Kobbari chutney chesey paddathi

0
2714

పిల్లలకు పెద్దలకు ఉదయానే టిఫిన్ లోకి ఇడ్లి, దోస ఉండాలి. అందులోకి కొబ్బరి చట్నీ ఉంటే కడుపునిండా తినవచ్చు. అటువంటి కొబ్బరి చట్నీని తేలికగా ఎలా చేయవచ్చో తెలుసుకుందాం.

0 Kobbari Pachhadiకావాల్సిన పదార్థాలు..
1.కొబ్బరి కోరు : అర కప్పు
2.పచ్చి సెనగపప్పు : 2 టేబుల్ స్పూన్
3.జీలకర్ర : 1 /2 టీ స్పూన్
4.పచ్చి మిర్చి : 2
5.వెల్లుల్లి : 4 రెబ్బలు
6.ఉప్పు : తగినంత

తాళింపు కోసం
7.నూనె : 1 టీ స్పూన్
8.ఆవాలు : 1 /2 టీ స్పూన్
9.మినపప్పు : 1 /2 టీ స్పూన్
10.ఇంగువ : కొంచెం
11.ఎండు మిర్చి : 2
12.కరివేపాకు : ఒక రెమ్మ

కొబ్బరి కోరు, పచ్చి సెనగపప్పు, జీలకర్ర, పచ్చి మిర్చి, వెల్లుల్లి అన్నింటిని బాగా రుబ్బుకోవాలి. మనకి కావాల్సినంతగా నీళ్లు పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరీ పలుచగా కాకుండా, గట్టిగా కాకుండా రుబ్బుకోవాలి. బాణలిలో నూనె వేసి వేడెక్కాక ఆవాలు, మినపప్పు, ఎండు మిర్చి, కరివేపాకు వేయాలి. ఇంగువ కూడా కలుపుకోవాలి. ఇవన్నీ వేగాక ఇందులో రుబ్బి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని వేసి, ఉప్పు వేసి బాగా కలుపుకుంటే కొబ్బరి చట్నీ రెడీ.11 Kobbari Pachhadi