Okka ratrilo nirminchina a temples ekkada unnayi

0
4594

మన దేశంలో అనేక రకాల దేవాలయాలు ఉన్నవి. గ్రామం, పట్టణం అని తేడా అనేది లేకుండా ప్రతి కొన్ని మీటర్ల దూరంలో దేవాలయం అనేది తప్పకుండ ఉంటుంది. అయితే ఒక ఆలయాన్ని నిర్మించాలంటే చాలా మంది చాలా రోజుల పాటు శ్రమించాల్సి ఉంటుంది. కానీ దేశంలో అతి పురాతన దేవాలయంలో కొన్ని దేవాలయాలను ఒక్క రాత్రిలోనే నిర్మించారట. మరి ఆ ఆలయాలు ఎక్కడ ఉన్నాయనేది మనం ఇప్పుడు తెలుసుకుందాంtemples

గోవిందదేవ్ జై మందిరం:templesఉత్తరప్రదేశ్ లోని బృందావనంలో కృష్ణుడు కొలువుండే గోవిందదేవ్ జై మందిరాన్ని ఒక్క రాత్రిలోనే నిర్మించారు. ఈ ఆలయం శ్రీకృష్ణ లీలల గురించి తెలియజేస్తుంది. అయితే దేవతలు,రాక్షసులు కలిసి ఈ ఆలయాన్ని నిర్మించినట్టు పురాణాలు చెబుతున్నాయి. ఇది దగ్గరగా చూస్తే అసంపూర్తి నిర్మాణంగా కనిపిస్తుంది.ఎందుకంటే ఆలయ నిర్మాణం జరుగుతుండగా ఏదో అలికిడి రావడంతో తమ ఉనికి బయటపడుతుందని దేవతలు దీనిని అర్ధాంతరంగా వదిలి వెళ్లారనే కధలు ప్రచారంలో ఉంది.

హతియాదేవల్ ఆలయం:templesఉత్తరాఖండ్ లో హతియాదేవల్ ఆలయంలో శివలింగం దక్షిణాభిముఖంగా వుంటుంది.

ఈ శివాలయాన్ని కూడా ఒక్క వ్యక్తి ఒక్క రాత్రిలోనే నిర్మించాడు అని చెప్పుతారు.

భోజేశ్వర్ మందిరం:templesమధ్యప్రదేశ్ లోని భోజేశ్వర్ మందిరాన్ని ద్వాపరయుగంలో పాండవులు నిర్మించారట. దీనికి వారి తల్లి కుంతీ కూడా సహాయ పడిందని పురాణాల ద్వారా తెలుస్తుంది.

కాకన్ మఠ్ ఆలయం: templesమధ్యప్రదేశ్ లోని మోరేనా ప్రాంతంలో కాకన్ మఠ్ ఆలయాన్ని కూడా శివుని భక్తులైన రాక్షసుల ఆధ్వర్యంలో నిర్మాణం జరిగిందట. ఒక్క రాత్రిలో జరిగిన ఈ ఆలయ నిర్మాణంలో ఎలాంటి సున్నం గానీ,సిమెంటు గానీ వాడటం జరుగలేదు.

బైద్యనాథ్ ఆలయం:templesజ్యోతిర్లింగాలలో ఒక్కటైన బైద్యనాథ్ ఆలయం కూడా ఒక్క రాత్రిలోనే నిర్మాణం జరిగిందని పురాణాలూ చెప్పుతున్నాయి.

ఈవిధంగా ఒక్క రాత్రిలోనే ఏర్పడ్డ ఈ ఆలయాలు ప్రాచీన కాలం నుండి భక్తులచే పూజలందుకొంటున్నాయి.