Guhallo trimurthula aalayam aa guhalalo rahasyam yenti?

0
7257

ఈ గుహలో త్రిమూర్తులు అయినా బ్రహ్మ, విష్ణు, శివుడుకి ఆలయాలు ఉన్నాయి. ఈ గుహ 6 వ శతాబ్దానికి చెందినదని చరిత్ర కారులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్న రావిచెట్టు మహిమాన్వితమైనదిగా చెబుతుంటారు. మరి ఆ గుహాలయం ఎక్కడ ఉంది? ఆ చెట్టు గల ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. guhalloవిజయవాడ నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉండవల్లి అనే గుహలు ఉన్నాయి. ఇవి మొదట బౌద్ధానికి సంబంధించినవి. తర్వాత క్రమంగా గుహాలయాలుగా ప్రసిద్ధి చెందాయి. ఈ గుహలు బౌద్ధ, హైందవ శిల్పకళారీతుల సమ్మేళనం. ఈ నాలుగు అంతస్తుల గుహల సముదాయాన్ని మొదట బౌద్ధ భిక్షువుల నివాసం కోసం ఏర్పాటు చేసినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అయితే మలినిర్మాణం 6–7 శతాబ్దాల కాలంలో జరిగింది. guhalloఇక్కడి గుహాలయాల మొదటి అంతస్తు సంపూర్ణంగా లేదు. రెండవ అంతస్తు త్రికూటాలమయం. మూడవ అంతస్తు అనంత శయన విష్ణుమూర్తి, పన్నిద్దరాళ్వార్లు, ఆంజనేయ విగ్రహాలు ఉన్నాయి. నాలుగవ అంతస్తులో పూర్తి కాని త్రికూటాలయం ఉంది. వీటిలోని శిల్పకళారీతుల ఆధారంగా చాళుక్యరాజుల కాలం నాటివిగా తెలుస్తోంది. guhalloఈ ఉండవల్లి గుహ దగ్గర విదురాశ్వత్థ వృక్షం ఉంది. అయితే విదురుడు నాటిన రావిచెట్టు కాబట్టి దీనికి విదురాశ్వత్థ వృక్షం అని పేరు వచ్చింది. ఈ చెట్టు ఉన్న ప్రదేశం కాబట్టి ఆ ఊరికి విదురాశ్వత్థ అనే పేరు వచ్చింది. ఈ విశాలమైన వృక్షరాజాన్ని అత్యంత మహిమాన్వితమైనదిగా భావిస్తారు. కావేరి, ఆర్కావతి నదుల సంగమస్థానం ఇది. అయితే మహాశిల్పి జక్కన, టిప్పుసుల్తాన్‌లు ఈ క్షేత్రంలో పుట్టారని అంటారు. ఇంకా వృక్షం మూలభాగం బ్రహ్మరూపమని, మధ్యభాగం విష్ణురూపం అని, అగ్రభాగం శివరూపం అని భావిస్తారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవృక్షంగా పేరు పొందిన వృక్షం ఇది. విష్ణు అంశ గా చెప్పుకుంటారు. guhalloశని దృష్టి సంబంధితమైనందు వల్ల శనివారం రోజు ఈ క్షేత్రాన్ని వేలాది మంది దర్శించుకుంటారు. శనివారం తప్ప ఇతర రోజుల్లో ఈ వృక్షాన్ని తాకరు. ఇది భూత ప్రేతపిశాచ రోగాలు, సంతానహీనత తొలగించే వృక్షం గా భావిస్తారు. అయితే శనిదోషాలతో బాధపడేవారు దీని దర్శనం చేసుకుంటే శాంతి సుఖాలు పొందుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక్కడ సోమేశ్వరం, గణేశుడు, లక్ష్మీనారాయణుడు, ఆంజనేయ స్వామి ఆలయాలతోపాటు వేలకొలదీ నాగ ప్రతిమలు దర్శనమిస్తాయి. guhalloఅయిదో శతాబ్దంలో చెక్కిన గుహలకు పదిహేడో శతాబ్దానికి చెందిన గోల్కొండ నవాబు తానీషా దగ్గర పనిచేసిన అన్నదమ్ములైన అక్కన్న మాదన్న పేర్లతో కూడా పిలుస్తుంటారు. ఎందుకంటే వారు ఈ ప్రాంత పర్యటనకు వచ్చినప్పుడు ఇక్కడ విడిది చేయడం వలన వారి పేరుతొ పిలవడం ప్రారంభం అయిందని చెబుతుంటారు. ఇక్కడకి దగ్గరలో ఇసుక రాతిలో చెక్కిన మరో పురాతన గుహలను త్రిమూర్తి గుహలంటారు. ఇక్కడ ఉన్న రెండు రాతి గదులలోని ఒక దానిలోనే సదా శివుడు లింగ రూపంలో కనపడతాడు. మరొకటి ఖాళీగా ఉంటుంది. guhalloఈవిధంగా త్రిమూర్తులు వెలిసిన పురాతన గుహ ఆలయం ఇంకా అక్కడి విదురాశ్వత్థ వృక్షం భక్తుల పూజలందుకొనుచున్నది.