Shri Maha Vishnuvu vahanam aaina garuthmanthudi ekaika aalayam

0
4833

హిందూ పురాణాల్లో శ్రీ మహావిష్ణువు వాహనంగా గరుత్మంతుడు ప్రసిద్ధి. శ్రీ మహావిష్ణువు ఎక్కడికి వెళ్లాలన్నా గరుత్మంతుడు సిద్ధంగా ఉంటాడు. విష్ణుమూర్తి గరుడారూఢుడై వెళ్లి ఆపన్నులను రక్షిస్తూ ఉంటారని పురాణాల గాథ. మరి ఎక్కడలేని విధంగా ఇక్కడ గరుత్మంతుడికి ప్రత్యేకంగా ఆలయం అనేది ఉంది. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయంలోని విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. maha vishnuvuఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని, పచ్చిమగోదావరి జిల్లా, జంగారెడ్డిగూడెం మండలం చక్రదేవరపల్లి గ్రామంలో ఈ ప్రసిద్ధ ఆలయం కలదు. ఎర్రకాలువ జలాశయం ఒడ్డున పచ్చనిపొలాల నడుమ గరుత్మంతుడి ఆలయం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. maha vishnuvuఅయితే పూర్వం, ఒకప్పుడు ప్రస్తుతం ఎర్రకాలువ జలాశయం ఉన్న ప్రాంతమంతా అటవీప్రాంతాలుగా ఉండేవి. ఈ ప్రాంతంలో భూపతిరాజు కృష్ణంరాజుకు చెందిన పొలాలు ఉండేవి. ఒకనాడు పొలంలో వ్యవసాయ కూలీలు దుక్కి చేస్తున్న సమయంలో నాగలికి ఒక విగ్రహం తగిలింది. ఈ విగ్రహం గరుత్మంతుడి విగ్రహం కావడంతో స్థానికుల సూచన మేరకు భూపతిరాజు కృష్ణంరాజు ఎంతో భక్తిశ్రద్ధలతో తన పొలంలోనే విగ్రహాన్ని ఒక చెట్టుకింద ప్రతిష్టించారు. maha vishnuvuఈ విగ్రహం బయల్పడిన సమయానికి ఎర్రకాలువ జలాశయం డ్యామ్‌ నిర్మాణం కాలేదు. కొన్నాళ్లు చెట్టుకింద ఉన్న గరుత్మంతుడిని చక్రదేవరపల్లి ఊరికి రోడ్డు పక్కకు తీసుకొచ్చి గుడినిర్మించి ఆ ఆలయంలో విగ్రహాన్ని ప్రతిష్టించారు. 1994లో భూపతిరాజు కృష్ణంరాజు కుమార్తె, అల్లుడు లక్ష్మి, వెంకటరాజులు ఆలయాన్ని నిర్మించారు. 2003లో ఆలయానికి మండపాన్ని ఏర్పాటు చేశారు. స్వామిని పూజించి, పొలంలోకి అడుగుపెట్టిన వారికి సర్పభయం ఉండకపోవడంతోపాటు తలపెట్టిన పనులన్నీ శీఘ్రంగా జరుగుతుండంతో ఆలయానికి వచ్చే భక్తులు పెరిగారు. maha vishnuvuఈ ప్రాంత రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించే ముందు గరుత్మంతుడికి మొక్కుకుని పనులు ప్రారంభిస్తుంటారు. ఒకప్పుడు పశువులకు జబ్బులు చేస్తే స్వామివారికి పూజలు చేయిస్తామని మొక్కుకునేవారని ఈ ప్రాంతౖ రెతులు చెబుతున్నారు. కార్తీకమాసంలో ఈ ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. స్వామివారికి అభిషేకాలు నిర్వహిస్తే అనుకున్న కోర్కెలు నెరవేరుతాయని భక్తులు విశ్వాసం.maha vishnuvuఇలా ఎక్కడాలేని విధంగా శ్రీ మహావిష్ణువు వాహనం అయినా గరుత్మంతుడికి నిర్మించిన ఈ ఆలయానికి చుట్టూ పక్కల గ్రామాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.6 sri mahavishnuvu vahanam ayina garathmanthudi ekaika alayam