Bhakthulanu Visheshanga Akattukune Nakshatravanam

0
3305

నక్షత్రవనం అని పిలువబడే ఈ క్షేత్రంలో అనేక దేవత మూర్తులు కొలువై ఉంది భక్తులని విశేషంగా ఆకట్టుకుంటున్నారు. ఇక్కడ వెలసిన స్వామి, అమ్మవారు సకల కోరికలను నెరవేరుస్తారని భక్తుల నమ్మకం. ఇక్కడ విశేషం ఏంటంటే ఇతర రాష్ట్రాల నుండి భక్తులు దీక్ష ధరించి ఈ ఆలయానికి కాలి నడకన వస్తుంటారు. మరి ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయంలోని మరిన్ని విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. nakshatravanamఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతికి దాదాపుగా 65 కీ.మీ., కాణిపాకానికి దాదాపుగా 25 కీ.మీ. దూరంలో వేపంజేరి అనే గ్రామంలో శ్రీ లక్ష్మీనారాయణస్వామి ఆలయం ఉంది. ఇది చాలా ప్రాచీన ఆలయం. అయితే చిత్తూరుకి తూర్పు ప్రాంతం తొండమండలంగా పిలువబడేది. ఈ మండలంలో అనేక పుణ్యక్షేత్రాలు వెలసి భక్తులకి కొంగుబంగారంగా ఉండేవని ప్రసిద్ధి. nakshatravanamఈ ఆలయంలో వివిధ దేవతలు కొలువై ఉన్నారు. అందులో ముఖ్యమైనవి శ్రీ అష్టలక్ష్మి దేవాలయం, శ్రీ సుదర్శన ఆలయం, శ్రీ యోగనరసింహస్వామి ఆలయం, శ్రీ భక్త ఆంజనేయస్వామి వారి దేవాలయం, శ్రీ విద్యావినాయకస్వామి వారి ఆలయం, నవగ్రహ దేవాలయం, శ్రీ కోనేటి లక్ష్మి నారాయణస్వామి వారి ఆలయాలు ఉన్నాయి.nakshatravanamఇక ఇక్కడ 21 అడుగుల శ్రీ విరాట్ విష్ణువు దశావతార విగ్రహం, 33 అడుగుల శ్రీ రంగనాథస్వామి ప్రతిమ ఆకట్టుకుంటాయి. ప్రధానాలయంలో శ్రీ లక్ష్మి నారాయణమూర్తులు ఉన్నారు. స్వామివారి తొడపైన కూర్చున్న విధంగా దర్శనం ఇస్తుంటారు. ఇలా ఇక్కడ కొలువైన స్వామి అమ్మవార్లు సకల కోరికలు తీర్చే దేవేరులుగా భక్తులు భావిస్తుంటారు. nakshatravanamతమిళనాడు, కర్ణాటక భక్తులు బృందాలుగా దీక్ష ధరించి శ్రీ లక్ష్మి నరసింహుని దర్శించుకుంటారు. వీరు ఇక్కడకి కేవలం కాలినడక రావడం, భక్తుల దీక్షకు నిదర్శనం. ఇంకా ఈ ఆలయ ప్రాంగణంలోనే అష్టలక్ష్మి దేవాలయం ఉంది. ఇక్కడ కుబేర లక్ష్మి నిలబడి ఉన్న మూర్తిగా, అష్టలక్ష్ములకు వేర్వేరు ఆలయాలు ఉన్నాయి. nakshatravanamఆలయ ప్రాగణంలో ఉన్న పుష్కారిని ముందుభాగంలోనే 21 అడుగుల విరాట్ రూపుడైన విషమూర్తి విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక వేపంజేరి కోనేరు వద్ద మరో ప్రత్యేకమైన ఆకర్షణ నక్షత్రవనం. ఈ పుణ్యక్షేత్రానికి వాచిన భక్తులు నవగ్రహాలను పూజిస్తారు. ఆ తరువాత నక్షత్రవనం వచ్చి వారి వారి జన్మ నక్షత్రానికి సంబంధమైన వృక్షాలను తిలకించి ఎంతో ఆనందిస్తారు. 6 acharyaniki gurinchese naksharavanamఇలా ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఈ ఆలయానికి ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు ఎప్పుడు అధిక సంఖ్యలో వస్తుంటారు.8 acharyaniki gurinchese naksharavanam