హనుమంతుడి వివాహం గురించి కొన్ని ఆశక్తికర విషయాలు

ఆంజనేయుడిని బజరంగబలి, మారుతి, అంజనిసుతుడు, హనుమంతుడు అని అనేక పేర్లతో కొలుస్తుంటారు. అయితే  అంజనాదేవి కుమారుడు కాబట్టి ఆంజనేయుడు అనీ, వాయుదేవుని ద్వారా పుట్టినవాడు కాబట్టి పవనకుమారుడు అనీ పిలుచుకుంటారు. ఇంకా అంజనాదేవి భర్త పేరు కేసరి కాబట్టి, కేసరీనందనుడు అని పిలుస్తారు.  మరి రామబంటు అయినా ఆంజనేయుడు నిజంగా బ్రహ్మచారా? హనుమంతుడి వివాహం గురించి కొన్ని విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

హనుమంతుడి గురువు సూర్యుడు:

Surya Bhagavan

హనుమంతుడు బాల్యంలో ఉన్నప్పుడు హనుమంతుడి తల్లి గారు విద్యాబ్యాసం నేర్చుకోవడానికి సూర్యిడిని మించిన గురువు లేడు ఎందుకంటే సూర్య భగవానుడు మనకు వచ్చే చీకటి పోగొడతాడని  హనుమంతుడికి చెప్పుతుంది. అప్పటి నుండి హనుమంతుడు సూర్యభగవానుడిని నుండి అనేక వేదాలు నేర్చుకుంటూ ఉంటాడు.

సూర్యభగవానుడి కూతురితో హనుమంతుడి వివాహం:

Surya Devuduహనుమంతుడు తన చదువు పూర్తి అయ్యాక  సూర్యినితో అంటాడు, నాకు విద్య నేర్పించి నన్ను ఇంతటి వాడిని చేసిందనుకు చాలా కృతజ్ఞుడిని అని సంబోదించగా అప్పుడు సూర్య భగవానుడు నాకు గురు దక్షణ కింద నువ్వు నా కుమార్తె అయినా సువర్చలా ను వివాహం చేసుకోవాలని చెప్పుతాడు.

హనుమంతుడి మరియు హనుమంతుడి భార్య:

Hanuman Marriageహనుమంతుడు వేదాలలో నైపుణ్యం సాధించగా నవ వ్యాకరణం చదవడానికి  అర్హుడు కాదు ఎందుకంటే అది కేవలం పెళ్లి అయినా వారు మాత్రమే అభ్యసించాలి. అందుకోసమే సూర్యభగవానుడు సువర్చలా అనే అందమైన కుమార్తెని సృష్టించి హనుమంతుడికి ఇచ్చి వివాహం చేసి ఆయనని గృహస్తుడని చేస్తాడు.

పెళ్లి అయినా హనుమంతుడు బ్రహ్మచారి ఎలా అవుతాడు?

Hanumanహనుమంతుడు తన బ్రహ్మచర్యం గురించి ముందే సూర్యభగవానుడికి చెబుతాడు. అయితే వేదాలలో నైపుణ్యం సాధించడానికి నవ వ్యాకరణం అభ్యసించడం కోసమే నీకు ఈ వివాహం అంతేతప్ప నువ్వు ఎప్పటికి బ్రహ్మచారిగానే ఉంటావు అని సూర్యభగవానుడు హనుమంతుడికి వరాన్ని ప్రసాదిస్తాడు.

సువర్చలాహనుమంతుడి అవతారం:

Suvarchala Hanumanహనుమంతుడు అనేక అవతారాలు ధరించాడు. అందులో సుప్రసిద్ధమైనవి తొమ్మిది. వీటిలో సువర్చలాహనుమంతుడి అవతారం కూడా ఒకటి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మచిలీపట్నం పరాసపేటలో శ్రీసువర్చలాంజనేయస్వామి దేవాలయం ఉంది.

హనుమంతుడి కళ్యాణం:

Hanumanవైశాఖమాస కృష్ణపక్ష దశమి హనుమజ్జయంతి. ఆ రోజున ఆంజనేయుణ్ణి విశేషంగా పూజిస్తారు. అంతేకాకుండా చాలా దేవాలయాల్లో హనుమజ్జయంతి సందర్భంగా శ్రీసువర్చలాంజనేయస్వామి కల్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తున్నారు.

హనుమంతుడి జన్మ రహస్యం:

Anjani Puthruduబ్రహ్మ దేవుని భవనంలో అందమైన అప్సర అంజనాదేవి. ఒక ముని ఆగ్రహానికి గురై ఎవరిని అయితే నువ్వు ప్రేమిస్తావో ఆ మరుక్షణం నువ్వు కోతి రూపంలోకి మారిపోతావని అంజనాదేవిని శపిస్తాడు. అప్పుడు బ్రహ్మ ఆమెకి సహాయపడాలని భావించి భూలోకానికి పంపిస్తాడు. భూలోకానికి వచ్చిన అంజనాదేవి వానర రాజైన కేసరిని కలిసి అతడిని వివాహం చేసుకుంటుంది. అంజనా శివుడి యొక్క భక్తురాలు అయితే శివుడి కోసం గొప్ప తపస్సు చేయగా ఆ పరమశివుడు ఆమెకి కొడుకుల జన్మించి ఆమెను శాపం నుండి విముక్తిని కలిగిస్తాడు. అందుకే హనుమంతుడు శివుడి అవతారంగా కొలుస్తారు.

హనుమంతుడి కొడుకు:

Hanumanthuduకాంబోడియాన్, థాయ్ కథనాల ప్రకారం హనుమంతుడి పుత్రుడిని మచ్చాను అని కూడా పిలుస్తారు. రావణుడి కుమార్తె అయిన మత్స్యకన్య, హనుమంతులకు మచ్చాను జన్మించాడని అంటారు. అయితే హనుమంతుడి చెమట చుక్క నదీజలాల ద్వారా పయనించి రావణుడి కుమార్తె అయిన మత్స్యకన్య  సువన్నమచ్చని చేరిందని ఆ విధంగా హనుమంతుడికి కుమారుడు జన్మించాడని చెబుతున్నారు.

వాల్మీకి రామాయణం:

Ramayanmవాల్మీకి రామాయణం ప్రకారం, రామలక్ష్మణులను అహిరావణుడు పాతాళానికి తీసుకువెళ్ళినప్పుడు హనుమంతుడు వారిని కాపాడేందుకు బయలుదేరతాడు. ఇంతలో సగం వానరం, సగం చేప ఆకారంలోనున్న మకరమనే వాడు పాతాళ ద్వారం వద్ద హనుమంతుడికి సవాల్ విసిరాడు. హనుమంతుడికి కుమారుడిగా తనని తాను పరిచయం చేసుకున్నాడని చెబుతారు.

ఈవిధంగా మన పురాణాలలో హనుమంతుడి వివాహం గురించి, ఆయన జన్మ రహస్యం గురించి వివరించబడింది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR