Every Chapter Of ‘Bhagavad Gita’ Is A Life Lesson

హిందువుల పరమ పవిత్ర గ్రంథం భగవద్గిత. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం ఆరంభం కావడానికి ముందు శ్రీకృష్ణ పరమాత్మా అర్జునుడికి బోధించినదే భగవద్గిత. భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, గమ్యసాధనా యోగములు బోధింపబడినవి. మరి భగవద్గితలో ఏ అధ్యాయ పారాయణ వల్ల ఎలాంటి ఫలితం ఉంటుందనే విషయాలా గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

అర్జున విషాద యోగం: ఈ అధ్యాయం పారాయణం చేయడం వలన సర్వపాపాలు నశించి, పూర్వజన్మ స్మృతి కలుగుతుంది.

Bhagavad Gita

సాంఖ్య యోగం: దీనివలన ఆత్మ స్వరూపం గోచరిస్తుంది.

Bhagavad Gita

కర్మ యోగం: దీనిని పర్యభం చేసేప్పుడు అక్కడి పరిసరాల లోని ఆత్మహత్యాది బలవన్మరణాల వలన మరణించడం వలన ప్రేతాత్మలుగా తిరుగుతున్న జీవులకు ప్రేతత్వం నశిస్తుంది.

Bhagavad Gita

జ్ఞాన యోగం: దీనిని పారాయణం చేయడం వలన వినడం వలన పశు పక్ష్యాదులకుకూడా పాపం నశిస్తుంది.

Bhagavad Gita

కర్మసన్యాస యోగం: దీనిని పారాయణం చేయడం వలన సకల పాపాలు నశించిపోయి ఉత్తమ గతిని పొందుతారు.

Bhagavad Gita

ఆత్మసంయమన యోగం: దీనిని పారాయణం చేయడం వలన సమస్తమైన దానాలు చేసేవారికి కలిగే ఫలితం కలుగుతుంది. విష్ణు సాయుజ్యం, ముక్తి లభిస్తాయి.

Bhagavad Gita

విజ్ఞాన యోగం:

Bhagavad Gita

దీనిని పారాయణ చేయడం వలన, శ్రవణం వలన జన్మరాహిత్యం కలుగుతుంది. పితృదేవతలు తరిస్తారు.

అక్షర పరబ్రహ్మ యోగం: ధృగతి నివారించి ముక్స్తి నిస్తుంది.

Bhagavad Gita

రాజవిద్యా రాజగుహ్య యోగం: ఇతరుల నుండి ఏదైనా తస్కరించడం వలన కలిగే పాపాలు నశించి ముక్తి లభిస్తుంది.

Bhagavad Gita

విభూతి యోగం: ఆశ్రమ ధర్మాలను సక్రమంగా నిర్వహించడం వలన కలిగే పుణ్యం లభిస్తుంది. బ్రహ్మజ్ఞానం కలుగుతుంది.

Bhagavad Gita

విశ్వరూప సందర్శన యోగం: దీనిని పారాయణం చేయడం వలన సర్వపాప విముక్తి, పరమాత్మా పదప్రాప్తి కలుగుతాయి.

Bhagavad Gita

భక్తి యోగం: దీని పారాయణ వలన ఇష్టదేవత సాక్షాత్కారం లభిస్తుంది.

Bhagavad Gita

క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం: దీనిని పారాయణం చేయడం వలన స్త్రీ హత్యాపాతకం, వ్యభిచార దోషం నశించి ఉత్తమగతి లభిస్తుంది.

Bhagavad Gita

పురుషోత్తమ ప్రాప్తి యోగం: దీనిని భోజనానికి ముందుగా పారాయణ చేయాలి. ఆలా చేయడం వలన ఆహారశుద్ధి కలిగి ముక్తి లభిస్తుంది.

Bhagavad Gita

శ్రద్దా త్రయ విభాగ యోగం: దీనిని పారాయణం చేయడం వలన భయంకరమైన రోగాలన్నీ నశించి ముక్తి లభిస్తుంది.

Bhagavad Gita

మోక్ష సన్యాస యోగం: సమస్త యజ్ఞములు ఆచరించినంత ఫలితం కలుగుతుంది. ఉద్యోగం లభిస్తుంది, సర్వ పుణ్యఫలం లభించి, సద్గతి కలుగుతుంది

Bhagavad Gita

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR