చనిపోయినవారిని హిందువులు ఎందుకు దహనం చేస్తారో తెలుసా ?

భారతదేశంలో జన్మించిన ఒక ఆధ్యాత్మిక సాంప్రదాయం హిందూమతం. దీనినే సనాతన ధర్మం అని అంటారు. ఇక హిందూమతంలో ఎన్నో ఆచారాలు సంప్రదాయాలు అనేవి ఉన్నాయి. అయితే హిందువులు చనిపోయినవారికి దహన సంస్కారాలు అనేవి చేస్తుంటారు. మరి చనిపోయినవారిని హిందువులు ఎందుకు దహనం చేస్తారనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Hindu Mythologyప్రపంచంలో ఉన్న ప్రజలు అందరు కూడా వారికీ ఉన్న సంప్రదాయాలు ఆచారాల ప్రకారం నడుచుకుంటారు. హిందూమతంలో చనిపోయినవారిని దహనం చేయడానికి కొన్ని కారణాలు అనేవి ఉన్నాయి. ఇక విషయంలోకి వెళితే బ్రతికి ఉన్నప్పుడు మనిషి పాపాలు చేస్తుంటాడు. అయితే చనిపోయిన వ్యక్తిని అగ్నిలో వేసి దహనం చేయడం వలన ఆ వ్యక్తి వచ్చే జన్మలో అయినా పాపాలు చేయకుండా పరిశుద్ధుడై జీవిస్తాడనేది ఒక నమ్మకం. అందుకే హిందూమతంలో చనిపోయినవారిని దహనం చేస్తారు.

Hindu Mythologyఇక చనిపోయినవారికి దహనం అనేది నీటి ప్రవాహం అంటే చెరువులు, నదులు ఉన్న చోట చేస్తుంటారు. దీనివలన ఆత్మ అనేది పరిశుద్ధం అవుతుందనేది ఒక నమ్మకం. అంతేకాకుండా చనిపోయిన వ్యక్తి ఆత్మ అలానే ఉండిపోతుంది. ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్లాలంటే దహనం చేస్తారు. ఇలా చేయడం వలనే ఆత్మ అనేది వేరే శరీరాన్ని చూసుకుంటుంది. అయితే దహనం చేసిన తరువాత బుడిదని నీటిలో కలుపుతుంటారు.

Hindu Mythologyఆలా చేయడం వలన ఆత్మ అంది పంచభూతాలలో కలుస్తుందనేది నమ్మకం. ఇక పిండ ప్రదానం చేయడం వలన ఆత్మకి విముక్తి కలిగి మరొక దేహంలోకి వెళుతుంది. ఈ మొత్తం ప్రక్రియని అంతాకూడా హిందువులు అంతిమ సంస్కారం అని అంటారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR