హిమాలయాల్లో ఎత్తైన ఒక చిన్న కొండమీద ఉన్న మెరిసే శివలింగం గురించి ఆశ్చర్యకర నిజాలు

హిందూ పురాణాల ప్రకారం ముక్కోటి దేవతలు హిమాలయాల్లో నివసిస్తుంటారు. హిమాలయాలు ఆసియాలోని భారతదేశం, నేపాల్, పాకిస్థాన్, చైనా మరియు భూటాన్ దేశాలలో విస్తరించి ఉన్నాయి. ఇక ఈ మంచు కొండల్లో ఎన్నో పవిత్ర పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఉన్న మహిమ గల శివలింగానికి దేవతల కాలం నుండి పూజలు జరుగుతున్నాయని పురాణం. మరి ఈ ప్రాంతానికి ఉన్న విశేషం ఏంటి? ఇక్కడ ఉన్న శివలింగానికి ఉన్న ప్రత్యేకత ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

sivalingamఉత్తరాంచల్ రాష్ట్రం లో కొన్ని పవిత్ర క్షేత్రాలు ఉన్నాయి. అందుకే దీనిని దేవభూమి అని పిలుస్తారు. ఇక్కడ ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రాలలో ఒకటి యమునోత్రి. అయితే యమునోత్రికి వెళ్లే దారిలో ఒక పెద్ద వంతెన ఉండగా దానిని యమునా బ్రిడ్జ్ అని అంటారు. అక్కడి నుండి కొన్ని కిలోమీటర్లు ముందుకు వెళితే యమునానది 50 మీటర్ల వెడల్పుతో మనకు దర్శనమిస్తుంది. అక్కడినుండి కొంతదూరం ముందుకు వెళ్లగా సుమారు 1100 మీటర్ల ఎత్తులో ఒక చిన్న కొండ ఉంటుంది. ఆ కొండమీద లఖా మండల్ అనే ఒక చిన్న గ్రామంలో అద్భుత శివాలయం ఉంది.

sivalingamలఖా అంటే చాలా, మండల్ అంటే ఆలయాలు అని అర్ధం. అంటే అనేక ఆలయాలు ఉన్న ప్రదేశం అని అర్ధం. ఈ ప్రదేశం శివుడికి అంకితం చేసిన ప్రదేశం. ఈ ఆలయంలో ఉన్న విశేషం ఏంటంటే, ఇక్కడ శివాలయంలో ఉన్న శివలింగం గచ్చకాయ రంగులో భక్తులకి దర్శనం ఇస్తుంది. అయితే ఈ శివలింగాన్ని నీటితో అభిషేకం చేస్తే కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది. ఇది గ్రాఫైట్ శివలింగం అని కొందరు చెబుతుండగా, పూర్వం శివుడు ఇక్కడ స్వయంభువుగా లింగ రూపంలో వెలిశాడని పురాణం.

sivalingamఇక్కడ ఉన్న మరొక విశేషం ఏంటంటే, ఈ శివాలయంలో ఎన్నో శివలింగాన్ని చిన్నవి , పెద్దవి ప్రతిష్టించబడి ఉన్నవి. అయితే మహాభారతంలో దుర్యోధనుడు నిర్మించి ఇచ్చిన లక్క ఇల్లు సంబంధించిన శిథిలాలు ఇక్కడ ఉన్నవి. ఆలయం పక్కనే ఒక చిన్న గుహ ఉండగా, పాండవులు లక్క ఇంటి నుండి తప్పించుకొని వచ్చి ఈ గుహలో ఉన్న మార్గం ద్వారానే వేరే సురక్షిత ప్రాంతానికి చేరుకున్నారని ఇక్కడి స్థల పురాణం చెబుతుంది. అయితే ఇక్కడే పాండవులకు విడి విడిగా ఆలయాలు అనేవి ఉన్నాయి.

sivalingamఇక్కడ ఉన్న నీటితో శివలింగానికి అభిషేకం చేసినప్పుడు మెరుస్తూ ఉండగా మన మొహం శివలింగంలో చూసుకోవచ్చు. ఇంకా ఈ పవిత్ర పుణ్యక్షేత్రానికి వెళ్లి ఈ శివలింగాన్ని దర్శిస్తే ఎంతో పుణ్యంగా భక్తులు భావిస్తారు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR