాటికీ కృశించిపోవటం చూసి ఇంద్రాది దేవతలు, వశిష్ఠాది మహర్షులు దుఃఖించి, చంద్రుణ్ని పిలుచుకొని బ్రహ్మ వద్దకు వెళ్లి, చంద్రుడికి రోగ విముక్తి కలిగించమని ప్రార్థించారు. బ్రహ్మ చంద్రుడితో, సుధాకరా! నువ్వు ప్రభాస క్షేత్రానికి వెళ్లి మృత్యుంజయుడైన పరమ శివుణ్ని గూర్చి తపస్సు చెయ్యి. దానివల్ల నీ క్షయవ్యాధి పోయి విశ్వశాంతి ఏర్పడగలదు అన్నాడు. Amavasyaచంద్రుడు బ్రహ్మ చెప్పిన విధంగా ఆరు మాసాలపాటు తపస్సు చేశాక, ఈశ్వరుడు భవానీ సమేతంగా ప్రత్యక్షమై, వత్సా! దక్షశాపం వల్ల కృశించిపోతున్నానని విచారపడకు. నీకు కృష్ణ పక్షంలో ప్రతిరోజూ ఒక్కొక్క కళ క్షీణిస్తుంది. ఈ విధంగా నువ్వు నెలకొకసారి పూర్ణ చంద్రుడివై ప్రకాశిస్తావు అని వరమిచ్చాడు. ఇలా ఈశ్వరుడి అనుగ్రహం వల్ల చంద్రుడికి పదహారు కళలు లభించాయి. Amavasyaఈ విధంగా శాపానికి గురైన చంద్రుడు పరమ శివుడి అనుగ్రహంతో శాపవిమోచనం పొందాడు.Amavasya

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR