OkeChota Koluvaina Shivakeshavaalayaalu

0
2573

ఇక్కడ ఒకేచోట శివకేశవాలయాలు భక్తులకి దర్శనం ఇస్తుంటాయి. ఈ ఆలయం కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించనట్లుగా ఇక్కడ లభించిన శాసనాల ద్వారా తెలుస్తుంది. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయంలోని విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. shivakeshaavalaayaluఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పచ్చిమగోదావరి జిల్లా, ఏలూరులోని శనివారపు పేటలో శ్రీ చెన్నకేశవస్వామివారి ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని 200 సంవత్సరాల క్రితం నూజివీడు వెలమ జమీందారులు కట్టించారని స్థానికులు చెబుతారు. shivakeshaavalaayaluఈ ఆలయంలో వెలసిన స్వామి శ్రీ చెన్నకేశవ స్వామి. ఇక ఈ ఆలయ ముఖ ద్వారా గాలిగోపురం చాలా అందంగా కనబడుతుంది. అయితే సుమారు వంద అడుగుల ఎత్తుగల ఈ ఆలయ గాలిగోపురం ఈ ఆలయ ప్రాశస్త్యానికి ప్రథాన కారణం గా చెప్పవచ్చు. ఈ గోపురం పైన సున్నముతో చేయబడిన శిల్పాలు, నాలుగువైపులా రామాయణ , భారత, భాగవతాదిపురాణ గాథలే కాకుండా ఆనాటి రాజుల దండయాత్రా విశేష శిల్పాలు, అనేక జానపద,శృంగార భంగిమలు ఎంతో ఆకర్షణీయంగా, రమణీయంగా కనబడుతాయి. shivakeshaavalaayaluఇక ఈ ఆలయ ఆవరణలోనే తూర్పుముఖంగా ఒక శివాలయం ఉన్నది. ఈవిధంగా ఒకే క్షేత్ర ఆవరణలో శివకేశవాలయాలు ఉండుట సామరస్య భావానికి ప్రతీక. భక్త జనహృదయాలలో సమ భావాన్ని పెంపొందింపజేయుచు సర్వజనాదరణీయమై పూజలనందుకొనుచున్నది. shivakeshaavalaayaluశ్రీ చెన్నకేశవస్వామి వెలసిన ఈ ఆలయంలో నిత్యపూజలతో పాటు పండుగలలో ప్రత్యేక పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ సమయంలో ఈ ఆలయానికి భక్తుల రద్దీ అనేది అధికంగా ఉంటుంది.shivakeshaavalaayalu