భీముడికి వెయ్యి ఏనుగుల బలం ఎలా వచ్చింది

కుంతీదేవికి వాయుదేవుని వరప్రసాదంగా భీముడు జన్మించాడు. పంచపాండవులలో రెండవ వాడు భీముడు. మహాభారతంలో శ్రీకృష్ణుడి తరువాత ముఖ్యుడు భీముడు. మహాభారతంలోని కొన్ని సంఘటనల ఆధారంగా భీముడు బలశాలి మాత్రమే కాదు మంచి మనసు ఉన్న వాడు కూడా. మరి భీముడికి వెయ్యి ఏనుగుల బలం ఎలా వచ్చిందనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Bheemaకాబోయే రాజు దుర్యోధనుడే అవుతాడని దృతరాష్ట్రుడు ఆనందంలో ఉన్న సమయంలో కుంతీదేవి పంచ పాండవులతో హస్తినాపుర రాజ్యానికి రాగ వారిని చూసిన ఆనందంలో రాజ్యంలోని ప్రజలు ఆనందంతో ఘన స్వాగతం పలుకగా అది చూసిన దుర్యోధనుడికి పాండవుల పైన ఈర్ష్య కలిగింది. పాండవులు సింహాసనం అధిష్టించడానికి ఎప్పటికైనా తనకి అడ్డుగా ఉంటారని భావించాడు. అయితే భీష్ముడికి భీముడు అంటే మొదటి నుండి కూడా ఎంతో ఇష్టం. ఆ ఇష్టాన్ని చూసి దుర్యోధనుడు ఇంకా తట్టుకోలేకపోయాడు. మల్ల యుద్ధంలో తనకి ధీటుగా భీముడు ఉండేవాడు. అలంటి సమయంలో దుర్యోధనుడు తన మామ అయినా శకుని సహాయంతో భీముడిని ముందుగా అంతం చేసి తనకి అడ్డు తొలగించాలని భావించాడు.

భీముడు భోజన ప్రియుడు కనుక ఆహారంలో విషం కలిపి ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా ఆ విష ఆహారాన్ని భీముడికి ఇవ్వగా ఆ ఆహారం తిని భీముడు మూర్చపోతాడు. ఆలా మూర్ఛపోయిన భీముడిని కట్టివేసి నదిలో పడివేస్తారు. అయితే విషసర్పాలు ఎక్కువగా ఉన్న ఆ నదిలో భీముడు పడిపోగానే భీముడిని విషసర్పాలు అన్ని కాటువేస్తాయి. భీముడు విష ఆహారం తినడం కారణంగా ఒంటి నిండా విషం ఉండటం, విష సర్పాల నుండి వచ్చిన విషం భీముడికి వీరుడుగా మారి ప్రాణాలతో లేస్తాడు. ఇలా ప్రాణాలతో బయటపడ్డ భీముడు విష సర్పాలను చంపి ఈదుకుంటూ వెళుతుండగా ఒక స్వరంగంలోకి పడిపోతాడు. అది నాగలోకం.

Bheemaఇలా భీముడు నాగలోకానికి వెళ్లగా నాగలకానికి అధిపతి అయినా వాసుకి భీముడిని చూసి నీ పైన ఎవరో విష ప్రయోగం చేసారు. విషానికి విషమే విరుగుడు అన్నట్లుగా విష సర్పాల వలన నీవు ప్రాణాలతో బయటపడ్డావు నీవు ఎవరు అని ప్రశ్నించగా, అప్పుడు భీముడు నేను పాండురాజు, కుంతీదేవిలా కుమారుడును భీముడను అని చెబుతాడు. కుంతీదేవి కి నాకు తీర్చలేని రుణం ఉంది, నీవు నాకు మనువడివి అవుతావు, ఈ ద్రవాన్ని తాగు ఇది బ్రహ్మలోకంలో అమృతం ఎలాగో ఈ నాగలోకం లో ఇది అమృతం అని ఆ ద్రవాన్ని భీముడికి ఇచ్చి ఇది తాగితే నీకు వెయ్యి ఏనుగుల బలం వస్తుందని చెబుతుంది. ఆలా భీముడు ఆ ద్రవాన్ని తాగి వెయ్యి ఏనుగుల బలాన్ని పొందుతాడు.

Bheemaఇది ఇలా ఉంటె, ఒక రోజు కుంతీదేవి భీముడు పసి బాలుడిగా ఉన్నప్పుడు ఆయన్ని ఎత్తుకొని వనదేవతని దర్శించడానికి వెళుతుండగా మార్గ మధ్యలో ఒక పులి రావడం చూసి బయపడిన కుంతీదేవి చేతి నుండి భీముడు ఒక కొండ రాయిపైన పడగ పసిబాలుడు అయినా భీముడికి ఎం అయిందో అని చూడటానికి వెళ్లగా భీముడు పడిన రాయి ముక్కలు ముక్కలుగా అయింది. ఇంకా మహాభారత యుద్ధంలో మొత్తం 11 అక్షౌహిణుల సైన్యం ఉండగా అందులో 6 అక్షౌహిణుల సైన్యాన్ని ఒక్క భీముడే సంహరించాడట. భీముడు ముష్టి యుద్ధం చేసి ఎంతో బలవంతులుగా చెప్పుకునే రాక్షసులను మట్టుబెట్టాడు. బకాసురుడు, జరాసంధుడు, కీచకుడు, హిడింబాసురుడు వంటి రాక్షసుల వదనే అందుకు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR