Devudini em puvvulatho poojinchaali?

0
6234

ఒక్కో పువ్వు ఒక్కో దేవతకు ఇష్టం. ఆ పువ్వులతో కొలిస్తే దేవతలు సంతోషిస్తారు. అంతేకాదు మన కోరికలు బట్టి ఆయా పూలతో ఇష్టదైవాలను వేడుకుంటే ఫలితం ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. 1 God Flowersకలువపువ్వు శ్రీ మహాలక్ష్మికి నివాసం. ఆ పూలతో లక్ష్మి దేవికి కొలవాలి. సింహ ద్వారం తలుపు మీద కలువపువ్వు చెక్కిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అవిసపువ్వుకి, అగస్త్య నక్షత్రానికి ఎంతో సంబంధం ఉంది. ఈ చెట్టుని ఇంటి పక్షమ భాగంలో పెంచితే దృష్టశక్తులు గృహంలోకి రావు. 2 God Flowersశ్రీ కృష్ణుడు సత్యభామ కోరికపై పారిజాత పువ్వు చెట్టుని భూమి మీదకు తెచ్చారని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. అందుకే ఆ పూలతో శ్రీ చక్రాన్ని పూజిస్తే కోరికలు నెరవేరుతాయి. తెల్ల మద్ది పూలతో దేవతలను కొలిస్తే శుభాలు జరుగుతాయి. 4 God Flowersకూరదొండ పూలను, తీగలను పూజిస్తే సంతానం కలుగుతుందని హిందువుల విశ్వాసం. ఆ పూలని ధరించినా మంచి జరుగుతుంది.