తలలేకుండా మొండెం రూపంలో అమ్మవారు వెలసిన ఆలయం గురించి తెలుసా ?

0
2255

ఆదిపరాశక్తి ఇక్కడి ప్రాంతంలో తొమ్మిది చోట్ల వెలిసిందని స్థానిక భక్తుల నమ్మకం. నవదుర్గలలో ఈ అమ్మవారిని ఒకరుగా భావించి ఇక్కడి భక్తులు కొలుస్తుంటారు. ఇక్కడి అమ్మవారికి తల కత్తిరించబడిన రూపం అని పేరు వచ్చింది. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది ? అమ్మవారికి అలా పేరు రావడం వెనుక పురాణం ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Adipara Shakti

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం, అన్న జిల్లాలో చింతపూర్ణి అనే గ్రామం ఉంది. ఇక్కడే చింతపూర్ణి అమ్మవారి ఆలయం ఉంది. ఇక్కడి భక్తులు ఈ అమ్మవారిని నవదుర్గలలో ఒకరిగా కొలుస్తారు. ఈ అమ్మవారి పేరుమీదనే ఈ గ్రామానికి చింతపూర్ణి అనే పేరు వచ్చిందని చెబుతారు. ఈ ఆలయం ఒక కొండ అంచున శిఖర భాగం మీద నిర్మించబడిన చిన్న ఆలయం.

Adipara Shakti

ఇక ఆలయ పురాణానికి వస్తే, ఈ అమ్మవారి అసలు పేరు ‘చిన్న మస్తకి’. పూర్వం ఒకప్పుడు దేవతల కోరిక మేరకు ఆదిశక్తి రాక్షస సంహరణకు వస్తు తన వెంట జయ, విజయ అనే ఇద్దరు రాక్షస యోగినులను తీసుకొని వచ్చి రాక్షసులను అందరిని సంహరించి విశ్రాంతి గా కూర్చోగా, జయ, విజయ ఇద్దరు కూడా తమ రక్త దాహం ఇంకా తీరలేదు అని చెప్పగా, అప్పుడు వెంటనే ఆదిశక్తి తన తల నరికే వేసుకొని రక్త దాహం తీర్చుకోమని చెప్పింది. తాను ఇకనుండి తలలేకుండా ఉన్న మొండెం రూపంలో ఉండిపోతానని చెప్పిందని పురాణం.

Adipara Shakti

అందువలనే ఈ అమ్మవారికి చిన్న మస్తకి అనగా తల కత్తిరించబడిన రూపం అనే పేరు వచ్చినది. అంతేకాకుండా పూర్వం ఒక వ్యాపారి కి పిండరూపంలో ఉన్న అమ్మవారి మూర్తి కనిపించగా అక్కడే ప్రతిష్టించి పూజలు చేసాడు. ఇలా పూజించడం వలన అయన చింతలు అన్ని తొలగిపోయాయి. ఇలా తన చింతలు అన్ని తీర్చిన అమ్మవారికి చింతపూర్ణి అని కొలుస్తూ రావడంతో అమ్మవారికి ఆ పేరు వచ్చినది పురాణం.

Adipara Shakti

ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహం పిండరూపంలో ఉంటుంది. ఇలా ఉన్న ఈ అమ్మవారి రూపానికి పట్టు వస్త్రాలతోను, ఆభరణాలతోను, పూలదండలతో అలంకరిస్తారు. ఈ మూర్తి మొత్తం బంగారు రేకుతో చేసిన పెద్ద మందిరంలో ఉంటుంది. ఇక్కడే గుడి గోడ పక్కన ఒక పెద్ద మర్రిచెట్టు కూడా ఉంది. దీనికారణంగా ఆలయం ఎక్కువ ఎత్తు ఆకట్టడానికి వీలు లేకుండా పోయిందని చెబుతారు. భక్తులు ఈ చెట్టుకు కోరికలు నెరవేరాలని ముడుపులు కడతారు. కోరికలు నెరవేరగానే వచ్చి మళ్ళీ వేరొక ముడుపు కడుతుంటారు.

Adipara Shakti

ఇలా వెలసిన ఆ ఆదిశక్తి భక్తుల చింతలు నెరవేర్చే దేవిగా ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం ఇక్కడ మాత డా మేళా అనే ఉత్సవం చాలా ఘనంగా నిర్వహిస్తారు.