Reason Behind Why Lord Ganesha Is Caught As A Thief ??

0
447

హిందువులు వినాయకుడిని ప్రతి పూజలో మొదటగా పూజిస్తారు. వినాయకుడు దర్శనం ఇచ్చే ఎన్నో ప్రసిద్ధ దేవాలయాలు అనేవి ఉన్నాయి. అయితే ఈ ఆలయంలో ఆశ్చర్యం ఏంటంటే, వినాయకుడిని దొంగ అని పిలుస్తారు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? వినాయకుడిని దొంగ అని పిలవడం వెనుక కారణం ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Lord Ganesha

తమిళనాడు రాష్ట్రం, నాగపట్నం జిల్లాకి కొంత దూరంలో ఉన్న తిరుక్కాడియాయూర్ లో శ్రీ అమృత కడేశ్వరస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలో శ్రీ అభిరామి అమ్మవారి సమేత శ్రీ అమృత కడేశ్వరస్వామి కొలువై ఉన్నాడు. ఈ ఆలయంలో అష్టదిక్పాలకులలో ఒకరైన శ్రీ శివభగవానుడు ఇచ్చట అష్టమ స్థానంలో వెలసియున్నాడు. ఇక్కడ బిల్వవృక్షం, పింజలా వృక్షములు ఉన్నాయి.

Lord Ganesha

ఇక ఈ ఆలయ స్థల పురాణానికి వస్తే, పూర్వం దేవతలు, రాక్షసులు అమృతం కొరకు పాలకడలని మదించి అమృతం గ్రహించే సమయంలో గణపతిని పూజించడం మరచినారు. అప్పుడు వినాయకుడు ఆగ్రహించి ఒక బిందెడు అమృతం ప్రస్తుతం ఉన్న ఆలయ గర్భగుడిలో దాచిపెట్టగా ఆ బిందె నిండా ఉన్న అమృతం మహాశివలింగంగా అవతరించిందని పురాణం.

Lord Ganesha

ఈవిధంగా అమృతం నుండి ఉత్భవించిన ఆ స్వామికి అమృత కడేశ్వరస్వామి అనే పేరు వచ్చినది. అయితే అమృతాన్ని దొంగలించినందున ఇక్కడ వినాయకుడిని కళ్ళల్ వినయగర్ అనే పేరు వచ్చినది. కళ్ళల్ అంటే దొంగ అని అర్ధం. అయితే 63 మంది నాయనార్ లలో కుంగిలియానాయనార్ మరియు కారినాయనార్ లు ఈ స్వామిని పూజిస్తూ నివసించిన స్థలం ఇదేనని చెబుతారు.

Lord Ganesha

ఇంకా యమధర్మరాజు బారినుండి మార్కండేయుని రక్షించుటకు శివుడు యముడిని సంహరించడం వలన ఈ స్వామిని కాలసంహారకుడు అని భక్తులు పిలుస్తారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం కాల సంహార ఉత్సవం చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఇలా ఎన్ని విశేషాలు ఉన్న ఈ ఆలయానికి దసరా సమయంలో, కార్తీక మాసంలో భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.