Kaivaram Thaathayya aalayam gurinchi meku thelusa?

0
4941

దేవుడు వెలసిన ఆలయాల గురించి మనకి తెలుసు, కానీ ఇక్కడ ఆలయంలో ఒక గొప్ప యోగిని దేవుడిలా భావించి అయన సమాధిని దేవాలయంగా భావిస్తూ ఇక్కడి స్థానికులు పూజలు చేస్తున్నారు. మరి ఆ దేవుడిలా భావించే ఆ యోగి ఎవరు? ఈ ఆలయం ఎక్కడ ఉందనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. kaivaramకర్ణాటక రాష్ట్రం, చిక్కబళ్లాపురం జిల్లా చింతామణి సమీపంలో బెంగుళూరుకు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఈ కైవారం పట్టణం ఉంది. ఈ ప్రాంతంలోనే నారాయణయతి అనే యోగి సమాధి పై ఒక గొప్ప ఆలయం వెలసింది. ఈ ఆలయంలో కైవారం తాతయ్య అని భక్తులు కొలిచే నారాయణయతి విగ్రహం ఉంది. kaivaramఈ ఆలయ పురాణానికి వస్తే, క్రీ.శ. 1726 లో కొండప్ప, ముద్దమ్మ అనే దంపతులకి నారాయణప్ప జన్మించారు. ఇతడు చిన్నతనం నుండే భక్తిభావంతో మెలుగుతూ ఆధ్యాత్మికంలో నిమగ్నమయ్యాడు. అయితే కొంత కాలం తరువాత నారాయణప్ప కైవారం వద్ద గల కొండ గుహల్లో కొన్ని సంవత్సరాల పాటు ధ్యానముద్రలో, కఠోర తపస్సు చేసాడు. ఇలా తపస్సు చేసి నారాయణప్ప ఒక యోగిగా గుహ నుండి బయటికి వచ్చాడు. kaivaramఇలా యోగిగా మారిన నారాయణప్ప ఆ ఊరిలో సంచరిస్తూ సత్యం, శాంతి, ధర్మం వంటి ప్రవచనాలను భక్తులకి బోధించారు. ఇంకా ఈ స్వామి ఎన్నో కీర్తలను వ్రాసి వాటిని భక్తులచే పాటించేవాడు. ఇలా స్థానిక భక్తులచే అయన కైవారం తాతయ్యగా ప్రసిద్ధి చెందాడు. వీరు తన 110 వ ఏట సిద్ధిపొందారు. kaivaramనారాయణయోగి తపస్సు చేసిన కొండ ప్రదేశంలో ఒక ధ్యాన మందిరం వెలసింది. ఇక్కడ నిత్య పూజలతో పాటు, పండుగలు, గురుపూజ ఆరాధన సమయంలో ప్రత్యేక ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. విశాలమైన సదస్సు హల్ అధ్బుతమైన శిల్ప సంపదతో ఉంటుంది. ఈ ఆలయంలో స్వామిని దర్శించేందుకు వచ్చే భక్తులకి భోజనసదుపాయం కలుగచేస్తారు. ఈ ఆలయంలో నిత్యాన్నదాన పథకం ఉంది.kaivaramఈ ఆలయ దారిలోనే ఒక జాతీయ పార్క్ ఉంది. కైవారం తాతయ్య రచించి గానం చేసిన కీర్తనలను చెక్కబడిన ఫలకాలను, బండలను ఈ పార్కులో ప్రదర్శిస్తున్నారు. ఇక మహాభారతం లో బకాసురుడిని భీముడు ఈ కైవారం పక్కన ఉన్న కొండమీదే చంపినట్లు స్థానికులు చెబుతారు. ఈ కైవారం కొండమీదే చండీమాత ఆలయం కూడా ఉంది. kaivaramఇలా ఎన్నో సంవత్సరాల పాటు తపస్సు ఆచరించి నారాయణప్ప యోగిగా మారి కైవారం తాతయ్యగా భక్తుల పూజలనందుకుంటున్నాడు.7 kaivaram thathayya alayam gurinchi miku telusa