కృష్ణుడు అంటే మనకి గుర్తుకు వచ్చేది తల పైన ఉండే నెమలి పించం మరియు పిల్లన గోవి. కృష్ణుడు అనగానే గుర్తొచ్చే మరొక విషయం ఆయనకి పదహారు వేల మంది గోపికలు భార్యలు. మరి అయన నెమలిపించం ధరించడానికి అసలు కారణం ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం. గోపికలు ఉన్నా అత్యంత పవిత్రుడు అనే కంటే అసలు విషయంలోకి వెళితే, కృష్ణుడు అస్కలిత బ్రహ్మచారి. అంటే స్కలనం అనేది ఎరుగడు. అయితే నెమలి పరవశించినపుడు మగనెమలి అశ్రు ధారను ఆడ నెమలి మింగితే అది పునరుత్పత్తిని పొందగలదట. అంతేకాని అవి సంభోగించవు. అందుకే కృష్ణుడు తల పై నెమలీక ధరిస్తాడు. ఇదే విధంగా, పిల్లన గోవిని గోవిందుని పెదవుల వద్ద స్థానం ఎలా సంపాదించావని ఒక మహర్షి అడిగాడట. అప్పుడు పిల్లనగ్రోవి ఇలా చెప్పిందట. ఇలా చూడు నాలో ఏముందని అడిగిందట. నాలో ఏమీ లేదు. ఏ కల్మషమూలేదు. ఏ కోరికలూ లేవు, ఈ కామ, క్రోధ, లాభ, మోహ , మధ, మాత్సర్యాధి హరిషడ్వర్గాలను అదుపులో పెట్టుకుంటే జీవితం చక్కని స్వరంలా సాగిపోతుంది. తనదంటూ ఏదీ కోరని వారినే దేవుడు తన మధుకలశాల వద్ద ఉంచుకుంటాడని చెప్పిందట పిల్లనగ్రోవి. ఇక నెమలి విషయానికి వస్తే ప్రపంచంలో సంభోగం చెయ్యని జీవి ఇది. అత్యంత పవిత్రమైన జీవి కనుకే మన దేశానికి జాతీయ పక్షిగా ప్రకటించబడుతుంది. పదహారు వేల మంది గోపికలు ఉన్నా కూడా శ్రీ కృష్ణుడు అత్యంత పవిత్రుడు. అందుకే నెమలి పించం తలపై ఉండి శ్రీ కృష్ణ భగవానుడి పవిత్రతను తెలియజేస్తుంది.శ్రీకృష్ణుడు కొంటెవాడు మాత్రమే. అయితే గోపికలు, కృష్ణుల మద్య ఉన్నది ఒక పవిత్రమైన చెలిమి మాత్రమే అని చెప్పడానికి నిదర్శనము ఈ నెమలి పించం. అందుకే శ్రీకృష్ణుడు భోగిగా కనిపించే ఒక యోగీశ్వరుడు అని మన పురాణాలూ చెబుతున్నాయి.
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.