బీష్ముడిని కురుపితామహుడు అని ఎందుకు పిలుస్తారు ?

పాండవులకు, కౌరవులకు మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం లో ఎందరో గొప్ప వీరులు వీర మరణాన్ని పొందారు. కురుక్షేత్ర యుద్ధం ఎన్నో జీవిత సత్యాలని మనకు మహాభారతం ద్వారా తెలియచేస్తుంది. అయితే మహాభారతంలో ఈయనను కురుపితామహుడు అని సంబోధిస్తారు. ఇంకా దేశంలో ఒకే చోట మాత్రమే ఆయనకి ఆలయం అనేది ఉంది. మరి అయన ఎవరు? ఆ దేవాలయం ఎక్కడ ఉంది అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Bhishma In Mahabharata

బీష్ముడి విషయానికి వస్తే, శంతనుడు గంగానదిని పెళ్లి చేసుకుందామనుకుంటాడు. అప్పుడు గంగాదేవి నేను ఏమి చేసినా ప్రశ్నించకూడదు. అలా చేస్తే నేను నిన్ను విడిచివెళ్లిపోతాను అంది. అప్పుడు దానికి అంగీకరించాడు శంతనుడు. ఇలా పెళ్లి జరిగిన తరువాత గంగాదేవికి ప్రథమ పుత్రుడు ఉదయించాడు. ఆమె ఆ బిడ్డను తీసుకువెళ్లి గంగలో విడిచింది. ఈ విధంగా ఏడుగురు బిడ్డలను గంగలో విడిచింది. ఎనిమిదవ పుత్రుడిని విడిచి పెడుతుండగా శంతనుడు అడ్డు తగిలాడు. తను విధించిన షరతు ప్రకారం గంగాదేవి శంతనుడిని విడిచి వెళ్లిపోతూ అష్టమ శిశువును తనతో తీసుకువెళ్లి పెంచి పెద్దవాడిని చేస్తానని చెప్పింది. ఆ బిడ్డకు దేవవ్రతుడు అని నామకరణం చేసి పెంచి పెద్దవాడిని చేసి శంతనుడికి అప్పచెప్పి వెళ్లిపోయింది. ఆలా పుట్టిన దేవవ్రతుడే “బీష్మణుడు” .

Bhishma In Mahabharata

ఒకనాడు శంతనుడు సత్యవతి అనే మత్స్య కన్యను చూసి మోహించాడు. ఆమెను వివాహం చేసుకోవాలంటే ఆమెకు కలగబోయే కుమారుడే సింహాసనం అధిష్టించాలని షరతు విధించాడు. ఈ విషయం తెలుసుకున్న గంగానందనుడు తన తండ్రి కోసం తాను జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోతానని భీష్మ ప్రతిజ్ఞ చేశాడు. నాటి నుంచి భీష్ముడయ్యాడు. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల పక్షాన పది రోజుల పాటు యుద్ధం చేసి శిఖండిని అడ్డుగా పెట్టుకుని అర్జునుడు చేసిన యుద్ధంలో గాయపడిన భీష్ముడు అంపశయ్యపై శయనించాడు. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చాక దేహత్యాగం చేస్తానన్నాడు. యుద్ధం ముగిసిన తరవాత తన వద్దకు వచ్చిన పాండవులకు నీతిబోధ చేశాడు. భీష్ముడు శర శయ్య మీద ఉన్నప్పుడే విష్ణుసహస్ర నామాలను రచించాడని ప్రతీతి. విష్ణుమూర్తిని ధ్యానిస్తూ 1008 నామాలు పఠించాడు భీష్ముడు.

Bhishma In Mahabharata

ఇక ఆయనకి ఉన్న ఆలయ విషయానికి వస్తే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్‌ నగరంలో అత్యంత అరుదైన భీష్మ దేవాలయం ఉంది. యాభై సంవత్సరాల నాటి ఈ దేవాలయానికి దేశంలోని మారుమూలల నుంచి ఎందరో భక్తులు వచ్చి భీష్మపితామహుడిని సందర్శించుకుని, భ్రాతృత్వాన్ని అలవరచుకుంటున్నారు. పెద్దలను స్మరించుకోవడం కోసం ఈ దేవాలయానికి ప్రధానంగా పితృపక్షాల సమయంలో భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. అక్కడి దారగంజ్‌లోని నాగవాసుకి అత్యంత సమీపంలో దేవాలయానికి భీష్మ దేవాలయం ఉంది. భీష్మపితామహుడు అంపశయ్యపై పడుకున్న భంగిమలో ఇక్కడ దర్శనమిస్తాడు. గంగాభక్తురాలైన ఒక వృద్ధ స్త్రీ ప్రతిరోజూ నదిలో స్నానం చేయడానికి వచ్చేదట. ఆమె స్వయంగా భట్‌ దగ్గరకు వచ్చి గంగాపుత్రునికి ఒక దేవాలయం నిర్మించమని వేడుకుందట. ఆమె వేడుకున్న తర్వాత ఆయనలో ఆలోచనకు అంకురార్పణ జరిగిందట. అలా గంగానదీ సమీపాన ఉన్న నాగవాసుకి దేవాలయానికి సమీపంలో ఈ దేవాలయ నిర్మాణం జరిగింది.

Bhishma In Mahabharata

కురుపితామహుడు అని పిలువబడే భీష్ముడు ఇలా తండ్రికోసం భీషణ ప్రతిజ్ఞ చేసి చివరి వరకు బ్రహ్మచారిగా ఉంటూ మహాభారతంలో ప్రాణాలు వదిలిన పుణ్యపురుషుడు.

Bhishma In Mahabharata

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR