సీత రామం – ఇది ఒక లవ్ స్టోరీ అని ఫిక్స్ అయ్యి థియేటర్ కి వెళ్ళాను. కానీ సినిమా మొదలైన తీరే…ఏదో యాక్షన్ సినిమాకి, ఇండియా-పాకిస్తాన్ మధ్య జరిగే, జరిగిన, జరుగుతున్న కాశ్మీర్ నేపధ్యం , కాశ్మీరులో యుద్ధంతో మొదలైంది. సారే, మన రామ్ అదే దుల్కర్ క్యారెక్టర్ ఆర్మీ కాదా…అందుకు అయ్యి ఉంటుందిలే అనుకుంటూ చూడడం స్టార్ట్ చేస్తే….కాశ్మీర్ లోయ అందాల నడుమ హీరో సీత కోసం చేసే యుద్ధంతో విరామం పడింది.
ప్రేమ-యుద్ధం, మనుషులు-మతాలు, ఇండియన్- పాకిస్తాన్:
ఫస్ట్ హాఫ్ అయిపోయాక ఒక మంచి ప్రేమ కథ చూసాము అన్న ఫీల్ తో బయటకి వస్తే…సెకండ్ హాఫ్ లో స్టార్ట్ అవుతుంది అస్సలు కథ,…మనుషులు-మతాలు, ప్రేమ-ప్రేమికులు చేసే యుద్ధం, హిందువులు-ముస్లిములు, ఇలాంటి సున్నితమైన అంశాల చుట్టూ కథ తిరుగుతుంది. అప్పటి వరకు ప్రేమ కథే అనుకున్న…కానీ హను రాఘవపూడి ఈ ప్రేమ కథలో ఇండియా-పాక్ మధ్య కాశ్మీర్ తళుకు యుద్దాన్ని, మాట్లాడటానికి కూడా భయపడే హిందూ-ముస్లింల మధ్య ఉన్న అంశాలను, రామ్-సీత అనే ఇద్దరి ప్రేమికుల కోణంలో చూపించిన తీరు, ఇచ్చిన సందేశం అన్ని వెరసి …..సీత-రామంని ఒక క్లాసిక్ లవ్ స్టోరీని చేసాయి.
ఒక రోజా- ఒక బొంబాయి – ఒక సీత రామం:
ఈ సినిమా చూస్తున్నంత సేపు….మణి రత్నం సినిమాలైనా రోజా, బొంబాయి గుర్తు వచ్చాయి. రోజా-బొంబాయి సినిమాలో గారు చూపించిన కాశ్మీర్తీ చుట్టూ తిరిగే తీవ్రవాదం, హిందూ-ముస్లింల మధ్య ప్రేమ అయన చెప్పిన విధానంని గుర్తుకు తెచ్చాయి. ఇలాంటి ఒక క్లాసిక్ టచ్ ఉన్న లవ్ స్టోరీ చూసి కొన్ని సంవత్సరాలు అవుతుంది Maro Charitra, Geethanjali…. తరువాత క్లాసిక్ అనిపించే అంత లవ్ స్టోరీస్ లేవు మన తెలుగులో…చాల రోజులకి అలాంటి క్లాసిక్ లవ్ స్టోరీ, తో పాటు మణి రత్నం లాంటి మణి హను రాఘవపూడి మన టాలీవుడ్ లో ఉన్నాడు అనిపించింది.
సినిమాలో కాశ్మీర్లో జరిగే చాల సన్నివేశాలు రోజా సినిమాను గుర్తుకు తెచ్చాయి. ఇది ఒక్కటే కాదు మణి రత్నం గారి సినిమాల్లో ఉండే ‘mirror frames’, top angle shots, heroine scenes మణి రత్నం సినిమా చూస్తున్నామా? అనేలా ఉంటాయి.
Lieutenant Ram – Dulquer:
రామ్ పాత్రకి దుల్కర్ 100 % అప్ట్, ఆ పాత్ర కి ఏమి కావాలో అది ఇచ్చేసాడు. మహానటిలో విలన్ షేడ్ ఉన్న జెమినీ పాత్ర చేస్తే, దుల్కర్ ఆ పాత్రని చేసిన తీరు చూసి మనవాళ్ళు అతన్ని మెచ్చుకున్నారు.. ఇక ఈ మూవీ లో Lieutenant రామ్ అనే honest లవర్ అండ్ patriotic ఆర్మీ ఆఫీసర్ క్యారెక్టర్ కి మనవాళ్ళు సాలం….సల్మాన్ అనక మనరు. అస్సలు భలే చేసాడు…అతన్ని కళ్ళలో ఆర్మీ ఆఫీసర్లో ఉండే నిజాయితీ, అదే కళ్ళలో సీత అంటే పడి చచ్చే ప్రేమ తళుకు భావాలని తన కళ్ళతో, నటనతో మెప్పించాడు.
రామ్ Character Arc విషయానికి వస్తే, అనాధ అయినా రామ్ వృత్తిరీత్యా ఒక ఆర్మీ ఆఫీసర్, కానీ ఈ పాత్ర కి మనుషులంటే, మతమంటే, అన్నిటికంటే ప్రాణమంటే ఎంత విలువైనది అనేలా ఉంటుంది. ఒక సీన్ లో సీతని ఏమే అనడం అతను అనాధ కాబట్టి ఆలా అంటాడు అనేది లోతుగా విశ్లేషిస్తే తెలుస్తుంది.
