Hinduvula pavitra kshetram amarkantak.!

0
4622

దేశంలో ఉన్న ప్రముఖ దేవాలయలో ఈ ఆలయం కూడా చాలా ప్రసిద్ధమైన దేవాలయం. ఈ ఆలయాన్ని సందర్శించి ఇక్కడ పూజలు నిర్వహిస్తే స్వర్గప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఒకసారి తెలుసుకుందాం.Hinduvula

దేశంలోని పుణ్యక్షేత్రాలలో అమరకంటక్ ప్రముఖమైనది. దీనిని తీర్థరాజం అని కూడా పిలుస్తారు. యాత్రాస్థలాలకు రాజు అని కూడా పేర్కొంటారు. ఈ క్షేత్రం మధ్యప్రదేశ్ రాష్ట్రం ఆగ్నేయభాగంలో మధ్యప్రదేశ్ , ఛత్తీస్ ఘడ్ సరిహద్దులో నెలకొని ఉన్నది. అమరకంటక్ చుట్టూ వింధ్య, సాత్పూరా, మైకల్ పర్వత శ్రేణులు నెలకొని ఉన్నాయి. పురాణాలలో అమరకంటక్ ను రిక్ష పర్వతం అని పేర్కొనబడినది. ఈ క్షేత్రం 12 కిలోమీటర్ల చుట్టుకొలతతో అలరారుతున్నది.Hinduvula

అమరకంటక్ హిందువులకు పవిత్రమైన పుణ్యక్షేత్రం. నిర్వాణానికి ద్వారం అని చెబుతారు. మహత్తరమైన నర్మదా మరియు సోనె నదులు ఇక్కడ ఆవిర్భవిస్తాయి. కాళిదాసు తన మేఘసందేశం రచనలో అమరకంటక్ ను అమరకూటం గా పేర్కొన్నట్లు చెబుతారు.Hinduvula

పురాణ గాథల ప్రకారం శివుడు త్రిపురను దహించివేసినప్పుడు మూడు నిప్పులలో ఒకటి అమరకంటక్ లో పడింది. అది వేలాది శివలింగాలుగా రూపొందాయి. వాటిలో ఒక లింగం ఇప్పటికీ జ్వాలేశ్వర్ లో పూజింపబడుతున్నది. అమరకంటక్ ను సందర్శించి శివుని ఆలయంలో పూజలు జరిపినవారికి స్వర్గప్రాప్తి కలుగుతుందని ప్రతీతి. అమరకంటక్ పర్వతాన్ని అధిరోహించిన వారికి పది మార్లు అశ్వమేధయాగం చేసినంత ఫలం లబిస్తుందని పద్మపురాణం ఆది కాండంలో చెప్పబడింది. భక్తులు పవిత్రమైన నర్మదా నదిలో మునిగి జ్వాలేశ్వరుని సందర్శిస్తారు.Hinduvula

దేశంలోని పుణ్యనదులలో నర్మదానది ఐదవ స్థానంలో ఉన్నది. పెక్కు హైందవ పురాణాలు, రామాయణం, మహాభారతాలలో నర్మదానది ప్రస్తావన ఉన్నది. నర్మదా నదికి శివునితో లంకె ఉన్నది. ఈనదీతీరంలో లభిస్తున్న పెక్కు రాళ్లను శివలింగాలుగా భావింవి పూజిస్తారు. ఈ రాళ్లను బణలింగాలు అంటారు. అవి సాధారణంగా స్థూపాకారంలో శివలింగాకృతిలో ఉంటాయి. జోహిలాకు చెందిన జ్వాలవంతి, మహానది, అమోద్ నదులు అమరకంటక్ పీఠభూమిలో ఆవిర్భవించాయి.

Hinduvula
అమరకంటక్ నర్మదా నది జన్మస్థానం అయిన కారణంగా ఇక్కడ భక్తులు విశేష భక్తిశ్రద్ధలతో పూజలు జరుపుతారు. అమరకంటక్ పర్యటన సందర్భంగా యాత్రికులు కపిలధార, నర్మదా ఖండ్ ఆలయాలను సందర్శిస్తారు. ఇలా దేశంలో ప్రముఖ దేవాలయంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి భక్తులు ఎప్పుడు అధిక సంఖ్యలో వస్తుంటారు.Hinduvula