Here’s Everything You Must Know About Nandamuri Tiger – Hari Krishna

హరికృష్ణ ఎవరు? అనే ప్రశ్నిస్తే ఎన్టీయార్, కళ్యాణ్ రామ్ ల తండ్రి, సీనియర్ ఎన్టీఆర్ కుమారుడు, రాజకీయ నేత అని మాత్రమే తెలుసు ఈ తరానికి. కానీ.. ఆయన గొప్పతనం గురించి మాత్రం ఎవరికీ పెద్దగా తెలియదు. ఉదయం నిద్రలేచేసరికి ఆయనకు యాక్సిడెంట్ అయ్యింది అని వార్త విన్న నాకు ఒక్కసారిగా ఒళ్ళు జలదరించింది. పోనీలే గాయాలతో బ్రతుకుతాడు మనిషి అనుకొనేలోపే “హరికృష్ణ దుర్మరణం” అనే వార్త జమదగ్నిలా వ్యాపించింది. రెప్పపాటులో మరణించిన హరికృష్ణ గురించి ఈ తరానికి తెలియాలి. ఎందుకంటే తండ్రి రాజకీయ శ్రేయస్సు కోసం తన జీవితాన్ని, కెరీర్ ను పణంగా పెట్టిన నాన్న పిచ్చోడు హరికృష్ణ, తన తండ్రిని వెన్నుపోటు పొడిచి పార్టీ పగ్గాలను సొంతం చేసుకొన్నాడన్న కోపంతో తెలుగుదేశం పార్టీని వదలి సొంతంగా “అన్న తెలుగుదేశం” అనే పేరుతో సొంత పార్టీ పెట్టిన కోపిష్టి హరికృష్ణ, తెలుగు రాష్ట్రంగా పిలవబడే ఆంధ్రప్రదేశ్ ను రెండు రాష్ట్రాలుగా విడదీయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినప్పుడు రాజకీయ లబ్ధి కోసం ప్రాకులాడకుండా నిస్సందేహంగా కేంద్రాన్ని ఎదిరించిన ధీశాలి హరికృష్ణ, పార్లమెంట్ లో హిందీ మాత్రమే వచ్చిన స్పీకర్ ముందు పార్లమెంట్ లో తన మాతృభాష అయిన తెలుగులో మాట్లాడినా భాషాభిమాని హరికృష్ణ. బహుభార్యా కోవిధుడు అనే నింద తప్ప మరో చెడ్డపేరు లేని, ఎరుగని ఎదురులేని మనిషి హరికృష్ణ. ఆయన జీవితం గురించి చాలా మందికి తెలియని, తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు..!!!

13 ఏళ్లకే నటుడిగా గుర్తింపు..

Nandamuri Tiger - Hari Krishna

ఎంత ఎన్టీఆర్ కొడుకైతే మాత్రం నట ప్రతిభా కనబరచకపోతే ప్రేక్షకులు ఆదరిస్తారా చెప్పండి. కానీ.. 13 ఏళ్లకే నటుడిగా “శ్రీకృష్ణావతారం, తల్లా పెళ్ళామా” చిత్రాలతో అశేష తెలుగు ప్రజల్ని అలరించిన హరికృష్ణ అనంతరం చాలా సినిమాల్లో క్యామియో రోల్స్ చేశారు. ఎన్టీయార్ జీవితంలోనే కాదు తెలుగు సినిమా చరిత్రలోనూ ఓ ఆణిముత్యంలా నిలిచిపోయిన “దావీరసూర కర్ణ” చిత్రానికి హరికృష్ణ నిర్మాత కావడం విశేషం. ఆ తర్వాత “సీతారామరాజు” సినిమాతో పూర్తిస్థాయి నటుడిగా నాగార్జునతో స్క్రీన్ షేర్ చేసుకొన్నారు హరికృష్ణ. అనంతరం ఆయన నటించిన “లాహిరి లాహిరి లాహిరిలో, సీతారామరాజు” మంచి విజయం సాధించి ఆయన్ను హీరోగా నిలబెట్టాయి. ఇక “సీతయ్య” చిత్రంతో ఆయన సాధించిన స్టార్ డమ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

చైతన్య రధ సారధిగా..

Nandamuri Tiger - Hari Krishna

కథానాయకుడిగా అప్పుడప్పుడే సోదరుడు బాలకృష్ణ హీరోగా నిలడుక్కుకుంటుండగా హరికృష్ణకు కూడా ఆఫర్లు రావడం మొదలైంది. అయితే.. అదే సమయంలో ఎన్టీఆర్ “తెలుగుదేశం” పార్టీ స్థాపించి జనంలోకి వెళ్లాలని నిర్ణయించుకొన్నప్పుడు, తన కెరీర్ ను పక్కన పెట్టి చైతన్య రాధసారధిగా రంగంలోకి దుకాడు హరికృష్ణ. ఒక సెంట‌ర్ లో మీటింగ్ జ‌రుగుతున్న స‌మ‌యం లోనే కార్య‌క‌ర్త‌లు మ‌రో మీటింగ్ సెంట‌ర్ కి వెళ్ళిపోయేవార‌ట‌.. ఎందుకంటే హ‌రికృష్ణ గారి ర‌థం మెద‌లైందంటే త‌రువాత మీటింగ్ ప్లేస్ ద‌గ్గ‌ర మాత్ర‌మే ఆగేదంట‌.. ఆరోజుల్లో వున్న రోడ్ల పై తండ్రి కి ఏమాత్రం ఇబ్బందిలేకుండా… కార్య‌క‌ర్త‌ల‌కు ఏమాత్రం ఇబ్బందిలేకుండా గ‌మ్య స్థానానికి క్షేమంగా చేరుకునేవాడ‌ని చెప్పెవారు… అంత‌టి ఘ‌న‌త వుంది హ‌రికృష్ణ గారికి వాహ‌నాలు న‌డ‌ప‌డంలో.

భేషజం తెలియని భీష్ముడు..

Nandamuri Tiger - Hari Krishna

ఎన్టీయార్ గారు ‘దానవీరశూరకర్ణ’ సినిమాలో అర్జునుడి పాత్రకు మొదట మాదాల రంగారావుగారిని అనుకున్నారు. ఒక రోజు షూటింగ్ కూడా చేశారు. కానీ హరికృష్ణ ఆ పాత్రకు ఇంకా బాగా నప్పుతాడని భావించి, మాదాల రంగారావును తప్పించారు. ఆ కోపం మాదాల రంగారావు గారికి చాలా కాలం ఉండేది. చెన్నయ్ లో ప్రెస్ మీట్ పెట్టి తన బాధను వ్యక్తపరిచారు. అయినా… అదేమి పట్టించుకోకుండా హరికృష్ణ… మాదాల రంగారావు చనిపోయారని తెలియగానే వాళ్ళబ్బాయి రవిని స్వయంగా కలిసి సానుభూతి తెలిపి, ధైర్యం చెప్పి వెళ్ళారు.

చంద్రబాబు నాయుడు మీద కోపంతో..

Nandamuri Tiger - Hari Krishna

పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీ శ్రేణులతో సన్నిహిత సంబంధాలు కలిగిన హరికృష్ణ రాజకీయాల్లో తనదైన శైలిలో రాణించారు. తండ్రి ఎన్టీఆర్ గుండెపోటుతో చనిపోయినప్పుడు 1996లో హిందూపూర్ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో హరికృష్ణ పోటీచేసి ఎమ్మెల్యే అయ్యారు. చంద్రబాబు హయాంలో.. రవాణాశాఖ మంత్రిగా పనిచేశారు. ఐతే.. తండ్రి ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి.. సీఎం పీఠాన్ని దక్కించుకున్నారని మొదట్లో చంద్రబాబు తీరును వ్యతిరేకించారు హరికృష్ణ. 1999, జనవరి 26నాడు సొంతంగా అన్న తెలుగుదేశం పార్టీని పెట్టి ఎన్నికలకు వెళ్లారు.  ఎన్టీఆర్ లాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రథయాత్ర నిర్వహించారు. ఐతే.. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో తాను అనుకున్న ఫలితాలను హరికృష్ణ పొందలేకపోయారు. ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది అన్నాటీడీపీ. ఆ తర్వాత పరిణామాలతో.. తిరిగి చంద్రబాబుతోనే కలిసి పనిచేశారు హరికృష్ణ.

రాష్ట్ర విభజన ఇష్టపడని తెలుగు భాషాభిమాని..

Nandamuri Tiger - Hari Krishna

2008లో టీడీపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు హరికృష్ణ. రాష్ట్ర విభజనకు నిరసనగా.. 2013 ఆగస్ట్‌ 4న రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. రాజ్యసభ సభ్యత్వానికి తన రాజీనామాను పట్టుపట్టి మరీ ఆయన ఆమోదింపచేసుకున్నారు. టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడిగా ఉంటూ కడవరకు హరికృష్ణ పార్టీ నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించారు. ఐతే.. చంద్రబాబుతో సంబంధాల విషయంలో హరికృష్ణ అంటీముట్టనట్టుగానే ఉండేవారు. మహానాడుకు కూడా పలుమార్లు ఆయన హాజరుకాలేదు. చిన్నవాడైనప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ ను రాజకీయంగా ప్రమోట్ చేశారు. టీడీపీ కోసం పనిచేయాలన్న హరికృష్ణ సూచనలతోనే జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

కొడుకులంటే విపరీతమైన ప్రేమ..

Nandamuri Tiger - Hari Krishna

తనయుడిగా ఎలా అయితే తన తండ్రి మర్యాదను, గౌరవాన్ని కాపాడుతూ వచ్చారో.. తండ్రిగానూ తనయులను కంటికి రెప్పలా చూసుకొనేవారు. ఎన్టీఆర్, కళ్యామ్ రామ్ లు ఆయనకి రెండు కళ్ళు. వాళ్ళ ప్రతి సినిమా ఆడియో లేదా ప్రీరిలీజ్ ఈవెంట్ కి అతిధిగా వచ్చేవారు హరికృష్ణ. ఇద్దరూ హీరోలుగా సెటిల్ అయినప్పుడు హరికృష్ణ కళ్ళల్లో ఆనందం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక మనవళ్ళతో ఆయనది ప్రత్యేకమైన అనుబంధం.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR