సంవత్సరంలో రెండు రోజులు సూర్యపీఠం పైన జరిగే అద్భుతం ఏంటో తెలుసా ?

మన దేశంలో సూర్యదేవుని ఆలయాలు చాలానే ఉన్నాయి. సూర్యభగవానుడి ఆరాధించే అన్ని ఆలయాల్లో ఈ ఆలయం చాలా ప్రత్యేకం. ఇక్కడ సంవత్సరంలో రెండు రోజులు సూర్యపీఠం పైన జరిగే అద్భుతాన్ని చూడటానికి భక్తులు దేశం నలుమూలల నుండి వస్తారు. ఈ ఆలయాన్ని గజినీ, ఖ్జిల్జీ వంటి వారు నాశనం చేయాలనీ చూసిన ఇప్పటికి అలానే ఉంది. మరి ఎన్నో అద్భుతాలకు నిలయమైన ఈ సూర్యదేవాలయం ఎక్కడ ఉంది? సంవత్సరంలో రెండు రోజులు ఇక్కడ జరిగే ఆ అద్భుతం ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Rays Of Sun Falls

గుజరాత్ రాష్ట్రం, మోహసానా జిల్లాలో మోఢేరా అనే ప్రాంతంలో అతి పురాతన సూర్యదేవాలయాం ఉంది. ఈ ఆలయం పుష్పవతి నది ఒడ్డున ఉంది. ఈఆలయాన్ని క్రీస్తుపూర్వం 1022 లో చాళుక్య వంశానికి చెందిన మొదటి భీమ్ దేవ్ సోలంకి నిర్మించినట్లుగా తెలియుచున్నది.

Rays Of Sun Falls

ఇక పురాణానికి వస్తే, శ్రీ రాముడు రావణుడిని సంహరించిన తరువాత బ్రహ్మహత్య పాపం తొలగించుకొనుటకు వశిష్ట మహర్షిని అడుగగా, వశిష్ట మహర్షి ధర్మారణ్య వెళ్ళమని సలహా ఇచ్చాడు. అప్పటి ధర్మారణ్య ప్రాంతమే ఇప్పుడు ఇక్కడి మోఢేరా అనే పేరుతో పిలుస్తున్నారు.

Rays Of Sun Falls

ఇక ఆలయ విషయానికి వస్తే, ఈ ఆలయంలో గర్భగుడిలో ఉన్న పీఠంపై విగ్రహం అనేది ఉండదు. ఆ పీఠంపై పూర్వం సూర్యదేవుడు వచ్చి అక్కడ కూర్చుని వెళ్లాడని ఒక నమ్మకం. ఇక్కడ విశేషం ఏంటంటే, మర్చి 21 వ తేదీ కానీ సెప్టెంబర్ 23 వ తేదీన కానీ ఈ ఆలయానికి సూర్యోదయం కాకముందు చేరుకుంటే ఆ రెండు రోజుల్లో సూర్యుడు భూమధ్యరేఖని దాటడం జరుగుతుందని ఖగోళ శాస్త్రవేత్తలు నిర్దారణ చేసారు. ఆ రోజుల్లో పగలు, రాత్రి సమానంగా ఉంటాయి. అయితే ఈ రెండు రోజుల్లో కూడా ఈ సూర్యదేవుని ఆలయంలో గర్భగుడిలో ఉదయం సూర్యుడి తొలి కిరణాలూ సూర్యపీఠాన్ని తాకడం మనం కళ్లారా చూడవచ్చు.

Rays Of Sun Falls

ఈ ఆలయాన్ని అంత కూడా ఎర్రని ఇసుక రాతితో నిర్మించారు. ఈ ఆలయం అంతకుడా అడుగడునా శిల్పాలతో నిండి ఉంటుంది. ఇక్కడ సూర్యకుండ్ అనే ఒక పుష్కరణి ఉంటుంది. ఈ పుష్కరణిలో 108 మెట్లు ఎంతో అద్భుతంగా నిర్మించారు. చాళుక్యులు సూర్యవంశీకులు అవడంతో వారి కులదైవం అయినా సూర్యభగవానుడి కోసం ఈ ఆలయాన్ని ఎంతో అద్భుతంగా కట్టించారు. ఈ ఆలయ నిర్మాణంలో సున్నం అనేది అసలు ఉపయోగించకుండా ఇరానీ శిల్ప కళ శైలిలో నిర్మించడం విశేషం. ఇక్కడ సూర్యదేవునితో పాటు అనేక దేవీదేవతల విగ్రహాలు, రామాయణ మహాభారతంలోని కొన్ని దృశ్యాలను శిల్పాలుగా మలిచారు.

Rays Of Sun Falls

ఇలా గర్భగుడిలో విగ్రహం లేని ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం రెండు రోజులు తొలి సూర్యకిరణాలు గర్భగుడిలోని సూర్యపీఠాన్ని తాకడం చూడటానికి భక్తులు ఆ సమయాల్లో అధిక సంఖ్యలో వచ్చి ఆ అద్భుతాన్ని చూసి తరిస్తారు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR