Garbhagudi Chatursrakaramlo unde adbhutha aalayam

0
3316

ఈ ఆలయంలోని శిల్పకళానైపుణ్యం, రామాయణ, మహాభారత కథలు చెక్కబడిన పలకలు అందరిని ఆకట్టుకుంటాయి. ఈ ఆలయానికి ఒకే విమానం ఉండటం విశేషం. ఇలా ఎన్నో విశేషాలు కలిగి ఉన్న ఈ దేవాలయం ఎక్కడ ఉంది? ఇక్కడ కొలువై ఉన్న ఆ స్వామి ఎవరనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. garbhagudiకర్ణాటక రాష్ట్రం, చిక్ మగ్ ళూరు జిల్లాకి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉత్తరాన ఉన్న అమృతపుర గ్రామంలో ప్రసిద్ధమైన అమృతేశ్వరస్వామి దేవాలయం ఉంది. ఈ ఆలయాన్ని 1196 సంవత్సరంలో అమృతేశ్వర దండనాయక హొయసల రాజు రెండవ వీర బల్లాల్ నిర్మించినట్లు తెలియుచున్నది. కర్ణాటకని 11 వ శతాబ్దంలో పాలించినా ఈ రాజులు ఈ ప్రాంతంలో అత్యంత ఆధ్బుతమైన ఆలయాలని నిర్మించారు. వీరు నిర్మించిన పట్టణాలు, దేవాలయాలు ఒకదానికి ఒకటి చాలా దగ్గరగా ఉండటం విశేషం. garbhagudiఈ ఆలయ విషయానికి వస్తే, స్వామివారి మండపం తాటి, కొబ్బరి తోటల మధ్య ఉన్నది. వెలుపలి మండపం బయటి గోడలపై అధ్బుతంగా శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ఈ ఆలయానికి ఒకే విమానం ఉండటం వలన ఏకాకుట అని పిలుస్తారు. ఈ ఆలయ నిర్మాణ శైలి, మండపాలు బెల్ వాడి నందు ఉన్న విద్యానారాయణ దేవాలయ శైలిని పోలి ఉన్నాయి. garbhagudiఈ ఆలయం లోపల గర్భగుడి చతురస్రాకారంగా ఉండి, గర్భగుడి శిఖరంపై భాగంలో కీర్తి ముఖులు చెక్కబడి ఉన్నారు. ఈ కీర్తి ముఖుల క్రింది భాగంలో దేవత శిల్పాలు లేవు. ఇక మండపం బయటి గోడలపైన సుమారు 140 పలకల మీద భారతీయ ఇతిహాసాలు చెక్కబడ్డాయి. వెలుపలి మండపంలో గోడపైన రామాయణ కథ 70 పలకలపై అపసవ్య దిశలో చెక్కబడింది. ఉత్తర గోడపై 25 పలకలపై శ్రీకృష్ణ జీవిత చరిత్ర, మిగిలిన 45 పలకలపై మహా భారతం చెక్కబడి ఉంది. garbhagudiఇలా శిల్పకళానైపుణ్యం తో ఆశ్చర్యాన్ని కలిగించే ఈ ఆలయానికి భక్తులు ఎప్పుడు అధిక సంఖ్యలో వస్తుంటారు.garbhagudi