తిరుమలలో కాకుండా వేంకటేశ్వరస్వామి నివాసం ఉన్న అద్భుత ఆలయం ఎక్కడ ?

తిరుమలలో ఏడూ కొండల పైన వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం సందర్శించాడనికి ప్రపంచం నలుమూల నుండి లక్షల సంఖ్యల్లో భక్తులు వస్తుంటారు. అయితే ఈ స్వామి ఏడుకొండలలో వెలిసే ముందు తిరుమల కాకుండా ఏడూ ప్రదేశాలలో నివాసం ఉన్నట్లు పురాణాలూ చెబుతున్నాయి. ఆలా అయన నివాసం ఉన్న ఏడూ ప్రాంతాల్లోని ఒక ప్రదేశం మనం ఇప్పుడు చెప్పుకునే అప్పలాయ గుంట. మరి ఏడుకొండల వెంకన్న స్వామి ఈ ఆలయంలో స్వయంభువుగా ఎలా వెలిసాడు? అప్పలయ్య కథ ఏంటి? ఆ ఆలయం ఎక్కడ ఉంది? ఆ ఆలయ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

1-Temple

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా లో తిరుమలలోని ప్రధానమైన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయానికి చుట్టూ ఉన్న మరో ఏడూ పురాతన ఆలయాలలో అప్పలాయ గుంట వెంకటేశ్వరాలయం ఒకటి. దీనినే ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయం అని అంటారు.  ఈ ఆలయం చుట్టూ పచ్చటి పొలాలు ఉండి ఒకవైపు నల్లని కొండ ఉన్నందున ఇక్కడ ఒక ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది.

2-deevudu

ఇక పురాణానికి వస్తే,  తిరుమల శ్రీనివాసుడు నారాయణవనంలో పద్మావతిదేవిని పెళ్లి చేసుకుని, పసుపు దుస్తులతోనే తిరుమలకు బయల్దేరి వస్తూ ఈ ప్రాంతంలో కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి కూర్చుంటారు. అక్కడ అదే సమయంలో సిద్ధేశ్వర యోగి అనే మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆయన కళ్లు తెరిచి చూసేసరికి ఎదురుగా దివ్యదంపతులు కనపడేసరికి వారి పాదాల మీద పడి వారిని అక్కడే ఉండిపొమ్మని ప్రార్థిస్తాడు. స్వామి వారు చిరునవ్వుతో అతని వినతిని మన్నిస్తాడు. అలా ప్రసన్నం చేసుకోగానే వెలసినవాడు కాబట్టి అక్కడి దేవుడిని ప్రసన్న వేంకటేశ్వరస్వామి అంటారు.

3-Temple

ఇక అప్పులయ్యా గుంట అనడానికి కారణం ఏంటి అంటే, పూర్వం ఈ ప్రాంతాన్ని అన్ఱుణ అంటే రుణం లేని సరోవరం అని పిలిచేవారు. ఒకప్పుడు ఈ ప్రాంతంలో అప్పులయ్య అనే వ్యక్తి ఉండేవాడు.పేరుకు తగ్గట్టుగానే అతను వూరిలో అందరి దగ్గర అప్పులు చేసేవాడు. ఇది తెలుసుకున్న ఒక వ్యక్తి అతని దగ్గర నుంచి సొమ్మును తీసుకోవాలన్న దురుద్దేశంతో అతని మీద నింద మోపి ఎలాగైనా డబ్బు కాజేయాలనుకుంటాడు. అప్పులయ్య ఎలాగు అందరి దగ్గర అప్పులు చేస్తాడు కాబట్టి అందరు అతను నిజంగానే ఆ వ్యక్తి దగ్గర అప్పు చేశాడనుకుని అతనిని అప్పు చెల్లించమని చెప్తారు. అప్పులయ్య ఎంత చెప్పినా ఎవరు వినరు. దీంతో కోపోద్రిక్తుడైన అప్పులయ్య ఒక రాయి మీద నేను ఋణం తీసుకోలేదు అని రాసి దగ్గరలో ఉన్న ఒక కోనేరులో వేస్తాడు. ఆ రాయి ఆ కోనేటి లో మునిగిపోకుండా తెలుతుంది. దీంతో గ్రామస్థులందరు అప్పులయ్య నిజాయితీ పరుడని నమ్ముతారు. అప్పటి నుంచి ఆ కోనేరును అన్ఱుణ సరోవరం అని పిలిచేవారు. అప్పటి నుంచి ఆ ప్రాంతాన్ని అప్పులయ్యగుంట అనే పిలిచేవారు. కాలక్రమేణా అది అప్పలాయిగుంటగా ప్రసిద్ధి చెందింది.

4-God

ఈవిధంగా స్వామివారు స్వయంభూగా వెలసిన ఈ శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయం భక్తులకి దర్శనమిస్తుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR