Importance And Significance Of ‘Gajendra Moksham’ In Bhadavadgita

0
381

పోతన రచించిన భాగవతంలో గజేంద్ర మోక్షం గాథ వివరించి ఉంది. అయితే శుక్ర మహర్షి, శ్రీమహావిష్ణువు గజేంద్రుడిని కాపాడటానికి కోసం భూలోకానికి వచ్చాడని పరీక్షిత్తు మహారాజుకు చెప్పగా, అప్పుడు పరీక్షిత్తు మహారాజు గజేంద్రుడి కథని వివరంగా చెప్పమని అడుగుతాడు. మరి గజేంద్రమోక్షంలో ఉన్న రహస్యం ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

'Gajendra Moksham'పూర్వం ఒకప్పుడు క్షిరసాగర మధ్యలో త్రికూట పర్వతం ఉండేది. ఆ పర్వతానికి మూడు శిఖరాలు ఉండగా, ఒక శిఖరం బంగారంతో, ఒక శిఖరం వెండితో, ఒక శిఖరం ఇనుముతో చేయబడ్డాయి. అయితే అందులో ఉన్న అడవిలో అన్ని రకాల జంతువులు ఉండగా, ఏనుగులు గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉండేవి. ఆ ఏనుగులకు దాహం అవ్వగా తిరుగుతూ తిరుగుతూ సరోవరానికి చేరుకున్నాయి. ఆ సరోవరం లో దాహం తీర్చుకోవడానికి ఏనుగుల గుంపు దిగి దాహం తీర్చుకొని బయటికి రాగ గజరాజు మాత్రం నీటిలోకి దిగి నీటిని పీల్చి ఆకాశంలోకి విసరగా తొండంలోని నీటిలో ఉన్న చేపలు అన్ని కూడా వెళ్లి మీనరాశిలోకి, ఎండ్రకాయలు కర్కాటక రాశిలోకి, మొసళ్ళు మకర రాశిలోకి పడిపోయాయి.

'Gajendra Moksham'ఈవిధంగా గజరాజు నీటిలోకి దిగి చేస్తుండటం చూసిన ఒక పెద్ద మొసలి గజరాజు కాలుని గట్టిగ పట్టుకొని నీటిలోకి లాగుతుండగా మొసలి నుండి తన ప్రాణాలను ఎలా రక్షించుకోవాలి అని అనుకుంటూ ఉండగా ఆ స్థితిలో అతడు పూర్వం చేసిన పుణ్యం పూజ గుర్తుకు వచ్చినది. అప్పడు గజరాజు రక్షణ చేసేవాడు స్థితికారుడై ఉండాలి. స్థితికారుడు శ్రీమహావిష్ణువు కనుక స్తోత్రం చేసింది. నీవు తప్ప నన్ను ఇప్పుడు రక్షించే వారు ఎవరు లేరు, నా తప్పులన్నీ క్షమించమంటూ శరణాగతి చేస్తూ, వైకుంఠం నుండి పరమాత్మా తనను తాను మరిచిపోయి రావాలని ప్రార్ధించింది. అప్పుడు మహావిష్ణువు శంఖు, చక్ర, గద లేకుండా లక్ష్మీదేవికి చెప్పకుండా అలానే వైకుంఠం నుండి బయలుదేరగా, లక్ష్మీదేవి ఎన్నడూ ప్రార్దించని గజరాజు ఒక్కసారి ప్రార్దించగానే స్వామివారు ఇలా వెళ్ళిపోతున్నారంటూ మహావిష్ణువు వెనుక బయలుదేరింది, లక్ష్మీదేవి వెనుక గరుత్మంతుడు, శంఖు చక్రములు వారి వెనుక పురుష రూపం దాల్చి పరిగెడుతూ ఉన్నాయి.

'Gajendra Moksham'ఈవిధంగా సరోవరం చేరి మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని పిలిచి నీటిలోకి వెళ్లి మొసలి తల ని కండించమని చెప్పడంతో, సుదర్శన చక్రం నీటిలోకి వెళ్లి మొసలి తలని నరికి వేయడంతో గజరాజు అప్పుడు ఊపిరిని పీల్చుకుంటాడు. గజరాజు నీటి నుండి తామర పుష్పాన్ని తీసుకువచ్చి స్వామివారి పాదాలకు పెట్టి నమస్కరించింది. మొసలి చనిపోయినప్పుడు అందులో నుండి ఒక గంధర్వుడు వచ్చి గంధర్వ లోకానికి వెళ్ళిపోయాడు. ఇలా కథ వింటూనే పరిక్షిత్తుడు శుక్ర మహర్షితో ఇంతటి పుణ్యం ఆ గజరాజుకి ఎలా వచ్చిందో చెప్పమని అడుగగా, ఒకప్పుడు ద్రవిడ దేశాన్ని పరిపాలించే రాజు ఉండేవాడు, అతడు అష్టాక్షరీ మంత్రోపదేశమును పొంది  ఒక పర్వత శిఖరానికి చేరుకొని అక్కడ అష్టాక్షరీ మంత్రం ఉపాసన చేద్దామని భావించి అక్కడే మంత్రం జపం చేస్తుండగా, అక్కడికి అగస్త్య మహర్షి వచ్చాడు. అయితే మంత్ర జపం చేస్తున్నాని మహర్షి వచ్చిన లేవకపోవడంతో ఆగ్రహించిన అగస్త్య మహర్షి ఏనుగు యోని యందు జన్మించెదవు అని శపించాడు. ఐతే మహాపురుషులు ఏనాడూ అయితే మీ ఇంటికి వస్తారో ఆ రోజే మీ పూజ ఫలించిందని గుర్తు పెట్టుకోవాలి అని అనడంతో. ఆలా గజరాజుగా జన్మించి తన ప్రాణాలు పోయే సమయంలో గతజన్మలో చేసిన మంత్రానుష్టాన ప్రభావం వలన శ్రీమన్నారాయణుడు గుర్తుకు వచ్చి శరణాగతి చేసాడు.

'Gajendra Moksham'ఇక గంధర్వుని విషయానికి వస్తే, గంధర్వుడు ఒక రోజు గంధర్వ కాంతలతో నీటిలో నిలబడి స్నానం చేస్తుండగా అక్కడికి బాగా చిక్కిపోయిన ఒక మహర్షి రాగ అతడిని అపహాస్యం చేస్తే గంధర్వ కాంతలు నవ్వుతారని భావించి నీటిలోపలి నుండి వచ్చి ఆ మహర్షి కాళ్ళని లాగడంతో మహర్షి నీటిలోకి పడిపోయాడు. అప్పడూ ఆగ్రహించిన మహర్షి నీకు నీటి అడుగు నుండి వచ్చి కళ్ళు లాగే అలవాటు ఉన్నది కనుక ఆలా చేసే మొసలి వై జన్మించమని శపిస్తాడు. ఆవిధంగా సుదర్శన చక్రం తో తల నరకబడగా అతడికి శాపవిమోచనం కలిగింది. అందుకే గంధ్వరుడు అయి గంధర్వ లోకానికి వెళ్ళిపోయాడు.

'Gajendra Moksham'ఈవిధంగా భాగవతంలో చెప్పిన కథలన్నీ ఒక ఎత్తు గజేంద్ర మోక్షం ఒక ఎత్తు. ఎవరు అయితే ఈ గజేంద్ర మోక్షం కథని శ్రద్దగా వింటారో పాపాలు పరిహరించాడతాయి. ఐశ్వర్యం కలసి వచ్చి దరిద్రం తొలగిపోతుంది. గ్రహ దోషాల వలన కలిగే పీడలు తొలగిపోతాయి.

SHARE