కాళీమాత అమ్మవారు తెనాలి రామకృషునికి ఎందుకు ప్రత్యక్షమైంది?

హిందువుల అత్యంత శక్తివంతమైన దేవతగా కాళికామాతను కొలుస్తారు. కాల అంటే నలుపు, కాలం, మరణం, శివుడు అని చెబుతారు. రక్తబీజు అనే రాక్షస సంహారం కోసం కాళీమాత పాదాల కింద శివుడు మనకు దర్శనం ఇస్తాడని పురాణాలూ చెబుతున్నాయి. ఇదిలా ఉంటె ఇక్కడ వెలసిన కాళీమాత అమ్మవారు వికటకవి అయినా తెనాలి రామకృషునికి ఎందుకు ప్రత్యక్షమైంది? ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఆ మాత దారిద్ర్యం గురించి ఏమని చెప్పిందనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Kali Mathaఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, గుంటూరు జిల్లా, తెనాలి పట్టణంలో కృష్ణానది తీరాన శ్రీ కాళీమాత ఆలయం ఉంది. ఇది చాలా ప్రాచీన ఆలయంగా చెబుతారు. ఈ ఆలయం విజయనగర సామ్రాజ్యాధీశుడైన శ్రీ కృష్ణదేవరాయల కాలం నాటిదిగా చరిత్ర తెలియచేస్తుంది.

Tenali Rama Krishnaఇక ఈ ఆలయ పురాణానికి వస్తే, విజయనగర రాజ్య ఆస్తానంలో అష్టదిగ్గజాలని పేరు పొందిన కవుల్లో ఒకరు తెనాలి రామకృష్ణ కవి ఈ ప్రాంతంలోనే జన్మించాడు. అయన చిన్నతనం నుండే కవిత తత్వాన్ని చెబుతుండేవారు. అయితే తెనాలి రామకృష్ణ కవిలో పాండిత్యాన్ని, ప్రతిభను గుర్తించిన ఓ సాధువు అతన్ని అడవిలోని కాళీమాత ఆలయానికి తీసుకెళ్లి కాళీమాత మంత్రాన్ని ఉపదేశించాడు.

Tenali RamaKrishnaఅప్పుడు రామకృష్ణ కవి ధ్యానముద్రలో కాళీమాతని నిత్యం జపిస్తూ ఉండగా నిశ్చలమైన భక్తితో తనని కొలుస్తున్న రామకృష్ణుని భక్తికి మెచ్చి కాళీమాత అతనికి ప్రత్యక్షమైంది. అతనికి రెండు పాత్రల్లో ఉన్న పాలు, పెరుగులని చూపిస్తూ ఏదో ఒక పాత్రని తీసుకొని పాలని కానీ, పెరుగు కానీ సేవించమంది. పాలు సేవిస్తే పాండిత్యం, పెరుగును సేవిస్తే దారిద్య్రం విముక్తి లభిస్తాయని చెప్పింది.

Tenali RamaKrishnaఆ సమయంలో రామకృష్ణుడు కాళీమాత మాటను పక్కనపెట్టి రెండు పాత్రల్లోని పాలు, పెరుగులను కలిపి సేవించాడట. దాంతో కాళీమాతకి కోపం వచ్చి ఎందుకిలా చేసావని గట్టిగ అడుగగా, అప్పుడు రామకృష్ణుడు తల్లి, దారిద్య్రం తీరని పాండిత్యం ఏవిధంగా ఉపయోగపడుతుంది అని అనడంతో అందుకు మాత సంతోషించి రామకృష్ణుని ఆశీర్వదించి వెళ్లిందని స్థల పురాణం.

Tenali RamaKrishnaఇలా ఇక్కడ వెలసిన కాళీమాత ఆలయంలో ప్రతి సంవత్సరం నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఆ సమయంలో మాతని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR