అశ్వత్థ నారాయణ స్వామి ఆలయం యొక్క ప్రాముఖ్యత

ఇక్కడి ఆలయములో అశ్వత్థ నారాయణ స్వామి వారు భక్తులకి దర్శనమిస్తారు. ఈ ఆలయ స్థలంలోనే అశ్వత్థవృక్షం ఉంటుంది. మరి ఆ వృక్షం అక్కడ ఎలా వెలిసింది ఇంకా ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది ఒకసారి ఇప్పుడు తెలుసుకుందాం.

సర్ప దోష నివారణ క్షేత్రం

కర్ణాటక రాష్ట్రంలో చిక్ బళాపూర్ జిల్లాలో పెన్నా నది తీరాన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకి ఒక 15 కీ.మీ దూరములో ఈ ఆలయం అనేది ఉన్నదీ. అయితే ద్వాపరయుగంలో విదురుడు తీర్ధ యాత్రలు చేస్తూ పెన్నా నది తీరాన ఉన్న ఈ ప్రాంతానికి వచ్చి ఇచ్చట గల మైత్రేయ మహర్షిని గురువుగా భావించి ఉండగా కొన్ని రోజుల తరువాత వీరిద్దరూ శ్రీ మహావిష్ణువు కోసం పెన్నా నదిలో తీవ్ర తపస్సు చేస్తుండగా ఒక అశ్వత్థ వృక్షం యొక్క ఒక కొమ్మ నదిలో తేలుతూ వీరి దగ్గరికి వచ్చినది. అప్పుడు మైత్రేయ మహర్షి సూచనమేరకు ఆ కొమ్మను అశ్వత్థ నారాయణువిగా భావించి విదురుడు ఆ కొమ్మని ఇచ్చట ప్రతిష్టించగా దానినే ఇప్పుడు విదురాశ్వత్థముగా పిలవబడుతూ ఉండగా ప్రస్తుతం విదురాశ్వత్థ నారాయణ క్షేత్రముగా ప్రసిద్ధి చెందింది. అప్పుడు పెట్టిన కొమ్మ ఏ మాత్రం ఇప్పటికి శిధిలం అవ్వకుండా ఒక మహా వృక్షంగా ఎదిగింది.

సర్ప దోష నివారణ క్షేత్రం

ఈ వృక్షం చుట్టూ అనేక సర్పరాజములున్నవి. నాగదోషం ఉన్నవారు ఇచ్చట శ్రీ సత్యనారాయణ వ్రతం చేసి,నాగప్రతిష్ఠ చేస్తే వారి దోషం పోతుందని భక్తులు నమ్ముతారు. ఈ ఆలయములో ఇప్పటి వారికి సుమారుగా 5000 పైగా నాగప్రతిమలా ప్రతిష్ట జరిగిందని చెప్పుతారు. అందుకే ఈ గుడిప్రాంగణంలో ఎటు చూసిన నాగుల విగ్రహాలే కనిపిస్తాయి.

సర్ప దోష నివారణ క్షేత్రం

ఇప్పటికి ఇన్ని సంవత్సరాలైనా ఈ మహా వృక్షం అలానే ఉండటం విశేషం. అంతేకాకుండా సంతానం లేని వాళ్ళకి ఇక్కడకి వస్తే సంతానం కలుగుతుందనే నమ్మకంతో ఇక్కడకి భక్తులు ఎక్కువగా రావడం ఈ విదురాశ్వత్థ క్షేత్రం యొక్క ప్రాముఖ్యత అని చెప్పవచ్చు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR