నా పేరు భరత్….ఎందుకో తెలియదు చిన్నప్పటి నుండీ సినిమాల పిచ్చి, ప్రభావం నా పైన చాలానే ఉంది. అయితే సినిమాల పిచ్చి ఉన్నవాళ్ళకి కొందరు నటులు, నటీమణులంటే ప్రత్యేక అభిమానం ఉంటది. ఇలాగే నాకు తెలుగు సినిమాకి సంబందించినంత వరకూ పవన్ కళ్యాణ్ అంటే ప్రత్యేక అభిమానం ఉంది.
అయితే ఈ అభిమానానికి ప్రత్యేక కారణాల లేకపోలేదు….తమ్ముడు లో బాక్సర్ గా, మేడ్ ఇన్ ఆంధ్ర student అంటూ అతను చేసిన పీక్ డాన్సులు, బద్రి లో నువ్వు నందా అయితే నేను బద్రి…బద్రీనాథ్ అంటూ చెప్పిన సంభాషణలు…ఖుషి లో బెంగాల్ టైగర్ అంటూ చేసిన….హడావిడి అన్ని వెరసి PK అంటే ఒక ప్రత్యేక అభిమానం !
ఇలా ఒక నటుడు పైన అభిమానం పెంచుకున్న వారు ఎవరైనా…అతనికి సరి తూగే నటుడిని తన హీరోతో పోల్చడానికి ఇష్టపడరు. అయితే ఇది పరిస్థితులని బట్టి మారుతూ ఉంటది. నాకు ఇలాంటి పరిస్థితి 2006, ఏప్రిల్ 28 తరువాత మారింది. అప్పుడే పరీక్షలు రాసి సమ్మర్ హాలిడేస్ లో కలిగా ఉన్న నేను నా మిత్రులు…థియేటర్లో సినిమా చూడడానికి వెళ్ళాము. ఆ సినిమా పేరు పోకిరి….అందులో యాక్ట్ చేసిన హీరో పేరు మహేష్ బాబు అని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు.
ఏప్రిల్ 28 రోజు మూవీ చూడ్డానికి వెళ్లిన నాకు ఒక చేదు అనుభవం ఎదురైంది….అప్పుడు నేను మైనర్ అవ్వడంతో మూవీ చూడడం కుదరలేదు. ఒక దిక్కు సినిమా అదిరిపోయింది అనే టాక్ ఎలాగైనా చూడాలి అని పదే పదే గుర్తు చేస్తుంది. చివరకి ఒక రోజు తెలిసిన వాళ్ళు ఉండడం తో మేనేజ్ చేసి సినిమా థియేటర్లోకి దూరేసాను.
70 MM స్క్రీన్ మీద బొమ్మ మొదలైంది…పోలీస్లు, రౌడీలు, మాఫియా, ఆలీ భాయ్ అనే తెలుగు సినిమా మర్చిపోయిన మాఫియా ఇంట్రడక్షన్ అండ్ పూరి జగన్నాధ్ అంటూ టైటిల్ కార్డ్స్ పూర్తయ్యే సరికి….ఇందిరా నగర్ కాలనీలో రౌడీలని పరిగెత్తిస్తూ…మహేష్ బాబు ఎంట్రీ !
షెడ్డు బాగుంది కొట్టుకోడానికి ఈ మాత్రం ఉండాలి, ఒక్కసారి Commit అయితే నా మాట నేనే వినను…నీ అమ్మ మీద ఒట్టు నీకు పగలకపోతే నన్ను అడగరా…అంటూ MB చెప్పే డైలాగ్స్ కి…థియేటర్ లో ఉన్న మిగతా ఫాన్స్ తో పాటు…నన్ను కూడా ఈల వేసి గోల చేసేలా చేసాయి. అప్పటివరకు….బద్రి, ఖుషి, జానీ సినిమాల్లో PK introduction సీన్స్ కి అలా గోల చేసిన నేను మహేష్ బాబు సినిమాకి అలా గోల చేయడం ఇదే మొదటిసారి.
ఇక్కడ సమరమే పాట…అది అయిపోగానే…పండు గాడు చెప్పే ‘ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో అదే పండు గాడు…ఆ తరువాత విలన్స్ తో కూర్చొని…విలన్స్ లో ఒక్కడిని కొట్టి…నేను చావుకి భయపడను అంటూ లాస్ట్ లో గన్ తిప్పి…సినిమాలు చూడట్లేదేంటి…అని డైలాగ్ చెప్పే సీన్స్ చూసాక…నా మైండ్ బ్లాక్ అయ్యింది.
ఎందుకు అంటే నేను అప్పటివరకూ మురారి, ఒక్కడు, నిజం మరియు అతడు సినిమాల్లో చూసిన మహేష్ బాబు వేరు…ఆ మహేష్ బాబు వేరు అని ఒక క్లారిటీ వచ్చేసింది. పండుగాడు చెప్పే ప్రతి డైలాగ్ కి నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్న విషయం మర్చిపోయేల చేసింది పూరి రాసిన…పండు గాడి క్యారెక్టర్.
రాముడు మంచి బాలుడు అనే స్టీరియోటైప్ ఇమేజ్ ని పక్కన పెట్టి పూరి పండు గాడు క్యారెక్టర్ ని రాసాడు. ఈ విషయం ఇంటర్వెల్ లో వచ్చే గోల్కొండ ఫైట్ చూసాక ఒక picture perfect క్లారిటీ వచ్చేసింది. ఇంటర్వెల్ లో బయటకి వచ్చిన నాకు…థియేటర్ లో చూసిన పండు గాడే తిరుగుతూన్నాడు..మరి చెప్పాలి అంటే ఇంటర్వెల్ ఫైట్ లో ‘పండు గాడు శృతితో ‘నేను నువ్వు అనుకుంటున్నట్టు పోకిరిని కాదు…క్రిమినల్ ని’ అని చెప్పే ఫైట్స్….బద్రి లో PK నంద తో చెప్పే డైలాగ్స్ కంటే ఎక్కువ HIGH ని ఇచ్చాయి.
ఇక ఇవి కాకుండా సెకండ్ హాఫ్ లో…ఆలీ భాయ్ తో కూర్చొని, ‘పిల్లల్ని చంపడం NOT ఒకే…వాడిని కూడా చంపనివ్వను అది నా కాన్సెప్ట్’ అని మహేష్ చెప్పే డైలాగ్స్…ఇంకో సన్నివేశంలో ‘నీ అక్కనో…చెల్లినో…వీడియో తిస్తె తెలుస్తుంది రా’ అని MB చెప్పే intense డైలాగ్స్ పండు గాడి క్యారెక్టర్ లో MB చేసిన performance అప్పటికి అప్పుడు idi మహేష్ బాబు అనేలా చేసాయి.
క్లైమాక్స్ లో నాజర్ చనిపోయినప్పుడు మహేష్ ఇంటెన్సిటీ…ఆ రన్నింగ్ స్టైల్…సినిమా చూసి బయటకి వచ్చాక నాకు తెలియకుండానే….మహేష్ బాబు అభిమానిని చేసేశాయి. కానీ ఇది ఎప్పుడు నేను ఒప్పుకోలేదు…కారణం నాలో ఉన్న PK అనే యుఫొరియా’.
ఆ రోజు అర్ధం అయ్యింది…ఒక హీరో మాత్రమే నచ్చుతాడు…ఒక హీరో మాత్రమే అసలైన హీరో మిగతావాళ్ళు హీరోలు కాదు అనేది ఎంత తప్పో అని. ఆ తరువాత మహేష్ బాబు…జల్సా సినిమా లో వాయిస్ ఓవర్ చెప్పినందుకు అటు PK & మహేష్ ఫ్యాన్ గా చాలా ఆనందం వేసింది.
Ending This Note with thanking….PK, Puri and Mahesh Babu.