Paying Homage To Maulana Abul Kalam Azad Who Established Education System In India

భారతదేశానికి స్వాత్యంత్రం తీసుకురావడానికి ఉద్యమించి కొన్ని సంవత్సరాలు జైలు జీవితాన్ని గడిపి, హిందూ, ముస్లిం ఐక్యత కోసం పోరాడి, దేశానికి స్వాత్యంత్రం వచ్చిన తరువాత భారతదేశానికి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా సేవలందించిన స్వాత్యంత్ర సమరయోధుడు మౌలానా అబుల్ కలం ఆజాద్ గారు. మరి ఆయన ఉద్యమం ఎలా సాగింది? నవంబర్ 11 వ తేదీన జాతీయ విద్యాదినోత్సవం మనం ఎందుకు జరుపుకుంటున్నాము? విద్యాశాఖ మంత్రిగా ఆయన చేసిన కృషి ఎలాంటిది అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.1-Kalam-min

మౌలానా అబుల్ కలం ఆజాద్ గారు 1888 నవంబర్ 11 వ తేదీన మక్కాలో జన్మించారు. ఆజాద్ గారి అసలు పేరు గులాం మొహియుద్దీన్. ఆయన తండ్రి ఖైరుద్దీన్ గారు సిపాయిల తిరుబాటు సమయంలో భారతదేశం నుండి మక్కా వచ్చి సిరపడ్డారు. ఖైరుద్దీన్ గారు ఒక బెంగాలీ ముస్లిం. ఇక వీరు మళ్ళీ 1890 లో కలకత్తా వచ్చి స్థిరపడ్డారు. ఆజాద్ గారి విద్యాబ్యాసం బాల్యంలో ఇంట్లోనే సాగింది. ఆయనకి అరబిక్, పర్షియన్, బెంగాలీ, ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ వంటి అనేక భాషల్లో మంచి ప్రావిణ్యం ఉంది. ఆయన అతడి కలం పేరుని ఆజాద్ గా స్వీకరించాడు.2-mahathma and kalam-min

ఇక ఇరాన్, ఇరాక్, టర్కీ, ఈజిప్టు వంటి దేశాలు పర్యటించి భారతదేశానికి వచ్చిన ఆజాద్ గారు బ్రిటిష్ వారికీ వ్యతిరేకంగా పోరాటాన్ని మొదలుపెట్టారు. ఇలా 1912 లో ఆజాద్ గారు విప్లవ పరిధిని పెంచడానికి అల్-హిలాల్ అనే ఉర్దూ పత్రికను ప్రారంభించారు. కానీ బ్రిటిష్ ప్రభుత్వం 1914 లో ఈ పత్రికని నిషేదించగా 1916 లో అల్ – బాలాగ్ అనే పత్రికని ప్రారంభించడంతో దానిని కూడా నిషేధించి ఆయన్ని అరెస్ట్ చేసి 1920 వ సంవత్సరంలో మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత విడుదల చేసారు. ఇలా విడుదలైన వెంటనే ఆయన ఖలీఫా ఉద్యమాన్ని మొదలుపెట్టారు.3-Abul kalam-min

ఇలా సాగుతున్న సమయంలో గాంధీజీ గారు మొదలుపెట్టిన సహాయ నిరాకరణ ఉద్యమానికి మద్దతు తెలిపి 1920 వ సంవత్సరంలో జాతీయ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. 1923 లో ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇక ఉప్పు సత్యాగ్రహం సమయంలో 1930 లో అరెస్ట్ అవ్వగా ఒక సంవత్సరం మీరట్ జైలులో గడిపారు. ఇక స్వాత్యంత్రం రాకముందు నుండి హిందూ ముస్లిం ల మధ్య వస్తున్న విభజనను ఆయన తీవ్రంగా ఖండించారు. అందరిలో ఐక్యత కోసం ఆయన పోరాడారు.4-Nehru and kalam-min

మన దేశానికి స్వాత్యంత్రం వచ్చిన తరువాత, నెహ్రు గారి మంత్రివర్గంలో మొట్ట మొదటి విద్యాశాఖ మంత్రిగా పనిచేసారు. ఇలా ఆయన 1947 నుండి 1958 వరకు విద్యాశాఖామంత్రిగా సేవలను అందించారు. ఇలా విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన 14 ఏళ్ళ లోపు పిల్లలకి ఉచిత విద్య, తప్పనిసరి విద్య కోసం విశేషంగా కృషి చేసారు. ఇంకా దేశంలోనే మొట్టమొదటి ఐ.ఐ.టి. , ఐ.ఐ.ఎస్సి. , స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ వంటివి ఎన్నో ఆయన పదవి కాలంలోనే ఏర్పాటు చేసారు.5-Kalam-min

దేశ భవిష్యత్తు కోసం బలమైన పునాదులు వేసే భావి భారత పౌరులను తీర్చిదిద్దడం కోసం ఆజాద్ గారు దేశంలో ఎన్నో సంస్కరణలను విద్యారంగంలో ప్రవేశపెట్టారు. ఇలా ఆ స్వాత్యంత్ర సమరయోధుడి జన్మదినం సందర్భంగా, ఆజాద్ గారి జ్ఙానపకార్థం గా నవంబర్ 11 న నేడు మనం జాతీయ విద్యాదినోత్సవం గా జరుపుకుంటున్నాము. ఆయనకి 1922 లో అత్యున్నత పౌర పురస్కారం అయినా భారతరత్న లభించింది. భారతదేశంలోని ఎన్నో సంస్థలు ఆయన గౌరవార్థం తమ సంస్థలకి ఆయన పేరుని పెట్టుకున్నాయి. ఇలా విద్యారంగంలో ఎంతో కృషిచేసిన ఆయన ఫిబ్రవరి 22 1958 వ సంవత్సరంలో మరణించారు.6-Kalam-min

స్వాత్యంత్రం కోసం పోరాడిన గొప్ప స్వాత్యంత్ర సమరయోధుడు, హిందూ – ముస్లిం ఐక్యత కోసం పోరాడిన గొప్ప వ్యక్తి, మొట్ట మొదటి విద్యాశాఖ మంత్రిగా ఎంతో కృషి చేసిన మంచి నాయకుడు మౌలానా అబుల్ కలం ఆజాద్ గారు. ఇలా స్వాత్యంత్ర సమరయోధుడిగా, విద్యావేత్తగా ఆయన చేసిన కృషి
ఎవరు ఎప్పటికి మరువలేనిది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR