Battalu vuthikina neellu kaalla meeda posukunte manchidi kaadha?

0
3127

బట్టలు ఉతికిన నీళ్లు కాళ్ల మీద పోసుకుంటే పుట్టింటికి అరిష్టం అని చెబుతుంటారు పెద్దలు. ఈ మాట వెనుక ఎంతో నిజం ఉంది.4 Washing Clothes అదియేమిటంటే.. ఇంట్లో పనుల వల్ల ఆడవాళ్లు ఎక్కువ సమయాన్ని నీటిలో గడుపుతుంటారు. అలా చేయడం వల్ల కాళ్లకు, చేతులకు పగుళ్లు వస్తాయి. అది గమనించిన తక్కువమంది మాత్రమే జాగ్రత్తులు తీసుకుంటుంటారు. మిగిలిన 90  శాతం మంది ఆడవాళ్లు  పని ఒత్తిడిలో పడి పగుళ్లను పట్టించుకోరు. జాగ్రత్తలు తీసుకోని వారు, గుడ్డలుతికిన నీటిని కాళ్లపై పోసుకోవడం వల్ల ఆ నీటిలోని క్రిములు శరీరంలోకి ప్రవేశించి అనారోగ్యాన్ని కలిగిస్తాయి. అప్పుడు భర్త పుట్టింటికి పంపిస్తాడు. కూతురు సంతోషంగా, ఆరోగ్యంగా ఇంటికి వస్తే తల్లిదండ్రులు ఆనందిస్తారు. అంతేకాని బాధపడుతూ వస్తే వారూ బాధపడతారు.3 Washing Clothes అందుకే బట్టలుతికిన నీళ్లు కాళ్ల మీద పోసుకుంటే పుట్టింటికి అరిష్టం అని చెప్పితేనైనా అమ్మాయిలు జాగ్రత్తగా ఉంటారని పెద్దలు ఈ మంచి మాటని ప్రచారం చేశారు.1 Washing Clothes