Sita గా Mrunal Thakur:
ఇక సీత పాత్ర విషయానికి వస్తే, Mrunal Thakur హిందీ లో సూపర్ ౩౦, జెర్సీ సినిమాల్లో మెరిసిన ఈ హీరోయిన్కి తెలుగు లో ఇది మొదటి సినిమా. ఏరికోరి, మృణాల్ ని పెట్టుకోవడం, సీత పాత్రని ఎంచుకోవడంలోనే దర్శకుడు హను కొంత విజయం సాధించాడు అని చెప్పొచ్చు. కొత్త మొహం అయినప్పటికీ మృణాల్ తెర మీద ఉన్నంత సేపు చూపు తిప్పుకోలేము. కథలో సీత పాత్ర మృణాల్ కోసమే రాసారేమో అనే విధంగా తాను మెప్పించింది. తెలుగు సినిమా తెర మీద కనిపించిన సీత పాత్రల్లో ఈ పాత్ర గుర్తుండిపోయేలా మృణాల్ తన అభినయంతో ఆకట్టుకుంది.
ఇంకా ఈ పాత్ర గురించి చాల చెప్పాలని ఉంది కానీ మళ్లీ spoilers and story revealing పాయింట్స్ చెప్పే ప్రమాదం ఉందని ఇక్కడితో ఆపేస్తున్న.
Cinematography & Music:
Manam, Hello, AVPL and Vakeel Saab లాంటి మూవీస్ కి పని చేసిన cinematographer P.S. Vinod ఈ మూవీ కి పని చేసారు. సీత రామంకి సినిమాటోగ్రఫీ ఒక major asset and every frame ఒక పెయింటింగ్ లాగా ఉంటుంది. కాశ్మీర్ అందాలను, రష్యా లో పార్ట్, అండ్ హీరో-హీరోయిన్ మధ్య వచ్చే సీన్స్ ఈయన సినిమాటోగ్రఫీతో elevate చేసారు. సినిమాలో చాల frames ని ఫోటో చేసి ఇంట్లో పెట్టుకోవాలి అనేలా ఉంటాయి.
పడి పడి లేచే మనసుతో హను రాఘవపూడి తో కలిసి పని చేసిన విశాల్ చంద్రశేఖర్ ఈ మూవీ కి కూడా పని చేసారు. పడి పడి లేచే లో ప్రతి పాట బాగుంటుంది కానీ సినిమా బాగాలేకపోవడం వాళ్ళ అవి అంత జనాలకి అంతగా ఎక్కలేదు…కానీ సీత రామం విషయంలో మంచి కథ కుదరడంతో విశాల్ చంద్రశేఖర్ ఇచ్చిన పాటలు, నేపధ్య సంగీతం సినిమాకి ఒక Soul గా పని చేసాయి. సినిమాలో విశాల్ ఇచ్చిన నేపధ్య సంగీతం ఒక పాత్ర అని చూపొచ్చు ప్రీ-ఇంటర్వెల్, హీరోయిన్-హీరోయిన్ మధ్య జరిగే సంభాషణల మధ్య వచ్చే సీన్స్ లో…మరి ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో విశాల్ చంద్ర ఇచ్చిన Score ఈ సినిమాకి Extra Score.
హిట్ కొట్టే ప్రయత్నములో ఒక క్లాసిక్ తీసాడు హను:
ఇవి మాత్రమే కాదు…సినిమాలో సెట్స్, కాస్ట్యూమ్స్, మేకప్, ప్రతి డిపార్ట్మెంట్ ది బెస్ట్ ఇచ్చారు అండ్ ఈ కథకి ఎం కావాలో నమ్మి అది ఇచ్చిన నిర్మాతలు వైజయంతి మూవీస్, Swapna సినిమా వాళ్ళని మెచ్చుకోకుండా ఉండలేము.
ఒక ప్రేమ కథలో హిందూ-ముస్లింల మధ్య ఉండే అపోహలు, దానికి దారి తీసే గొడవలు, కాశ్మీరీ నేపధ్యం, ఇండియా-పాకిస్తాన్ అనే అంశాలు, ఒక పాకిస్థానీతో ‘Jai Shree Ram’ అని చెప్పించడం, హిందూతో ‘Insha Allah’ అని అనిపించడం లాంటివి పెట్టి వాటిని చూసే ఆడియన్స్ ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా, నొచ్చుకోకుండా తీయడం అనేది ఈ సినిమా విషయంలో అతి పెద్ద విజయం…ఇందుకు గాను హను రాఘవపూడిని మెచ్చుకోకుండా ఉండలేము.
కొన్ని అపజయాలను చూసి ఆ నొప్పిలో నుండి ఒక మంచి సినిమా తీయాలనే ప్రయత్నం లో ‘హను రాఘవపూడి’ ఒక క్లాసిక్ సినిమానే తీసాడు. ఇలాంటి సినిమా ఇచ్చినందుకు హనుకి కృతజ్ఞతలు చెప్తూ…చివరగా సీత రామం లాంటి కథలు చాల అరుదుగా వస్తాయి … ఇలాంటి కథని, మీరు థియేటర్స్ లో చూడకపోతే ఒక క్లాసిక్ ని చూడడం మిస్ అయినట్టే.