Home Unknown facts ఉగ్రనరసింహస్వామి లక్ష్మీనరసింహుడై గుహలో వెలసిన అతిపురాతన ఆలయం

ఉగ్రనరసింహస్వామి లక్ష్మీనరసింహుడై గుహలో వెలసిన అతిపురాతన ఆలయం

0
791

పురాణాల ప్రకారం నరసింహస్వామి తేత్రాయుగంలో ఐదు రూపాల్లో సాక్షాత్కారించాడు. అవి జ్వాలా నరసింహుడు, యోగ నారసింహుడు, గండ బేరుండ నారసింహుడు, ఉగ్ర నారసింహుడు, శ్రీ లక్ష్మి నారసింహ రూపాల్లో యాదమహర్షికి దర్శనం ఇచ్చాడు. అయితే ఎక్కువగా నరసింహస్వామి ఆలయాలు కొండప్రాంతంలోనే ఉంటాయి. అలానే ఇక్కడ కూడా లక్ష్మీనరసింహస్వామి ఒక కొండగుహలో స్వయంభువుగా వెలిశాడని పురాణం. మరి ఇక్కడ స్వామివారు ఎలా వెలిశారు? ఈ ఆలయ స్థల పురాణం ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

nacharamguttaతెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లా, గజ్వెల్ మండలంలో నాచారం గుట్ట అనే గ్రామంలో నాచగిరి అనే చిన్న ఎత్తైన గుట్ట పైన శ్రీ లక్ష్మి నరసింహస్వామి ఆలయం ఉంది. ఈ నాచగిరినే శ్వేతగిరి అని కూడా పిలుస్తారు. ఇది చాలా మహిమ గల పురాతన ఆలయం. కలియుగ ప్రారంభ కాలంలో నరసింహస్వామి వారు స్వయంభువుగా వెలసిన ఆలయం ఇదియేనని చెబుతారు.

nacharamguttaఇక ఈ ఆలయ స్థల పురాణానికి వస్తే, ద్వాపరయుగాంత సమయం, కలియుగ ప్రారంభ సమయంలో భూలోకంలో ఎన్నో ఉపద్రవాలు సంభవించుచుండగా అది గమనించిన భూదేవి శ్రీకృష్ణావతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు కు తెలియచేయగా అంతటా విష్ణువు ఉపద్రవాలను అరికట్టేందుకు హరి, అంతరిక్షుడు, ప్రబద్దుడు, పిప్పలాదుడు, అవిర్హోత్రుడు, ద్రుమిళుడు, చవనుడు, కారభాజనుడు, కలి మొదలగు తొమ్మిది మందిని పిలిచి, మీరు వివిధ రూపాలు ధరించి కలియుగంలో జరగబోయే ఉపద్రవాలను అరికట్టేందుకు భూలోకంలో సంచరించవల్సిందిగా ఆజ్ఞాపించాడు.

nacharamguttaఅప్పుడు వారందరు కూడా అయన ఆజ్ఞ ప్రకారం వివిధ రూపాలతో భూలోకంలో తిరుగుతూ హరిద్ర నదీతీరమునందు శ్వేతగిరి వద్దకు రాగానే ఒక గుహ నుండి భయంకరమైన గర్జన వినిపించినది. అది భయంకరమైనదిగా ఉన్నాను వారికీ ఇంపుగా వినిపించింది. అందుచే వారు ఆ ప్రదేశం తమ నివాసమునకు అనువైన ప్రదేశమని నిర్ణయించుకొని అచటనే ఉండి తపము చేయసాగారు. ఇలా కొంతకాలం గడిచిన తరువాత ఆ గుహలో ఉన్న నరసింహమూర్తి వారి తపస్సుకు మెచ్చి ప్రత్యేక్షమై వారిని ఆశీర్వదించాడని పురాణం.

nacharamguttaఇక ఈ ఆలయ విషయానికి వస్తే, మూడు అంతస్థుల గాలిగోపురంతో ఆలయప్రవేశం దక్షిణద్వారం, ఉత్తరద్వారం, పశ్చిమద్వారం నుండి జరుగుతుంది. అయితే స్వయంభువుగా వెలసిన ఉగ్రనరసింహమూర్తికి ఎడమ పక్కన శ్రీ లక్ష్మీదేవిని ప్రతిష్టింపచేసి ఆ స్వామివారి ఉగ్రరూపాన్ని కొంత తగ్గించారు.  ఇలా వెలసిన ఈ స్వామివారికి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు ఫాల్గుణ బహుళ పంచమి నుండి పదిరోజులపాటు ఘనంగా, కన్నుల పండుగగా వైభవంగా జరుగుతాయి