Dosham Povadaniki Arjunudu Em Chesadu?

0
4695

మనం అసత్యం మాట్లాడటం ఎంత పాపమో అసత్యాన్ని వినడం కూడా అంత కంటే ఎక్కువ మహా పాపం అని అంటారు. మరి అమంగళం విన్నప్పుడు ఆ దోషం పోవాలంటే ఏం చేయాలి? పురాణాల ప్రకారం అర్జునుడు తన దోషాన్ని ఎలా పోగొట్టుకున్నాడనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. amangalamమన చుట్టూ జరిగే గొడవలలో మధ్యలోకి ఆడవారిని తీసుకురావడం, ఒకరి గురించి తప్పుగా మాట్లాడటం, ఎలాంటి కట్టు బాట్లు లేకుండా వావి వరుసలు మర్చిపోవడం చేసిన, ఇలాంటివి వినడం కూడా మహాదోషమే అవుతుందని చెబుతున్నారు. amangalamపురాణం విషయానికి వస్తే, ఒకసారి దేవలోకం వచ్చిన అర్జునుడిని చూసి ఊర్వశి తన అంధ చందాలను ఆరబోస్తూ తన కోరికను తీర్చమని కోరగా, దానికి అర్జునుడు హరి నామ స్మరణతో ఆ అమంగళకర మాటలను విన్న దోషాన్ని పోగొట్టుకున్నాడు. అయితే ఆవిధముగా ఊర్వశి అన్న మాటలకి అర్జునుడి ఇలా బదులిచ్చాడు, తల్లితో సమానురాలైన నీవు అనకూడని మాటలివి, ఇటువంటి మాటలు మాట్లాడిన నీకంటే, విన్న నాకే ఎక్కువ దోషం అంటూ హరి నామస్మరణ చేసి అమంగళ మాటలను విన్న దోషాన్ని పోగొట్టుకున్నాడూ.amangalamఅయితే చేయరని పనులు చేయించడానికి ధన, అధికార, కామ, లోభాలతో ఆశ చుపిస్తునప్పుడు ఆ మరుక్షణమే హరిహరి అని హరినామ స్మరణ చేస్తూ అటువంటి వాటికీ దూరంగా ఉంటూ అలాంటి వాటిని మన దగ్గర ఎవరు ప్రస్తావించకుండా చూసుకోవాలి. ఇలా చేయడం వలన అమంగళం విన్న దోషం పోతుంది.4 amangalam vinnappudu dosham povalante em cheyali