Home Unknown facts 10 Shocking Facts About Albert Einstein

10 Shocking Facts About Albert Einstein

0

జర్మనీకి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్ స్టీన్. ఆల్బర్ట్ ఐన్ స్టీన్ ప్రపంచ ప్రసిద్ధ విజ్ఞాన శాస్త్రవేత్త. ప్రపంచానికి సాపేక్ష విధానాన్ని పరిచయం చేసి, అఖండ ప్రతిభావంతునిగా ప్రసిద్ధి పొంది, మేధావి అనే పదానికి పర్యాయ పదంగా నిలిచిన వ్యక్తి ఆల్బర్ట్ ఐన్ స్టీన్. అయితే ఒక మనిషిలో అన్ని తెలివి తేటలు నిజంగా ఉంటాయా? మిగితా వారి మెదడుకి అయన మెదడుకి తేడా ఏమన్నా ఉందా అనే విషయం తెలుసుకోవడానికి కొందరు ఐన్ స్టీన్ చనిపోయిన తరువాత అతడి మెదడు పైన ఎన్నో రకాల పరిశోధనలు కూడా చేసారు. ఇంకా కొందరు పరిశీలకుల అభిప్రాయం ప్రకారం హైందవ పురాణాల సమాచారం ఆధారంగానే ఐన్ స్టీన్ సాపేక్షసిద్ధాంతాన్ని రూపొందించి ఉంటాడని చెబుతారు. మరి ఆల్బర్ట్ ఐన్ స్టీన్ గురించి 10 ఆసక్తికర విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఐన్ స్టీన్ జన్మించగానే అతడి తల పరిమాణం ఎక్కువగా ఉండటం చూసి ఆయన అమ్మ మరియు అమ్మమ గారు ఆశ్చర్యపడ్డారంట. ఇక పుట్టిన తరువాత రాను రాను తల సాధారణ పరిమాణంగా మారిందట. అంతేకాకుండా ఐన్ స్టీన్ పుట్టిన మూడు సంవత్సరాల వరకు మాటలు రాలేదంట.

Albert Einstein

2. మాములు మనిషి కంటే ఐన్ స్టీన్ మెదడులో పరెటల్ లోబ్ 15 శాతం పెద్దదిగా ఉందని ఒక పరిశోధన బృందం తెలిపింది.

3. ఐన్ స్టీన్ చిన్నతనంలో ఏ ఒక్క టీచర్ కూడా ఆయన్ని ప్రతిభ గల స్టూడెంట్ అని గుర్తించేవారు కాదంటా.

4. ఐన్ స్టీన్ 16 వ ఏట ఎలక్ట్రికల్ ఇంజనీర్ అవ్వడం కోసం రాసిన ఎంట్రెన్స్ ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యారు అంటా.

5. ఐన్ స్టీన్ జెర్మనీలో జన్మించారు. 1896 లో జర్మనీ పౌరసత్వాన్ని వదిలేసారు. 1901 లో స్విస్ సిటిజెన్ గా మారారు. ఇక 1955 లో అమెరికన్ సిటిజెన్ గా మరణించారు.

6. ఐన్ స్టీన్ గారికి మెమరీ చాలా తక్కువగా ఉండేదట, పేర్లు, తేదీలు, ఫోన్ నంబర్స్ ఎప్పుడు గుర్తుండేవి కాదంటా.

7. సాక్సులను ధరించడం, హెయిర్ కట్ చేయించుకోవడం అంటే అతనికి ఇష్టం ఉండేది కాదంటా.

8. ఐన్ స్టీన్ గారు అధ్భూతంగా వయోలిన్ ప్లే చేస్తారు. ఆయనకి సంగీతం అంటే చాలా ఇష్టం. ఒకవేళ సైంటిస్ట్ కాకుంటే మంచి మ్యుజిషియన్ అయ్యేవాడిని అని ఒక సందర్భంలో చెప్పారు.

9. ఆయన తన మొదటి భార్యని పెళ్లి చేసుకునే ముందు కొన్ని కండిషన్స్ పెట్టగ దానికి ఆమె అంగీకరించడంతో ఆమెని పెళ్లి చేసుకోగా ఇలా వారు 16 సంవత్సరాలు అలానే కొనసాగారు.

10. ఐన్ స్టీన్ గారు అభిమానించే శాస్త్రవేత్త గెలీలియో గెలీలి. ఇక ఆధునిక భౌతికశాస్త్రానికి ఆయనేసిన పునాది వందేళ్లుగా చెక్కుచెదరలేదు.

Exit mobile version