Article 370 Is Terminated In J&K : Here’s Everything You Need To Know About It

Contributed by Kalyan Bharath & Sudheer Engli

Jammu & Kashmir last few days nundi Kashmir valley lo jarugutunna incidents gurnchi manam news lo chustune unnam. Oka side terrorist nundi threat internal ga locals nundi government and Indian Army ki against ga strikes lantivi jaruguthu vacchayi. India mottham 5 years ki okasari elections jarigithe, Jammu & Kashmir lo matram 6 years jaruguthayi and ikkada mana indian Flag host chese right kuda mana Indian Government ki undedi kadu. Ila enduku ante J & k state ki constitution Article 370 icchina freedom.

Kani ippudu aa Article 370 ni ettesindi central government. So ippud nundi Jammu & Kashmir meedha mana Indian Government ki and Indian Army full fledged ga rights vacchayi.

Article 370

Assala Article 370 enti ? dini valla Jammu & Kashmir lo inthaka mundu ela undedi? Ippudu ee article clampdown chesaka em avtundi anedi oo sari chuseddam.

రాజ్యాంగంలోని 370 వ అధికరణం: –

మీరు ఆర్టికల్ 370 యొక్క content చూస్తే, ఎందుకు వ్యతిరేకించాలో ఆలోచిస్తారు.
ఇది భారతీయులకు నెహ్రూగారి చేదు బహుమతి….

భారతదేశానికి స్వాత్యంత్రం వచ్చిన కొన్ని రోజులకే వచ్చిన పెద్ద సమస్య కాశ్మీర్. 1947 లో మొదలైన ఈ చిచ్చు ఇప్పటికి తీవ్ర స్థాయిలో కొనసాగడమే కాకుండా కాశ్మీర్ లోని సామాన్య ప్రజల్లో ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతుంది. అసలు కాశ్మీర్ సమస్య ఎందుకు వచ్చింది? ఆర్టికల్ 370 అంటే ఏంటి? ఈ చట్టం రావడం వెనుక ఎలాంటి కుట్ర జరిగిందనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రు, షేక్ మహమ్మద్ అబ్దుల్లా కాశ్మీర్ సమస్యపైనా కొన్ని చర్చలు జరుపగా చివరకు రాజ్యాగంలో ఆర్టికల్ 370 పుట్టుకువచ్చింది. ఈ నిబంధనలో ఏ దేశం కూడా ఆ దేశంలోని రాష్ట్రానికి అలాంటి నిబంధనలకు ఒప్పుకుని ఉండదు. కానీ నెహ్రు గారి ప్రభుత్వం మాత్రం ఆర్టికల్ 370 కి తలొగ్గింది. జమ్మూ కాశ్మీర్ రాజైన మహారాజా హరి సింగ్ వద్ద దివాన్‌గా పనిచేసే గోపాలస్వామి అయ్యంగార్ ఈ ఆర్టికల్ ని రూపొందించారు.

ఇక ముందుగా ఆర్టికల్ 370 లో ఎలాంటి నిబంధనలు ఉన్నాయనే విషయంలోకి వెళితే…..

● జమ్ము-కాశ్మీర్ పౌరులకు ద్వంద్వ పౌరసత్వం ఉంది.

● జమ్ము-కాశ్మీర్ జాతీయ పతాకం భిన్నంగా ఉంటుంది.

జమ్ము-కాశ్మీర్ శాసనసభ్యుల పదవీకాలం 6 సంవత్సరాలు.

మిగతా భారతదేశానికి 5 సంవత్సరాలు

● జమ్మూ-కాశ్మీర్లో భారత జాతీయ పతాకాన్ని లేదా జాతీయ చిహ్నాలను అవమానిస్తే నేరం కాదు!

జమ్మూ – కాశ్మీర్లో భారత సుప్రీంకోర్టు యొక్క ఆదేశం చెల్లుబాటు కాదు.

● భారత పార్లమెంటు నిబంధనల విషయంలో చాలా పరిమిత స్థలాలలో చట్టాలు చేయవచ్చు

● ఒక కాశ్మీరి మహిళ భారతదేశపు ఇతర రాష్ట్రంలోని ఒక వ్యక్తిని వివాహం చేసుకుంటే, ఆ మహిళకు కాశ్మీరీ పౌరసత్వం ముగుస్తుంది

కానీ కాశ్మీరి మహిళ పాకిస్తాన్ నుండి ఒక వ్యక్తిని వివాహం చేసుకుంటే దీనికి విరుద్ధంగా జమ్మూ – కాశ్మీర్ పౌరసత్వాన్ని అతడు పొందుతాడు.

● విభాగం 370 కారణంగా
కాశ్మీర్లో సమాచార హక్కు వర్తించదు
RTIఅమలు చేయబడలేదు
CAG వర్తించదు …
భారత చట్టాలు వర్తించవు.

● షరియా చట్టం కాశ్మీర్లో మహిళలకు వర్తిస్తుంది.
కాశ్మీర్లో పంచాయతీలకు హక్కులు లేవు.

కాశ్మీర్లోని మైనారిటీలు [హిందువులు మరియు సిక్కులు] 16% రిజర్వేషన్లు పొందలేరు.

● విభాగం 370 కారణంగా
ఇతర రాష్ట్రాల్లోని భారతీయులు కాశ్మీర్లో భూమిని కొనుగోలు చేయలేరు

● 370 సెక్షన్ల వలన పాకిస్థానిలకు భారతీయ పౌరసత్వం లభిస్తుంది
కేవలం కాశ్మీర్ నుండి ఒక అమ్మాయిని వివాహం చేసుకోవాలి.

Article 370

ఇలా జమ్మూ కాశ్మీర్లో రక్షణ, విదేశాంగ విధానాలు, కమ్యూనికేషన్ అంశాలు మినహా ఏ ఇతర అంశానికి సంబంధించిన చట్టాన్ని అమలుపరచాలన్న కేంద్రం కాశ్మీర్ ప్రభుత్వ అనుమతి తప్పకుండ తీసుకోవాలి.

భారత దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలలో ఉన్న వారికీ ఒకే పౌరసత్వం ఉంటె, కాశ్మీర్ లోని ప్రజలకు మాత్రం ఆర్టిక‌ల్ 370 ద్వారా రెండు పౌర‌సత్వాలు ఉంటాయి. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తే, కాశ్మీర్ లో మాత్రం ఆరు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తాయి. ఇంకా సుప్రీం కోర్ట్ తీర్పులు, పార్లమెంట్ చట్టాలు ఈ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలకే పరిమితమవుతాయి. జమ్మూకాశ్మీర్ లో ఉండే ఆడవారు భారతదేశానికి చెందిన వారిని పెళ్లి చేసుకుంటే కాశ్మీర్ లో ఉండే వారి పౌరసత్వాన్ని కోల్పోతారు. అదే పాకిస్థాన్ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే మాత్రం పాకిస్థాన్ వారికీ కూడా కాశ్మీర్ పౌరసత్వం లభిస్తుంది. వేరే రాష్ట్రానికి చెందిన వారు ఇక్కడ ఆస్తులను కొనుగోలు చేయలేరు. ఏదైనా అల్లరులు చెలరేగితే రాష్ట్రపతికి అత్యవసర పరిస్థితి విధించే అవకాశం అక్కడ లేదు కేవలం యుద్ధ సమయంలో మాత్రమే అక్కడ అత్యవసర పరిస్థితి విధించే అవకాశం ఉంది. ఇలాంటి ఎన్నో ప్రత్యేక ప్రతిపత్తి వల్ల జమ్ము-కశ్మీర్ రాష్ట్రంపై రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 అమలు సాధ్యం కాదు. దాంతో భారత రాష్ట్రపతికి ఆ రాష్ట్ర రాజ్యాంగాన్ని రద్దు చేసే హక్కు కూడా ఉండదు.

స్వాత్యంత్రం వచ్చిన తరువాత మొదటి ప్రధానమంత్రి అయ్యే అన్ని అర్హతలు, మెజారిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికే ఉండగా నెహ్రు గారికి గాంధీ తో స్నేహ సంబంధం కారణంగా ఆయన ప్రధానిగా బాధ్యతలను తీసుకుంటే పదవి ఆశించని ఉక్కు మనిషి పటేల్ గారు హోమ్ మంత్రిగా బాధ్యతలను చేపట్టారు. నెహ్రు గారికి పటేల్ గారికి మధ్య ఉన్న పోటీ కారణంగానే నెహ్రు గారు శాంతికి మారుపేరుగా ఉండాలని, కాశ్మీర్ సమస్య తనే లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే కాశ్మీర్ సమస్య బాధ్యతలను నెహ్రు గారు తీసుకున్నారనే వాదన కూడా ఉంది.

ఇక స్వాత్యంత్రం రాకముందు జమ్మూ – కాశ్మీర్ మహారాజా హరి సింగ్ అనే రాజు అధీనంలో ఉండేది. జమ్మూలో ఎక్కువగా హిందువులు ఉంటె కాశ్మీర్ లో ఎక్కువగా ముస్లింలు ఉండేవారు. స్వాతంత్య్రం వచ్చిన కొన్ని రోజులకే పాకిస్తాన్ వాయువ్యప్రాంతపు పఠానుతెగలవారు సరిహద్దులు దాటివచ్చి కాశ్మీర్ లోకి ప్రవేశించి గిల్గిత్‌-బాల్టిస్థాన్‌ ప్రాంతాలను ఆక్రమించారు. దీనినే పాక్ ఆక్రమిత కశ్మీర్ పీవోకే అని పిలుస్తారు. అప్పుడు కాశ్మీర్ లో అల్లరులు చెలరేగగా సైనిక బలం లేని కాశ్మీర్ రాజు భారతదేశాన్ని సహాయం కోరి జమ్మూ – కాశ్మీర్ ని భారత్ లో విలీనం చేయడానికి ఒప్పుకున్నారు. ఇక ఎలాంటి సమస్యలేదు భారతదేశంలో దాదాపుగా అన్ని సంస్థానాలు విలీనం అవ్వుతున్నాయని అనుకునేలోపు గవర్నర్ జనరల్ గా మౌంట్ బాటన్ రూపంలో చిచ్చు రగిలింది. ఒకరకంగా చెప్పాలంటే ఇతడి కారణంగానే కాశ్మీర్ అనేది ఇప్పటికి పెద్ద సమస్యగానే మారిపోయింది.

ఒకపక్క భారతదేశానికి రాజ్యాగాన్ని రచించే పనుల్లో అంబెడ్కర్ గారు ఉండగా, గవర్నర్ జనరల్ గా మౌంట్ బాటన్ కాశ్మీర్ రాజే వచ్చి తనంతట తానుగా తన రాజ్యమైన జమ్మూ కాశ్మీర్ ని భారత్ లో విలీనం చేయడానికి ఒప్పుకుంటున్నాను అని చెప్పినప్పటికీ గవర్నర్ జనరల్ గా మౌంట్ బాటన్ కి కాశ్మీర్ భారత్ లో కలవడం ఇష్టం లేక దీని అడ్డుకోవడానికి ఇలా విలీనం చేయడానికి ప్రజల ఆమోదం తప్పనిసరిగా ఉండాలనే ఒక నియమాన్ని పెట్టాడు. అయితే కాశ్మీర్ లో షేక్ అబ్దుల్లా ప్రజానాయకుడిగా మంచి పేరున్న వ్యక్తి. షేక్ అబ్దుల్లాకి నెహ్రు గారికి మంచి స్నేహ సంబంధం ఉండటంతో ప్రజాబలం మనకే ఉంటుందని భావించిన నెహ్రు గారు దీన్ని తేలిగ్గా తీసుకున్నారు.

ఇంకా 1947 పాకిస్థాన్ కాశ్మీర్ లోకి రాగ యుద్ధం చేస్తున్న భారత్ సైన్యాన్ని ఆపి మౌంట్ బాటన్ మాటలు విన్న నెహ్రు గారు శాంతి కోసం ఐక్యరాజ్యసమితి దగ్గరికి ఈ సమస్యని తీసుకువెళ్లారు. దీంతో యుద్ధం లో ఆక్రమించిన భూభాగాన్ని వదిలి పాకిస్థాన్ వెళ్లాలని, ఇక విలీనం విషయంలో కాశ్మీర్ ప్రజలదే నిర్ణయం అంటూ తేల్చి చెప్పింది. అసలు సమస్య లేని దాని దగ్గర అప్పటి కొందరి నాయకులూ చేసిన పనుల వలన అదే రాబోయే రోజులో పెద్ద సమస్య అయింది. జమ్మూ రాజు విలీనం పత్రాలపైనా సంతకం చేసి ఇచ్చిన తరువాత నెహ్రు అండతో షేక్ అబ్దుల్లా రాజుని పక్కకి నెట్టి అక్కడి అధికార పగ్గాలను అందుకున్నాడు. ఇలా అధికారాన్ని చేజిక్కించుకున్న అబ్దుల తన అసలు రంగుని బయటపెట్టడం మొదహ్లుపెట్టాడు. మౌంట్ బాటన్ విలీన పత్రంలో పొందుబరిచిన దానిప్రకారం భారత్ రక్షణ, విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్ కి సంబంధించిన విషయాలలో కలుగజేసుకుంటుందని ఉండగా. దాన్ని ఆసరాగా తీసుకున్న అబ్దుల్లా మాకంటూ ఒక రాజ్యాగం ఉండాలని, తమ పరిపాలన తామే చూసుకుంటామని, భారత్ విలీన పత్రంలో ఉన్న మూడు విషయాల్లోనే కలుగచేసుకోవాలని మిగిలిన అన్ని విషయాలు తమ ఆధీనంలోనే ఉండాలని వీటికి ఒప్పుకుంటే రాజ్యాంగ నిర్మాణ సభలో ఉంటామని తేల్చి చెప్పేసాడు అబ్దుల్లా. ఆ సమయంలో అంబెడ్కర్ గారి దగ్గరికి అబ్ద్బుల్లా వెళ్లి రాజ్యాంగంలో కాశ్మీర్ కి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాలని కోరగా దానికి అంబెడ్కర్ గారు ఒప్పుకోకుండా, ఇలాంటి ప్రతిపత్తి అసలు కుదరదని అలాంటి అధికారం ఎవరికీ లేదని, ఎవరిమాటని లెక్కచేయకుండా రాజ్యాగం పనిలోనే ఉండిపోయారు. ఇక పటేల్ గారు దీనిపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసలు అబ్దుల్లా మాటలను పట్టించుకోకూడదు, సమస్య చేయి దాటివెళ్ళకముందే పరిష్కారాన్ని చూడాలని అందరితో అంటున్నప్పటికీ నెహ్రు మాత్రం కాశ్మీర్ వ్యవహారం నుండి పటేల్ ని తప్పించి ఆ స్థానంలో గోపాల స్వామి అయ్యంగార్ ని ఎంపిక చేసారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఒక పక్క ఐక్యరాజ్య సమితి పెట్టిన నిబంధన, మరొక పక్క కాశ్మీర్ లో బలం కావాలంటే అబ్దుల్లా వంటి నాయకుడి అండ కావాలి, కానీ అబ్దుల్లా పెట్టె షరతులు చాలా కఠినంగా ఉన్నాయి, ఇక ఈ విషయం పైన కొందరి నాయకుల అసంతృప్తి వీటన్నిటిని నడుమ దిక్కుతోచని స్థితిలో లేనిదాన్ని సమస్యగా తెచ్చుకొని, కొందరు నాయకుల అవివేకం వలన పుట్టుకువచ్చిందే ఆర్టికల్ 370.

చివరిగా ఈ రోజు ఆర్టికల్ 370 రద్దు చేస్తునట్టు రాష్ట్రపతి నుండి ఆమోదం వచ్చింది.

Ee article ni addu pettukuni Jammu & Kashmir lo Pakistan chestunna illegal activities and threats ki full stop padutundi. Adi okkate kadu Central Government and Indian Army ki full rights undadam tho patu ippudu valley lo peace ni control cheyadaniki chala helpful ga untundi. Jammu and Kashmir is completely part of our country now, today is a historical day.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR