Ardent Fan Writes Letter To Chiru For Disappointing Them On His Birthday!!

0
6960

We all know the immense following Chiru has got among his fans. There is a reason he is called ‘Megastar’. This birthday stands special not only for him, but for all his fans as well. The first look of his 150th movie Khaidi No.150 was revealed and it received immense response. There was a grand event organised celebrating Chiru’s 61st birthday that was organised towards the end of the day at Shilpa Kalavedika. Ironically, Chiru did not attend this event and it disappointed a few sections of fans.

One of the fans took a step ahead and wrote an open letter to Chiru expressing his disappointment over Chiru’s absence at his birthday celebrations.

Here is the letter

ఏంటి బాసూ ఇది ………

15 రోజుల నుంచి సరిగా నిద్ర కూడా పట్టలేదు. చిన్న బాస్ నీ పుట్టిన రోజుకి ఫస్ట్ లుక్, టీజర్ వదులుతాం అన్నప్పుటి నుంచి ఒకటే టెన్షన్. ఎప్పుడెప్పుడు చూస్తామా అని. 22న అభిమానుల మధ్య మెగా హీరోలందరి సమక్షంలో గ్రాండ్ గా సెలబ్రేషన్ చేస్తారంటే పుష్కరాల ఎఫెక్ట్ లో ట్రైన్,బస్ లలో టికెట్లు దొరకవేమో అనుకుని తలా ఓ చెయ్యి వేసి హైదరాబాద్ రావడానికి బండి కూడా మాట్లాడుకుని వచ్చేసాం. మా అందరి మదిలో ఒకటే కోరిక. బాసుని నేరుగా చూడాలి. స్టేజి మీద మాట్లాడుతుంటే కళ్ళారా చూసుకుని మురిసిపోవాలి. మెగా హీరోలందరూ పక్కనుండగా కేక్ కట్ చేస్తుంటే ఆ మధుర క్షణాల్ని సెల్ ఫోన్ లో తీసి ఫేస్ బుక్ లో గర్వంగా పెట్టాలి. మా బాస్ వచ్చేసాడు అని ప్రతి ఒక్కళ్ళకి గర్వంగా రొమ్ము విరిచి మరీ చెప్పుకోవాలి. ఎన్నెన్ని అనుకున్నాం. ఇవేమీ అత్యాశ కాదు కదా బాసూ.

ఎవరెవరో నీ పాటలకు ఆడారు. పాడారు. నువ్ రావని తెలిసినప్పుడు అవి ఎలా కిక్ ఇస్తాయి బాసూ. సరే ఫంక్షన్ జరుగుతోంది కదా చెర్రీ తో వచ్చి సడన్ సర్ప్రైజ్ ఇస్తావేమో అని ఎంట్రన్స్ వైపు కొన్ని వందల సార్లు ఆశగా చూసాం. రాలేదు. పోనీ చిన్న ఇబ్బంది ఏమైనా కలిగిందేమో లైవ్ వీడియో లో మా కోసం రెండు మాటలు ఏమైనా పంపుతావేమో అని లైట్లు ఆర్పిన ప్రతి సారి  స్క్రీన్ వైపు ఆబగా చూసాం. పంపలేదు. ఇది కూడా అత్యాశేనా బాసూ. చెర్రీ,వరుణ్,బన్నీ,శిరీష్, తేజు వీళ్ళంతా చెరో రెండు ముక్కలు మాట్లాడి మమ అనిపించారు. ఏదో ఓ డైలాగ్ చెప్పేసి దిగేస్తే సరిపోతుందా. ఎన్నెన్ని ఊహించుకున్నాం. ఇలా ఆశ పడ్డం తప్పంటావా.

సోషల్ మీడియా లో నీ ఫస్ట్ లుక్, టీజర్ మధ్యాన్నమే చుసేసాం. ఎందరికి పంపించుకున్నామో, షేర్ చేసుకున్నామో లెక్క పెట్టుకుంటే వారం పడుతుంది కౌంట్ తేలడానికి. తొమ్మిదేళ్ళ ఆకలి బాసూ. నీ ఫ్యామిలీ నుంచి ఎందరు హీరోలు వచ్చినా వాళ్ళందరిని అక్కున చేర్చుకుంది నీ కోసమే కదా. నిన్ను చూసే భాగ్యం మాకు రోజు దొరికేదా. ఈ అపురూప క్షణంలో మా కనులారా నిన్ను చూసుకోవాలనుకోవటం మా హక్కు కదా బాసూ.

ఇదంతా సరే. నిన్ను అర్థం చేసుకుంటాం. చెప్పుకోలేని ఇబ్బంది ఉండబట్టే వచ్చి ఉండవు. మరి హయత్ లో పార్టీ కి వచ్చావ్ కదా బాసూ. వచ్చిన వాళ్లదేముంది చెప్పు. అంతా పెద్దోళ్ళు.ఎప్పుడు కావాలంటే అప్పుడు నిన్ను నేరుగా కలుసుకుంటారు. నాలాంటోల్లకు అంత అదృష్టం ఎక్కడిది. ఒక పావు గంట లేదా అరగంట అంతే బాసూ నువ్వు ఉండాలని కోరుకున్నది. మాకు తెలుసు కదా. మా కోసమే ఈ వయసులోనూ ఇంత కష్టపడుతూ డే అండ్ నైట్ షిఫ్ట్ లో ఖైది నెంబర్ 150 కోసం పని చేస్తున్నావు. మరి అలాంటప్పుడు గంటల తరబడి మాతో ఉండాలి అని ఎలా అనుకుంటాం.

అయినా మాకేం కోపం లేదు బాసూ. మనం మనం ఒకటి. సర్దుకుంటాంలే. సంక్రాంతికి నీ బాక్స్ ఆఫీస్ తడాఖ చూపడానికి వస్తావ్ కదా. బాక్సులు బద్ధలవ్వాలి. బాసు రఫాడిస్తే ఎలా ఉంటాదో రుచి చూపించాలి. రా బాసూ.ఇంకా నాలుగు నెలలేగా. అన్నయ్య కోసం ఆ మాత్రం వెయిట్ చేయాలి. తప్పదు. బాస్ ఈజ్ బ్యాక్.

ఇట్లు,

నీ అభిమాని,

పేర్లు రాసేంత స్పేస్ ఇక్కడ లేదు బాసూ….. ఏమనుకోకే….

 

 

Source