pandavula manumadu prathistinchina shivalingam ekkada undho telusa

0
9249

రామాయణం లో రాముడు రావణుడిని సంహరించి బ్రహ్మహత్యా పాతకం కలిగినందుకు దేశంలో చాలా చోట్ల శివలింగాలని ప్రతిష్టించాడని తెలుసు, అదేవిధంగా మహాభారతంలో పాండవులు కూడా అదేవిధంగా కొన్ని చోట్లా శివలింగాలను ప్రతిష్టించారని పురాణాలూ చెబుతున్నాయి. అయితే ఇక్కడ విశేషం ఏంటి అంటే ఈ ఆలయంలో మాత్రం శివలింగాన్ని పాండవుల మనుమడు శివలింగాన్ని ప్రతిష్టించాడని స్థల పురాణం చెబుతుంది. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.pandavula manumadu
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా, గిద్దలూరు పట్టణానికి 8 కీ.మీ. దూరంలో రాచర్ల మండలం సత్యవోలు గ్రామంలో శ్రీ రామలింగేశ్వరాలయం ఉంది. ఇది చాలా పురాతన ఆలయం. ఈ ఆలయంలో పాండవుల మనుమడు జనమేజయుడు శివలింగాన్ని ప్రతిష్టించాడు. ఆ తరువాత కాలంలో చాళుక్యుల రాజులచే ఆలయ నిర్మాణం జరిగింది. 6 వ శతాబ్దంలో బాదామి చాళుక్యులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఈ ఆలయం ప్రాచీనతో బాటు విశిష్టత చాటుకుంటూ ఉన్న గొప్ప ప్రసిద్ధ దేవాలయంగా నిలిచింది.pandavula manumadu

ఈ దేవాలయం చాలా ఎత్తుగా ఉంటుంది. ఈ ఆలయ వాస్తు శిల్పకళ మహానంది ఆలయాన్ని పోలి ఉంటుంది. అయితే మహానంది ఆలయాన్ని కూడా చాళుక్యులు నిర్మించారు. ఇక్కడ చాళుక్యులచే నిర్మించబడిన భీమలింగేశ్వర, రామలింగేశ్వర ఆలయాలు చాలా ప్రసిద్ధి చెందినవి. వీటిని జాతీయ వారసత్వ సంపదగా భారత ప్రభుత్వం ప్రకటించింది.pandavula manumadu

ఈ ఆలయంలోని గర్భగుడి గోడలకు ఉణ్హన గుళ్ళలో ఈశ్వరుని విగ్రహం, లింగోద్బవమూర్తి, దుర్గాదేవి ప్రతిమలు ఉన్నాయి. ఇక గర్భగుడి మధ్యలో రామలింగేశ్వర రూపమైన శివలింగం ఉంది. ఇక్కడ శిఖరం పైన ఉన్న కలశం భక్తులను కనువిందు చేస్తుంది. ఇంకా ఈ ఆలయంలో నటరాజ విగ్రహం కూడా ఉంది.pandavula manumadu

ఈ ఆలయ ప్రాంగణంలోనే మొత్తం ఆరు దేవాలయాలున్నాయి. వాటిలో అన్నిటికంటే భీమలింగేశ్వరస్వామి ఆలయం పెద్దదిగా చెబుతారు. ఇలా ఇక్కడ శివుడు రామలింగేశ్వర స్వామిగా వెలసిన ఈ ఆలయానికి శివరాత్రి సమయంలో భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.pandavula manumadu