దధీచి మహర్షి తన వెన్నముక్కను ఇంద్రుడికి వజ్రాయుధంగా ఇచ్చిన ప్రదేశం ఎక్కడ ?

పూర్వం వృత్తాసురుడు అనే రాక్షసుడు దేవతలందరినీ ముప్పు తిప్పలు పెడుతుండగా ఆ రాక్షసుడిని ఇంద్రుడు వజ్రాయుధంతో సంహరిస్తాడు. మరి ఆ వజ్రాయుధం ఎలా తయారైంది? ఆ రాక్షసుడికి పూర్వ జన్మలో పార్వతీదేవి పెట్టిన శాపం ఏంటి? ఇక్కడ వెలసిన ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Dadhichi Maharshi

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పుగోదావరి జిల్లాలో మందపల్లి అనే గ్రామంలో శనైశ్చరాలయం ఉంది. ఈ ఆలయాన్ని మందేశ్వరాలయం అని కూడా అంటారు. ఈ ఆలయానికి దగ్గరలోనే దధీచి మహర్షి ఆశ్రమం ఉంది. ఈ ఆశ్రమంలోనే దధీచి మహర్షి తపస్సు చేసి శక్తులని పొందాడని పురాణం. అన్తగేకాకుండా ఇక్కడే దధీచి మహర్షి తన వెన్నముక్కను ఇంద్రుడికి వజ్రాయుధంగా ఇచ్చాడని స్థల పురాణం.

2-Shani devudu

ఇక పురాణానికి వస్తే, పూర్వం విచిత్రకేతుడు అనే గంధర్వుడు ఆకాశంలో సంచరిస్తూ కైలాసానికి వెళ్లగా శివుడి తొడపైన కూర్చొని ఉన్న పార్వతీదేవిని చూసి నవ్వగా, పార్వతీదేవి ఆగ్రహించి నీవు మరు జన్మలో భూమిపైనా రాక్షసుడవై జన్మించదవు అంటూ శపించగా, ఆ శాపం కారణంగా అతడు భూలోకంలో వృత్తాసురుడను రాక్షసుడిగా జన్మిస్తాడు. అతడు దేవతలందరినీ బాదిస్తుండగా ఇంద్రుడు దధీచి మహర్షిని ప్రార్ధించగా అతడు తన వెన్నముక్కను వజ్రాయుధంగా ఇవ్వగా దానితో ఇంద్రుడు ఆ రాక్షసుడిని సంహరిస్తాడు.

Dadhichi Maharshi

ఇక ఈ ఆలయ విషయానికి వస్తే, ఈ ఆలయంలో ప్రధానదైవంగా శనేశ్వరుడు పూజలందుకుంటున్నాడు. ఈ స్వామికి శని త్రయోదశి రోజున తైలంతో అభిషేకాలు చేస్తే బాధలన్నీ తొలగిపోతాయనేది భక్తుల నమ్మకం. అందుకే ఈ ఆలయానికి శని త్రయోదశి రోజున ఎంతో మంది భక్తులు వచ్చి శనేశ్వరునకు తైలాభిషేకాలు జరిపి ఆ స్వామి అనుగ్రహాన్ని పొందుతారు. ఇక్కడి ఆలయానికి దగ్గరలో ఒక చిన్న కాలువ ఉంటుంది. దీనిని అశ్వతీర్థం అని అంటారు. ఈ తీర్థం లో మొదటగా స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకోవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది.

ఇలా వెలసిన ఈ స్వామివారిని దర్శనం చేసుకొని శత్రు, రోగ, రుణ మొదలైన బాధల నుండి విముక్తి పొందడానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR