Swamivaari vivaha sanniveshanni chupinche moolavirat

0
4093

కార్తికేయ స్వామి వెలసిన ఈ ఆలయంలో విశేషం ఏంటంటే, ప్రతి ఆలయంలో నిలబడి దర్శనం ఇచ్చే ఆ స్వామివారు ఈ ఆలయంలో మాత్రం కూర్చొని దర్శనం ఇస్తుంటాడు. ఇంకా ఆలయంలోని మూలవిరాట్టు స్వామి వారి వివాహ సన్నివేశాన్ని చూపిస్తుంది. మరి ఇంతటి విశేషం ఉన్న ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయంలోని విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. swamiతమిళనాడు రాష్ట్రంలోని, మదురై నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఈ కార్తికేయస్వామి క్షేత్రం ఉంది. ఇంద్రుని కుమార్తె అయినా దేవసేనతో స్వామికి వివాహమైన స్థలంగా ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. ప్రాచీన హిందూ దేవాలయాల్లో ఎక్కడ లేని విధంగా ఈ ఆలయంలో శివుడు, శ్రీ మహావిష్ణవు విగ్రహాలు ఎదురెదురుగా ఉన్నాయి. ఇక్కడ ఆలయం గోడలపైన దేవతామూర్తుల చిత్రాలు చాల అందంగా ఉంటాయి. ఇంకా ఇక్కడి ప్రాంతంలోనే సూర్య వెడ్మముడనే రాక్షసుడిని సంహరించినట్లుగా చెబుతారు. swamiపాండ్యుల కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్టు శాసనాలు తెలుపుతున్నాయి. అయితే అంతకు పూర్వమే ఆలయం వున్నట్టు ఆధారాలున్నాయి. నాయక రాజుల కాలంలో నిలువెత్తు విగ్రహాలను చెక్కారు. ఈ ఆలయంలో దేవలోక అధిపతి ఇంద్రుడు తన కుమార్తె దేవయానిని కార్తికేయుడికి ఇచ్చి వివాహనం జరిపిన ప్రదేశంగా తిరుప్పరన్‌కుండ్రం ఖ్యాతిచెందింది. దేవయాని సమేతుడైనస్వామి చుట్టూ త్రిలోక సంచారి నారద మునీంద్రుడు, ఇంద్రుడు, బ్రహ్మ, సరస్వతి మాత, సూర్యచంద్రులు, గంధర్వులు వున్న చిత్రం మనకి కనిపిస్తుంది.swamiఇక్కడి ఆలయంలో విశేషం ఏంటంటే, సాధారణంగా ఆలయాల్లో అభిషేకం మూలవిరాట్టుకు చేస్తారు. అయితే ఇందుకు భిన్నంగా స్వామి వారి ఆయుధమైన వేలాయుధానికి ఇక్కడ అభిషేకం చేయడం గమనార్హం. సూరపద్ముడిని సంహరించిన అనంతరం స్వామి తన వేలాయుధంతో ఇక్కడకి వచ్చినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. తమిళమాసమైన పెరటాసి నెలలో వేలాయుధాన్ని పక్కన కొండపై వున్న కాశీవిశ్వనాధుని ఆలయానికి తీసుకువెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.swamiఆలయంలోని మూలవిరాట్టు విగ్రహం విషయానికి వస్తే, ఇంద్రుడు కలశం నుండి నీటిని పోస్తూ ఉండగా స్వామి కుడి చేతిని చాచి ఉంటాడు. ఎడమవైపున దేవసేన సిగ్గుతో నిలబడి ఉంటుంది. స్వామికి ముందున్న ఎడమచేతిలో వజ్రాన్ని ధరించి, కుడి చేతితో నీటిని స్వామి చేతిలో పోస్తుండగా, బ్రహ్మహోమం చేస్తూ ఉండే భంగిమ ఎంతో అందంగా మలచబడింది. swamiఅధ్భూతమైన శిల్పకళతో ఆకట్టుకునే ఈ ఆలయంలో వివాహాలు ఎక్కువగా జరుగుతుంటాయి. చిరకాలంగా వివాహం కుదరని యవతి, యువకులు ఇకెహ్ట స్వామిని దర్శించి మ్రొక్కుకొని వివాహం కుదిరిన తరువాత స్వామి సన్నిధిలో మ్రొక్కుబడిగా వివాహం చేసుకుంటారు. 6 swamivari vivaha sanniveshanni chupinche mulavira