Mahakavi thikkana mahabarathanni teluguloki anuvadinchindhi ikkade

0
2869

శ్రీ మహావిష్ణవు కొలువై ఉన్న ఈ ఆలయంలో ఎన్నో విశేషాలు అనేవి ఉన్నాయి. ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు ఆదిశేషుని పై పవళించి ఉన్న భంగిమలో భక్తులకి దర్శనం ఇవ్వడం విశేషం. ఇంకా ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలోనే మహాకవి తిక్కన మహాభారతాన్ని తెలుగులోకి అనువదించాడు. ఇలా ఎన్నో విశేషాలు ఉన్న ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఇక్కడ ఉన్న మరిన్ని విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.1 mahakavi thikkana mahabarathanni teluguloki anuvadinchindhi ikkade

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరు జిల్లాలోని పవిత్ర పెన్నా నది తీరాన అతి ప్రాచీనమైన శ్రీ తల్పగిరి రంగనాథా స్వామి వారి ఆలయం కలదు. ఈ ఆలయం చోళ రాజుల కాలం నాడు నిర్మించిన ఆలయం అని తెలుస్తుంది. అయితే స్థల పురాణం ప్రకారం మాత్రం ఇది జనమేజయుని కాలంలో నిర్మించినట్లుగా చెప్పబడుచున్నది.2 mahakavi thikkana mahabarathanni teluguloki anuvadinchindhi ikkade

ఈ ఆలయంలో రంగనాథస్వామి ని విష్ణువు ప్రతిరూపంగాను, రంగనాయక అమ్మవారిని లక్ష్మీదేవి ప్రతిరూపంగాను కొలుస్తారు. దేశంలో ప్రసిద్ధ్ది చెందిన రంగనాథస్వామి దేవాలయాల్లో శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయం మొదట శ్రీ వైకుంఠం అని పిలువబడేది. 17 వ శతాబ్దం తరువాత శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయం గాలిగోపురం 7 అంతస్థులతో సుమారు 95 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ గాలిగోపురం పైభాగాన బంగారు పూత పూసిన 7 కలశములు ఉంటాయి. ఈ ఆలయంలో స్వామివారు దక్షిణ దిక్కుగా శిరస్సు ఉంచి పశ్చిమాభిముఖంగా శేషతల్పం పై శయనించి భక్తుల సేవలు అందుకుంటున్నారు.3 mahakavi thikkana mahabarathanni teluguloki anuvadinchindhi ikkade

ఇక మహాకవి తిక్కన సోమయాజి జన్మించిన ప్రదేశం ఇదేనని చెబుతారు. ఈ పుణ్యక్షేత్రంలోనే అయన మహాభారతాన్ని తెలుగులోకి అనువదించాడని తెలుస్తుంది. అయితే 7 శతాబ్దంలో నెల్లూరు ప్రాంతమును పాలించిన పల్లవులు ఈ ఆలయంలో స్వామివారి విగ్రహం ప్రతిష్టించగా, 12 వ శతాబ్దంలో రాజరాజ నరేంద్రుడు అనే రాజు ఆలయాన్ని విస్తరించి బాగా అభివృద్ధి పరిచాడు.4 mahakavi thikkana mahabarathanni teluguloki anuvadinchindhi ikkade

ప్రధానాలయముకు ఉత్తరద్వారాన్ని వైకుంఠ ద్వారముగా పిలుస్తారు. వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార ప్రవేశం దొరుకుతుంది. ఇలా పవిత్ర పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో ఫాల్గుణ శుక్ల దశమి నుంచి బహుళ పంచమి వరకు బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలలో స్వామివారు అనేక వాహనాలపై నేత్రానంద కరంగా ఊరేగుతారు. అంతేకాకుండా స్వామి వారి రథయాత్ర చాలా గొప్పగా కన్నుల పండుగగా జరుగుతుంది. ఈ ఉత్సవాలలో భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శిస్తారు.5 mahakavi thikkana mahabarathanni teluguloki anuvadinchindhi ikkade