శివుడికి కేతకి పుష్పాలతో పూజ చేసే ఈ ఆలయం ఎక్కడ ఉంది?

త్రిమూర్తులలలో ఒకడైన ఆ పరమశివుడి పూజలో కేతకి పుష్పాలు వాడకూడదని, శివుడి శాపం కారణంగా ఈ పుష్పాలు శాపానికి గురై శివ పూజలలో వాడటం నిషేదించబడ్డాయని పురాణాలూ చెబుతున్నాయి. అయితే కేతకి అనగా మొగలి పుష్పాలు. కానీ దేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడి శైవక్షేత్రంలో శివుడికి కేతకి పుష్పాలతో పూజలు చేస్తున్నారు. ఇలా పూజ చేయడం వెనుక ఒక పురాణం కూడా ఉంది. మరి శివుడికి కేతకి పుష్పాలతో పూజ చేసే ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఇలా పూజ చేయడం వెనుక ఉన్న పురాణం ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Lord Shivaతెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ మండలం లో, ఝరాసంగం గ్రామంలో అతి పురాతన శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయం ఉంది. ఈ జిల్లామొత్తంలో ఇదే అది పెద్ద ఆలయం అని చెబుతారు. ఈ ఆలయంలో శ్రీ కేతకి సంగమేశ్వరస్వామితో పాటు పార్వతీదేవి కూడా భక్తులకి దర్శనం ఇవ్వడం ఒక విశేషం.

Sangameswara Swamy Templeఅయితే పూర్వం ఈ ప్రాంతంలో కేతకి అనే అప్సరకు శాపవిమోచనం కావడంతో ఆమె పేరుతో కేతకీవనమని, ఇక్కడ ఉన్న గుండాన్ని అమృతగుండం అని అంటారు. కాశి నుండి ఝర ఒకటి వచ్చి ఇక్కడ కలుస్తుందని భక్తుల నమ్మకం. అందకే దీన్ని ఝరాసంగమం అంటారు. ఇక్కడ స్వామివారికి మరెక్కడా లేనివిధంగా కేతకి పుష్పాలతో జరుగుతుంది. అందుకే ఇక్కడి స్వామికి కేతకి సంగమేశ్వరుడు అనే పేరు సార్థకమైనది. అయితే కేతకి వన ప్రాంతాన శివుడిని ధ్యానించగా, భగలింగాకారుడైన శివుడు ప్రత్యక్షం కాగా, బ్రహ్మ తన కమండల జలంతో అభిషేకించి, ఆ ప్రదేశములో శాశ్వతంగా నెలకొనమనగా అందుకు ఆ పరమేశ్వరుడు సరేనని వరం అనుగ్రహించాడు.

Lord Shivaఇక ఈ ఆలయంలోనే కేతకి పూలతో పూజలు చేయడం వెనుక ఒక పురాణం ఉంది. ఒకానొక సందర్భంలో బ్రహ్మకి, విష్ణువుకి జరిగిన ఆధిపత్య పోరులో మొగలి పువ్వు అబద్దం చెప్పిన కారణంగా ఇప్పటి నుండి నిన్ను ఎవరు ఎవరు కూడా నా పూజలో వినియోగించారంటూ మొగలి పూలకి శాపాన్ని పెడతాడు. అప్పుడు క్షమించమని ఆ శివుడ్ని వేడుకోగా, కేతకీవనంలో అనుష్ఠానం చేసిన యెడల బ్రహ్మకి శాపవిమోచనం కలుగుతుందని, కేతకీవనంలోని శివలింగానికి మాత్రమే పూజకు పనికి వచ్చే అర్హత ఉన్నట్లుగా శివుడు వారికీ శాపవిమోచనం ఇచ్చాడు. అందువలనే కేతకీవనంలో సంగమేశ్వరస్వామిని కేతకి పుష్పాలతో పూజించడం జరుగుతుందని పురాణం.

Sangameswara Swamy Templeఇక ఈ ఆలయంలో ప్రతి సోమ మరియు శుక్రవారాలతో పాటు అమావాస్య, పౌర్ణమి రోజులు విశేష దినాలుగా భావిస్తారు. ఇలా ఎంతో విశిష్టత కలిగిన ఆ శివాలయానికి పొరుగు రాష్ట్రాల నుండి కూడా అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR