Akkada puttaki prathyekanga mandapam endhuku nirmincharu?

0
2930

మన సంప్రదాయంలో పాముని దైవంగా భావించి నాగులచవితి కూడా జరుపుకుంటాము. ఇక అనేక దేవాలయాల్లో నాగరాజు విగ్రహాలు మనకి దర్శనం ఇస్తాయి. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఇక్కడ వెలసిన పుట్టకి ఒక మండపాన్ని నిర్మించారు. మరి ఇక్కడ ఎందుకు పుట్టకి మండపాన్ని నిర్మించారు? ఈ ఆలయ స్థల పురాణం ఏం తెలియచేస్తుంది అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. puttakiఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణాజిల్లా, గుడివాడ మండలం నుండి 18 కి.మీ. దూరంలో శింగరాయపాలెం అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారి ఆలయం ఉంది. ఈ ఆలయంలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి వారు దర్శనం ఇస్తారు. ఇక గర్బాలయంలో ఐదు పడగల నాగేంద్రుని విగ్రహం దర్శనం ఇస్తుంటుంది. ఇక ఈ ఆలయ ప్రాంగణంలోనే పాలు పొసే పుట్టకి కూడా మండపం నిర్మించబడి ఉంది. puttakiపురాణ విషయానికి వస్తే, కొన్ని సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో ఒక దేవత సర్పరాజము శ్రీ బావాజీ మాటములో నుండి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం తటాకములోకి వచ్చి స్నానం చేసి తిరిగి వెళుతుండగా అక్కడ ఉన్న ఇద్దరు రైతులు పాముని చూసి రాళ్ళూ విసరగా ఆ సర్పం నేలకి తలని బాదుకొని మరణించింది. అదిచూసిన గ్రామస్థులు అది దేవత సర్పంగా భావించి కాలువ గుట్టపై పాతిపెట్టారు. puttakiఆ పాము పైన రాళ్ళూ విసిరిన పాపానికి కంటిచూపు కోల్పోయిన ఆ రైతు సోదరులు నాగేంద్రుని ప్రార్ధించి తెలియక చేసిన పొరపాటు అని మన్నించి చూపు ప్రసాదించమని వేడుకొనగా వారికీ చూపు తిరిగి వచ్చినది. అప్పుడు గ్రామస్థులు ఆ మహిమ చూసి వారు చేసిన అపరాధాన్ని మన్నించమని వేడుకుంటూ పాతి పెట్టబడిన సర్పమును వెలికితీసి ఊరేగించి దహన సంస్కారాలు చేసి ఆ ప్రదేశంలోనే శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి వారికీ ఆలయాన్ని నిర్మించారు. puttakiఇలా వెలసిన ఈ మహిమ గల ఈ ఆలయానికి రోజు రోజుకి భక్తుల రద్దీ అనేది విపరీతంగా పెరుగుతూ వస్తుంది.puttaki