శివుడి కారణంగా చనిపోయిన అతడే శ్రీకృష్ణుడి కొడుకుగా జన్మించాడా?

శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో ఎనిమిదొవ అవతారం శ్రీ కృష్ణావతారం. శ్రీముఖనామ సంవత్సర దక్షిణాయన వర్షఋతువు శ్రావణ బహుళ అష్టమి రోహిణి నక్షత్రం నాల్గవపాదం బుధవారం నాడు అర్థరాత్రి యదువంశంలో దేవకీదేవి, వసుదేవుల పుత్రునిగా శ్రీకృష్ణుడు జన్మించాడు. మరి శివుడి కారణంగా చనిపోయిన అతడే శ్రీకృష్ణుడి కొడుకుగా జన్మించాడా? అతడు ఎవరు అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

sri krishnaశ్రీకృష్ణుడు, రుక్మిణికి జన్మించిన వాడే ప్రద్యమ్నుడు. శ్రీకృష్ణుడికి చాలామంది కుమారులు ఉండగా అందులో ప్రద్యమ్నుడు ముక్యుడిగా చెబుతారు. ఇక పురాణానికి వెళితే, పూర్వం శంబాసురుడు అనే రాక్షసుడు ప్రజలని హింసిస్తూ ఉండేవాడు. శంబాసురుడికి ప్రద్యమ్నుడు చేతిలో తప్ప మరెవ్వరి చేతిలో చావు అనేది లేదనే వరం ఉంది. దీంతో ప్రద్యమ్నుడు జన్మించగానే శంబాసురుడు అతడిని చంపి తనకి శతృవులు లేకుండా చేసుకోవాలని భావించి ప్రద్యమ్నుడుని ఎత్తుకువెళ్లి సముద్రంలో పడేస్తాడు. ఇలా ఆ సముద్రంలో పడిన శిశువుని ఒక చాప మింగేయ్యగా, జాలరులకి ఆ చేప చిక్కుతుంది. వారు ఆ చేపని రాజ్యానికి తీసుకువచ్చి రాజుకి బహుమతిగా ఇవ్వగా, ఆ చేపని వంటివారు కోసి చూస్తే అందులో అందమైన బాలుడు వారికీ కనిపిస్తాడు. అక్కడ ఉన్న ఒక యువతీ ప్రద్యమ్నుడు ని పెంచి పెద్ద చేస్తుంది. ఇలా పెరిగి పెద్దగా అయినా అతడికి ఒక రోజు నారదుడు వచ్చి తన జన్మ రహస్యాన్ని చెబుతాడు. ఇలా జన్మ రహస్యం తెలుసుకున్న ప్రద్యమ్నుడు వెళ్లి శంబాసురుడిపైన యుద్ధం చేసి అతడిని వదిస్తాడు.

sri krishnaఇక ప్రద్యమ్నుడి పూర్వ జన్మ విషయానికి వస్తే, శివుడి తపస్సు భంగం చేయడానికి మన్మథుడు బాణాన్ని వేయగా తపస్సుకి భంగం కలిగిన శివుడు ఆగ్రహించి మన్మధుడిని భస్మం చేస్తాడు. అప్పుడు మన్మధుడి భార్య అయినా రతీదేవి లోకకల్యాణం కోసమే ఇలా భంగం కలిగించాడు, ఎలాగైనా మన్మదుడిని తిరిగి బ్రతికించమని శివుడిని వేడుకుంటుంది. శాంతించిన శివుడు మన్మధుడు శ్రీకృష్ణుడికి కొడుకుగా జన్మిస్తాడని చెబుతాడు. ఆవిధంగా శివుడి చెప్పిన దానిప్రకారం మన్మధుడు శ్రీకృష్ణుడికి, రుక్మిణికి ప్రద్యమ్నుడిగా జన్మిస్తాడు.

sri krishnaఇది ఇలా ఉంటె, శంబాసురుడిని వధించిన తరువాత ప్రద్యమ్నుడు తన తండ్రిని వెతుకుంటూ ద్వారకా వెళ్తాడు. ఇలా రాజ్యంలోకి వెళ్లగానే శ్రీకృష్ణుడి లానే ఉన్న అతడిని చూసి అందరు ఆశ్చర్యపడగా, రుక్మిణి దేవి పుట్టగానే కనిపించకుండా పోయిన తన కుమారుడు ఇతడే అని గ్రహిస్తుంది. ఆ తరువాత ప్రద్యమ్నుడు తండ్రి కి తగ్గ కొడుకుగా మంచి పేరు తెచ్చుకుంటాడు. కురుక్షేత్ర యుద్ధంలో యాదవులు అందరు కౌరవుల పక్షాన ఉండగా, శ్రీకృష్ణుడు పాండవుల పక్షాన ఉంటాడు. ఆ సమయంలో తండ్రికి వ్యతిరేకంగా ఉండటం ఇష్టం లేని అతడు కురుక్షేత్ర యుద్ధానికే దూరంగా ఉంటాడు. ఇక చివరగా యాదవులకు ఉన్న శాపం కారణంగా వారిలో వారిలో కొట్టుకొని చనిపోతుంటే అవి ఆపడానికి వెళ్లి ప్రద్యమ్నుడు చనిపోయాడని చెబుతారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR