నాచగిరినే శ్వేతగిరి అని ఎందుకు పిలుస్తారో తెలుసా ?

ద్వాపరయుగాంత సమయం, కలియుగ ప్రారంభ సమయంలో భూలోకంలో ఎన్నో ఉపద్రవాలు సంభవించుచుండగా ఇక్కడ స్వామి వెలిశాడని స్థల పురాణం. మరి ఈ ఆలయ స్థల పురాణం ఏంటి? ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

శ్రీ లక్ష్మి నరసింహస్వామి ఆలయంతెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లా, గజ్వెల్ మండలంలో నాచారం గుట్ట అనే గ్రామంలో నాచగిరి అనే చిన్న ఎత్తైన గుట్ట పైన శ్రీ లక్ష్మి నరసింహస్వామి ఆలయం ఉంది. ఈ నాచగిరినే శ్వేతగిరి అని కూడా పిలుస్తారు. ఇది చాలా మహిమ గల పురాతన ఆలయం. కలియుగ ప్రారంభ కాలంలో నరసింహస్వామి వారు స్వయంభువుగా వెలసిన ఆలయం ఇదియేనని చెబుతారు.

శ్రీ లక్ష్మి నరసింహస్వామి ఆలయంఇక ఈ ఆలయ స్థల పురాణానికి వస్తే, ద్వాపరయుగాంత సమయం, కలియుగ ప్రారంభ సమయంలో భూలోకంలో ఎన్నో ఉపద్రవాలు సంభవించుచుండగా అది గమనించిన భూదేవి శ్రీకృష్ణావతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు కు తెలియచేయగా అంతటా విష్ణువు ఉపద్రవాలను అరికట్టేందుకు హరి, అంతరిక్షుడు, ప్రబద్దుడు, పిప్పలాదుడు, అవిర్హోత్రుడు, ద్రుమిళుడు, చవనుడు, కారభాజనుడు, కలి మొదలగు తొమ్మిది మందిని పిలిచి, మీరు వివిధ రూపాలు ధరించి కలియుగంలో జరగబోయే ఉపద్రవాలను అరికట్టేందుకు భూలోకంలో సంచరించవల్సిందిగా ఆజ్ఞాపించాడు.

శ్రీ లక్ష్మి నరసింహస్వామి ఆలయంఅప్పుడు వారందరు కూడా అయన ఆజ్ఞ ప్రకారం వివిధ రూపాలతో భూలోకంలో తిరుగుతూ హరిద్ర నదీతీరమునందు శ్వేతగిరి వద్దకు రాగానే ఒక గుహ నుండి భయంకరమైన గర్జన వినిపించినది. అది భయంకరమైనదిగా ఉన్నాను వారికీ ఇంపుగా వినిపించింది. అందుచే వారు ఆ ప్రదేశం తమ నివాసమునకు అనువైన ప్రదేశమని నిర్ణయించుకొని అచటనే ఉండి తపము చేయసాగారు. ఇలా కొంతకాలం గడిచిన తరువాత ఆ గుహలో ఉన్న నరసింహమూర్తి వారి తపస్సుకు మెచ్చి ప్రత్యేక్షమై వారిని ఆశీర్వదించాడని పురాణం.

శ్రీ లక్ష్మి నరసింహస్వామి ఆలయంఇక ఈ ఆలయ విషయానికి వస్తే, మూడు అంతస్థుల గాలిగోపురంతో ఆలయప్రవేశం దక్షిణద్వారం, ఉత్తరద్వారం, పశ్చిమద్వారం నుండి జరుగుతుంది. అయితే స్వయంభువుగా వెలసిన ఉగ్రనరసింహమూర్తికి ఎడమ పక్కన శ్రీ లక్ష్మీదేవిని ప్రతిష్టింపచేసి ఆ స్వామివారి ఉగ్రరూపాన్ని కొంత తగ్గించారు.

శ్రీ లక్ష్మి నరసింహస్వామి ఆలయంఇలా వెలసిన ఈ స్వామివారికి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు ఫాల్గుణ బహుళ పంచమి నుండి పదిరోజులపాటు ఘనంగా, కన్నుల పండుగగా వైభవంగా జరుగుతాయి.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR