Home Unknown facts 56 Samvathsarala paatu kattina athi prachina khammam zilla

56 Samvathsarala paatu kattina athi prachina khammam zilla

0

మన దేశంలో ఎన్నో చారిత్రాత్మక కట్టడాలు అనేవి ఉన్నవి. అందులో కచ్చితంగా చెప్పుకోవాల్సిన వాటిలో అతి ప్రాచీన కోట అయినా ఈ ఖమ్మం ఖిల్లా ఒకటి. ఎందరో రోజులకి ఆశ్రయాన్ని ఇచ్చిన ఈ కోట గురించి ఆశ్చర్యకర విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. khammam zillaతెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా, ఖమ్మం నగరంలోని సంబాద్రి కొండపైన ఈ కోట ఉన్నది. క్రీ.శ 957వ సంవత్సరంలో నిర్మించబడిన ఈ ఖమ్మం ఖిల్లా ఇప్పటికి చెక్కు చెదరకుండా అందరిని ఆకట్టుకుంటుంది. దీనిని నిర్మించినది రెడ్డి సోదరులుగా ప్రసిద్ది చెందిన లక్న రెడ్డి మరియు వెలమ రెడ్డి అని చెబుతారు. ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయం కూడా ఉంది. ఖిల్లా వైశాల్యం 4 చదరపు మైళ్లు. దీని ప్రహరీ ఎత్తు 40 నుంచి 80 అడుగులు. వెడల్పు 15 నుంచి 20 అడుగులు. మొత్తం10 ద్వారాలు. పశ్చిమం వైపున దిగువ కోట ప్రధాన ద్వారం. తూర్పువైపు ద్వారాన్ని రాతి దర్వాజా అంటారు. దీన్నే పోతదర్వాజ అని కూడా పిలుస్తారు. కోట చుట్టూ 60 ఫిరంగులు మోహరించే వీలుంది. కోట లోపల జాఫర్‌దౌలా కాలంలో నిర్మించిన ఒక పాత మసీదు, మహల్ ఉన్నాయి. 60 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు ఉన్న జాఫర్‌దౌలా (బావి) ఉంది. కోటపై ముట్టడి జరిగినప్పుడు తప్పించుకునేందుకు ఒక రహస్య సొరంగం కూడా ఉంది. వర్షపు నీటిని నిల్వ చేసుకునేందుకు కాల్వలూ ఉన్నాయి. ఖిల్లాలోకి ప్రవేశించడానికి రెండు ముఖ ద్వారాలున్నాయి. లోపలి సింహద్వారం చదరంగా ఉండి 30 అడుగుల ఎత్తులో పెద్దపెద్ద రాళ్లతో నిర్మించారు. ప్రతి కోట గోడపై భాగం 45 అడుగుల వెడల్పుతో లోపలికి దిగడానికి మెట్లు కనబడతాయి. ప్రతి గోడ పైనా రెండు ఫిరంగులున్నాయి. ఒక నీటి కుండ కూడా ఉంది. సింహద్వారం సమీపంలో ఆరు అడుగుల ఫిరంగి ఉంది. ఫిరంగి గుండు తగిలినా చెక్కుచెదరని పటిష్ఠతతో నిర్మించారు ఈ రాతి కట్టడాన్ని. కోటగోడలపై ఉన్న చిన్నచిన్న గోడలను జాఫర్ దౌలా నిర్మించారు.అయితే వీటిని ఇటుకలు, సున్నంతో కట్టారు. ఖిల్లాలో 80 అడుగుల వెడల్పుతో ఒక పెద్ద దిగుడు బావి ఉంది. లోపలికి దిగడానికి రాతి మెట్లు ఉన్నాయి. కోట సింహందాటి లోపలికి కొద్దిదూరం వెళ్లాక అసలు దుర్గం కన్పిస్తుంది. దీనిపైకి ఎక్కడానికి చిన్న మెట్లు ఉన్నాయి. ఈ మార్గంలో చిన్నచిన్న రాతిగోడలతో ద్వారాలున్నాయి. వీటిని దాలోహిస్వారు అంటారు. కొండపై కట్టిన ఈ ఖిల్లా విస్తీర్ణం మూడు చదరపు మైళ్లు. 15 బురుజులు శత్రుసైన్యం దాడులను తట్టుకునే విధంగా ఒకదానివెంట మరొకటి రెండు గోడలు నిర్మించారు. పెద్దపెద్ద రాళ్లను కోట నిర్మాణంలో నిలువుగా పేర్చి తాటికొయ్య ప్రమాణంలో నిర్మించారు. పక్కరాళ్లు అతకడానికి ఎలాంటి సున్నమూ వాడకపోవడం గమనార్హం. వాటి చుట్టూ లోతైన కందకం తీశారు. కాకతీయ పట్టణం ఓరుగల్లు నుంచి ఖమ్మం ఖిల్లా కోటకు సొరంగ మార్గం ఉందని, దాని ద్వారానే రాకపోకలు సాగేవని కథనం కూడా ప్రాచుర్యంలో ఉంది. ఈవిధంగా కట్టిన ఈ అధ్బుత కట్టడం అప్పటి రాజుల నిర్మాణ చాతుర్యాన్ని తెలియచేస్తున్నాయి.

Exit mobile version