Garudasthambam kindha garudalvaaru darshanam ichhe arudhaina aalayam

0
3379

పంట పొలాల మధ్య కొలువై ఉన్న ఈ పుణ్యక్షేత్రం భక్తులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక్కడ కొలువ ఉన్న అమ్మవారిని కన్యలు పూజిస్తే త్వరగా వివాహం అవుతుందని, పెళ్లి అయినవారు పూజిస్తే వారికీ అనురాగ దాంపత్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. మరి ఎన్నో విశేషాలు ఉన్న ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. garudasthambamతెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, ఘటకేశ్వరమండలం, ఏదులాబాద్ గ్రామంలో ఆండాళ్ సమేత శ్రీ మన్నూరు రంగనాథ స్వామి ఆలయం ఉంది. అయితే పన్నిద్దరు ఆళ్వారులలో గోదాదేవి ఒక్కరు మాత్రమే స్త్రీ మూర్తి. ఈ ఆలయంలో గోదాదేవి శ్రీ రంగనాథ స్వామి వారితో కొలువై ఉన్నారు. ఈ ఆలయానికి ఐదు వందల సంవత్సరాల చరిత్ర ఉందని చెబుతారు. ఇక్కడ ఉన్న వివరాలను బట్టి ఈ ఆలయాన్ని అప్పలదేశికాచార్యులు నిర్మించారని తెలియుచున్నది. garudasthambamఇక ఈ ఆలయ ప్రవేశ ద్వారం నుండి వెళితే గరుడ స్థంభం కనిపిస్తుంది. గరుడస్థంభం క్రింద గరుడాళ్వారు దర్శనమిస్తారు. గర్భాలయంలో మకరతోరణంతో మన్నారు రంగనాయక స్వామి వారు తిరునామముతో, రజిత కిరీటంతో, గరుడపచ్చల హారంతో, పుషమాలలతో భక్తులకి దర్శనమిస్తారు. ఈ స్వామివారికి కుడిప్రక్కగా ఆండాళ్ మాత, ఎడమవైపున విష్ణుచిత్తులవారు ప్రతిష్ఠితులై ఉన్నారు. అమ్మవారి పైభాగంలో శేష శయనంపై పవళించిన శ్రీ రంగనాయకస్వాములవారు మనకి దర్శనమిస్తారు. garudasthambamఇక ఈ ఆలయంలో ఆండాళ్ మాతని దర్శించి కోర్కెలు కోరుకుంటే భక్తులకి ఆండాళ్ మాత కలలో సాక్షాత్కరించి దిశానిర్దేశం చేస్తుందని భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలో స్త్రీలు అమ్మవారికి వడి బియ్యం ఇస్తారు. ఈ ఆలయానికి కొంతదూరంలో పుష్కరణి ఉంది. భక్తులు ఇందులో స్నానం ఆచరించి స్వామివారిని దర్శిస్తే మోక్షం లభిస్తుందని విశ్వసిస్తారు. garudasthambamఇలా వెలసిన ఈ ఆలయంలో శ్రావణమాసంలో పాడ్యమి మొదలు శాపాతమి వరకు ఇచట బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ సమయంలో భక్తుల రద్దీ అనేది ఎక్కువగా ఉంటుంది.garudasthambam