Rainbow cheppe nijaalu?

0
3577

ప్రకృతిలోని అందమైన వాటిల్లో ఇంద్రధనుస్సు ఒకటి. ఈ హరివిల్లుని చూడడం అందరికీ ఇష్టం. అయితే ఇది కనిపించే తీరు.. పరిస్థితులను బట్టి దాని వెనుక అనేక రహస్యాలు దాగున్నాయని పలు జ్యోతిష గ్రంధాల్లో రాసారు. ఆ సమాచారం ప్రకారం..1 Rainbow Factsఏకకాలంలో ఒకే రకంగా కనిపించే రెండు స్పష్టమైన ఇంద్రధనస్సులు భూమిపైకి వంగి ఉన్నట్లుగా కనిపించినట్లయితే ఆ హరివిల్లు కనిపించిన ప్రాంతంలో బాగా వర్షాలు కురుస్తాయి. ఇంద్రధనుస్సు ఆకాశంలో ఒక ప్రత్యేక ప్రాంతంలో కనిపించినప్పుడు ఆ ఆకాశం కింద ఉండే భూ ప్రాంతానికి చెందిన ఒక మహా నాయకుడు మరణిస్తారని గుర్తించాలి. ఇంద్ర ధనుస్సు కేవలం తెలుపు, ఎరుపు రంగుల్లో కనిపిస్తే ఆయా ప్రాంతంలోని ప్రజలు ఆయుధాల కారణంగా బాధపడతారు.2 Rainbow Facts రెయిన్ బో పసుపు రంగులో కనిపిస్తే అగ్నివల్ల, నీలం రంగులో కనిపిస్తే కరువు వల్ల అక్కడి వారు బాధపడతారు. ఇంద్రధనుస్సు చెట్లపై కనిపిస్తే వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. చీమలపుట్టపై ఇంద్ర ధనుస్సు కనిపిస్తే యుద్ధభయం కలుగుతుంది. ఇంద్రధనుస్సు కనిపించినప్పుడు వర్షం లేకపోతే ఆ తర్వాత వర్షాలు బాగా కురుస్తాయని అర్ధం.వర్షం పడుతున్నప్పుడు ఇంద్రధనుస్సు కనిపించిందంటే వర్షాలు ఆగిపోతాయని గుర్తించాలి.3 Rainbow Facts