As SPB Turns 72 Let’s Take A Look At Some Of His Best Songs From The 90’s

Contributed by : Dheeraj Babu P & Kalyan Bharath

మనం రోజూ సరదాకి వినే పాటలు మన జీవితంలో రోజువారీ కాలకృత్యాలలో ఒకటిగా మారిన క్షణం ఎవరికీ తెలియదు. అలాగే.. పాటలు వింటున్నప్పుడు ఇది ఫలానా గాయకుడు పాడాడు అనే విషయాన్ని ఘంటసాల గారితోనే మర్చిపోయారు జనాలు. కొందరు గొంతుకలు కొందరు నటులకు, కథానాయకులకు మాత్రమే సెట్ అవుతాయి అనే ఒక నానుడిని బ్రేక్ చేయడంతోపాటు.. మిమిక్రీ చేస్తూ కూడా పాటలు పాడొచ్చు అని ప్రూవ్ చేసిన ఏకైక గాయకుడు, నటుడు, నిర్మాత, బహుముఖ ప్రజ్ణాశాలి శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం అలియాస్ ఎస్.పి.బి. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, కమల్ హాసన్, రజనీకాంత్ ఇలా ఆయన ఏ హీరోకైనా పాట పాడగలడు. ఆ పాట విన్నప్పుడు మనకి బాలసుబ్రమణ్యం వినిపిస్తే.. తెరపై మాత్రం సదరు కథానాయకుడు మాత్రమే కనిపిస్తాడు. నటులు పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేసినట్లు.. మన ఎస్పీబీ తన గొంతుకతో పర గొంతు ప్రవేశం చేసేవారు. పాటను ప్రేక్షకులు మెచ్చేలా పాడడం వేరు, అదే పాటను శ్రోత అర్ధం చేసుకొనేలా పాడడం వేరు.. ఆ తేడా తెలిసిన అతి తక్కువ గాయకుల్లో మన గాన గంధర్వుడు బాలసుబ్రమణ్యం ఒకరు.

దాదాపు 3 దశాబ్ధాలపాటు తన పాటలతో ప్రేక్షకులను, శ్రోతలను విశేషంగా అలరించిన ఆ చమత్కారి.. ఇప్పుడు “పాడుతా తీయగా” అనే కార్యక్రమం ద్వారా భావితరాలకు స్వచ్చమైన సింగర్స్ ను అందించడమే ధ్యేయంగా పెట్టుకొన్న బాలసుబ్రమణ్యం పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన పాటలను, ఆయన పలికించిన లయలను, ఆ లయల్లో పొందిన సాహిత్యాన్ని, ఆ సాహిత్య సంపద నుండి పెల్లుబికిన భావాలను ఒక్కసారి విందాం, ఆనందిద్దాం, ఆస్వాదిద్దాం. తెలుగు సినిమా వినీలాకాశంలో బాలు గారు పాడిన అద్భుతమైన పాటల్లో నుండి కొన్ని మంచి పాటలు చెప్పమంటే అంతకుమించిన ముర్కత్వం ఇంకోటి ఉండదు. 90’s జనరేషన్లో పుట్టిన నేను బాలు గారి పాటలు వింటూ పెరిగాను, అందుకు కృతజ్ఞతగా ఈ రోజు బాలు గారి జన్మదినం సందర్బంగా, అలనాటి ఆ పాత మధురాలని గుర్తుచేసుకుంటూ…. బాలు గారికి జన్మదిన శుభాకాంక్షలు..!!

1. Jaamu Rathiri – Kshana Kshanam

2. Avura Ammaku Chella – Aapadbandhavudu

3. Naa Cheli Rojave – Roja

4. Andamaina Premarani – Premikudu

5. Nanu Nene Marichina Nee Thodu – Premadesam

6. Naalo Vunna Prema – Premante Idera

7. Ee Manase Se Se – Tholiprema

8. Swapna Venuvedo – Ravoyi Chnadamama

9. Gagananiki Udayam – Tholiprema

10. Teppalilli Poyaka – Bharateeyudu

11. Paruvam Vanaga – Roja

12. Chukkallara Chupullara – Aapadbandhavudu

13. Nee Navvu Cheppindi – Antham

14. Nigama Nigamanthara – Annamayya

15. Kondalalo Nelakonna – Annamaya

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR