Bhakthula Hrudayalalo Nilichipoina Sai Baba

భారతదేశంలో ప్రసిద్ధ దేవాలయాలలో సాయిబాబా కొలువై ఉన్న షిర్డీ ఒకటిగా చెబుతారు. సాయిబాబాకి పుట్టినిల్లు షిర్డీ. అయితే షిర్డీ కాకుండా సాయిబాబా కొలువై ఉన్న ఆలయంలో దేశంలో ఎన్నో ఉన్నాయి. ఇక దక్షిణాన సాయిబాబా కొలువై ఉన్న ఈ ఆలయాన్ని దక్షిణ షిర్డీ గా భక్తులు భావిస్తారు. ఈ ఆలయంలోని బాబాని దర్శిస్తే షిరిడీ సాయిబాబాని దర్శించినంత అనుభూతిని పొందుతున్నారు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.Sai babaతెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్, దిల్ సుఖ్ నగర్ జాతీయ రహదారి ప్రక్కన శ్రీ షిరిడీ సాయిబాబా వారి దేవాలయం కలదు. ఈ ఆలయం పూర్తిగా షిరిడీలో ఉన్న సాయిబాబా ఆలయాన్ని పోలి ఉంటుంది. అందువలన ఈ ఆలయాన్ని దక్షిణ షిరిడీ గా భక్తులు పిలుస్తారు. ఇక హైదరాబాద్ నగరంలో ఎన్నో సాయిబాబా ఆలయాలు ఉన్నప్పటికీ ఇక్కడ వెలసిన ఈ ఆలయానికి ప్రత్యేక గుర్తింపు అనేది ఉంది. Sai babaపూర్వం ఒకప్పుడు చిన్న ఆలయంగా ఉన్న ఈ దేవాలయం నేడు ఆధునిక ఆలయ సముదాలతో విరాజిల్లుతుంది. భక్తులు ఈ ఆలయంలోని బాబాను దర్శిస్తే షిరిడీలోని బాబాను దర్శించినంత అనుభూతిని పొందుతున్నారు. భక్తుల కోర్కెలు ఈ బాబా నెరవేరుస్తునట్లు భక్తులలో ఒక భావన ఏర్పడింది. అందుకే ప్రతినిత్యం బాబాని దర్శించటానికి ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తారు.Sai baba పాలక మండలి నేతృత్వంలో ప్రస్తుతం భక్తులు దర్శించుకుంటున్న సాయిబాబా పాలరాతి విగ్రహాన్ని 1989 లో ప్రతిష్టించారు. ఈ సందర్భంగా పాత విగ్రహాన్ని ఆలయం ఎడమవైపు ప్రతిష్టించారు. ఇక 1991 లో మొదటి అంతస్థు నిర్మాణం చేసి పైన ధ్యాన మందిరం ఏర్పాటు చేసారు. ఆ తరువాత 1994 లో ఆలయానికి రెండవ అంతస్థు నిర్మాణం చేసారు. Sai babaఈవిధంగా అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ ఈ ఆలయం రాష్ట్రంలోనే అత్యంత సుందరమైనదిగా రూపుదిద్దుకుంది. దక్షిణ షిరిడిగా పేరుగాంచిన ఈ ఆలయంలోని సాయిబాబా కోరిన కోర్కెలు తీరుస్తూ భక్తుల హృదయాలలో నిలిచిపోయాడు.Sai baba

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR